Tuesday, 30 January 2018

ఎవరివో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ దొరికింది మాకు / GURUJI MAHARAJ 944 12 88 365



ఎవరివో ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికెట్ మాకు దొరికింది...
2009 నుండి 2010 లో మేము మార్కెటింగ్ కంపెనీ పెట్టినప్పుడు మా దగ్గర నిరుద్యోగ యువతకి కనీసం ఒక 20 మందికి ఉద్యోగ అవకాశం కల్పించాము...
ఐతే కొన్ని కారణాలవల్ల ఒక మూడు సంవత్సరాలు చేసి విరమించుకున్నాము..
అటుపిమ్మట నేను హిమాచల్ ప్రదేశ్ కాశి సాధువు సన్యాసి ఆగోరి ఋషీ పరంపరలో వెళ్ళాను 
కొంతకాలం తర్వాత వోచాను...
======================
మా దగ్గర ఒక స్టూడెంట్ ఇంటర్ మీడియట్ ఒరిజినల్ సర్టిఫికెట్ పెట్టినాడు....
అవి తిరిగి రిటర్న్ తీసుకోలేదు... అతను మర్చిపోయాడు... సరే కారణం ఏదైనా కావొచ్చు ...
30-1-2018
ఈ రోజు నా పాత జీవితంలో ఏమి ఏమి పనులు చేశాను అని ఒక్కసారి మా స్టోర్ రూమ్ గది ఆఫీస్ పుస్తకాలూ సర్దుతూ ఉంటె ఇవి కనబడ్డాయి....
అవి చూసాక చాల జాలేసింది భాధ కలిగింది కూడా ..........
అతని పేరు రంజిత్ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణము అని ఉంది లేదా దాని పరిసర గ్రామం కావొచ్చు దయచేసి అతనికి తెలిసేలా షేర్ చేయగలరని మాయొక్క మనవి...
ఇట్లు మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ 944 12 88 365

Monday, 29 January 2018

గ్రహణం అంటే బయం దేనికి ?


ఓంకారం గురూజీ మహరాజ్
 🕉🕉🕉🕉🕉🕉
జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం:
ఏ రాశులవారిపై ప్రభావం ఉంటుంది ?

ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేది సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.

సూర్య,చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ,కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

జనవరి 31న చంద్రగ్రహణం

ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక,సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ...

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం

సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం
రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు
రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )
గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.
సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం "76"నిమిషాలు.

ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...

చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా ,యూరప్ ఈశాన్యప్రాంతం.ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,పసిఫిక్ మహాసముద్రం,హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.

గ్రహణ గోచారం ఇలా...

ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశి అవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి,ఆశ్లేష,మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఏ రాశివారిపై ఏ ప్రభావం

ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.
వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యఫలం.
కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.
గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.

చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును,ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు,అది వాస్తవం కాదు యదావిధిగా మల,మూత్ర విసర్జన చేయవచ్చు.నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై గరిక పోసలను వేయాలి.దీనివలన ఆహార పదార్ధాలకు గ్రహణ ప్రభావము పడకుండా కాపాడబడతాయి.

ఆ వేళలో ఆహార పానీయ నియమాలు

అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు,భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు,జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి.అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు,పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రీయ పద్ధతి అవసరం

గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి , జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు,తర్వాత పట్టు,విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భవవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలోఫలితం లభిస్తుంది. ముసలివారు, చిన్నపిల్లల్లు,గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.

తర్వాత ఇలా చేయాలి.

గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి,విగ్రహాలు,యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.జంద్యం(గాయత్రి)వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.ఇంటిముందు,వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాలలు,కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి. మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు,పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర,బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి,పెదలకు ఏదేని ఆహర,వస్త్ర,వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు,గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.

మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహరాజ్ HYD 9441288365

Sunday, 21 January 2018

నవగ్రహాలకి ఇలా పూజ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చుడండి .........

పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?
నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.
గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.
ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.
మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!

తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365






Thursday, 11 January 2018

మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఎలా పూజిస్తే ఫలితం ఉంటుంది ? Omkaram Guruji Maharaj 9441288365


మహాశివరాత్రి పర్వదినమున  బిల్వపత్ర_దర్శనం_వలన_అత్యంత_పుణ్యం_లభిస్తుంది.

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము. ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!
మహాశివరాత్రి పర్వదినమున .....
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.‌ వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
మహాశివరాత్రి పర్వదినమున ...........
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి.
మహాశివరాత్రి పర్వదినమున......
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.

"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.

మహాశివరాత్రి పర్వదినమున ........
పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

* మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు.

ఇంటి ఆవరణ లో,
#ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!
#తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
#పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి,
#దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!

హర హర పార్వతి పతయే మహాదేవ శంభో శంకర !
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహరాజ్ 9441288365 HYD

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...