Sunday, 9 August 2020

ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో మనిషి సుఖంగా ఉన్నాడా ? #OmkaramFoundations #OmkaramAyurvedam #www.ManaaGuru.Com #www.ManaOmkaram.com


ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో మనిషి సుఖంగా ఉన్నాడా ?..#OmkaramFoundations #OmkaramAyurvedam

#www.ManaaGuru.Com #www.ManaOmkaram.com #OmkaramContact #OmkaramGurujiMaharaj 

మానవ నాగరికత పుట్టినప్పటినుంచి మనిషికి నేడు లభ్యమవుతున్నన్ని సౌకర్యాలు ఇంతకు ముందెన్నడూ లభ్యం కాలేదు. ఎన్ని భోగాలను అనుభవిస్తున్న మానవుడు, నిరాశ, నిస్పృహ, అశాంతితో, అసంతృప్తితో ఉంటున్నాడు. కారణం తనను తాను " ప్రక్కవాడితో పోల్చుకుంటున్నాడు కానీ, పాతవారితో పోల్చుకోవడం లేదు... ,_*

*_గతరోజుల్లో ఇళ్ళలో ఇడ్లీలు చేసుకోవాలంటే రుబ్బురోలు ఉండేది. ఎంత శ్రమ పడితే ఇడ్లీ తయారయ్యేది. బావుల నుంచి నీళ్ళు చేదుకోవలసి వచ్చేది. లేదా బోర్లలో నుంచి పంపును కొట్టి నీళ్ళు రాబట్టుకోవాలంటే ఎంత కష్టపడవలిసి వచ్చేదో ఆ రోజులను చూసిన వారందరికీ విదితమే.._*

*_అలాగే పంటపొలాల్లో రైతులు పంటను కోయటం, వరిలాంటివైతే కుప్పవేయటం, తర్వాత నూర్చటం... అందులో ఎంత శ్రమ ఉండేది ! ఎంత మంది శ్రమ పడితే ఒక ఎకరం నుంచి పంట ఇంటికొచ్చేది. నేడు అలాంటి శ్రమ లేకుండా చాలా సుఖంగా మనకు ఆ పని యంత్రాలు చేసిపెడుతున్నాయి._*

*_ఇక్కడ చెప్పదలుచుకున్న దేమంటే మనం కావాలని ఆ యంత్రాలను కనుగొన్నాం. మన జీవనం సుఖవంత మొనర్చడానికి మనం సమయాన్ని, శ్రమను, ధనాన్ని పరిశోధనలపై వెచ్చించి వీటిని కనుగొన్నాము. ఏరంగం తీసుకున్నా ఈ తరం మనుషులకు లభ్యమవుతున్నన్ని సౌకర్యాలు, వస్తుసంపద, ఉపకరణాలు వంద సంవత్సరాల క్రితం రాజులకు కూడా లభించలేదు. .._*

*_సుఖం విషయానికొస్తే ఈ తరంలోని ప్రతీవ్యక్తి ఒక మహారాజే ! వాహనాలు, ఫోన్లు, కనీసం ఊహించని వస్తువులు వాడుతున్నాము. మరియు అన్నికాలల్లో అన్నిరకాల పండ్లు, కాయగూరలు లభ్యమవుతున్నాయి. రోడ్డు, రైలు మార్గాలు మనకు ఎనలేని సుఖాన్ని తీసుకువచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి.._*

*_ఇన్ని సాధించిన మనం ఇంతకు ముందు తరాల వారికన్నా సంతోషంగా ఉండాలి కదా ! నిజంగా అలా ఉన్నామా అంటే లేమనే చెప్పాలి. ..._*

*_కారణం పెరిగిన వస్తుసంపదలు మనిషిలో అధికంగా భౌతిక దృష్టిని ప్రేరేపించి, ఆధ్యాత్మిక దృష్టిని తగ్గించాయి. ఉపకరణాలను, వస్తుసంపదలను అందరి కన్నా ముందు, అందరికన్నా ఎక్కువగా పొందాలన్న ఒక తాపత్రయం చాలా మందిని నీతి మార్గం నుంచి వైదొలగేటట్లుగా చేస్తున్నది ._*

*_స్వార్థరహిత ప్రేమ కొరవడుతోంది. తొందరగా పొందాలి, ఆయుర్ధాయం పూర్తవకముందే సాధ్యమైనంత వరకు ఎక్కువ అనుభవించాలన్న ఒక తాపత్రయం మనిషిని ధర్మానికి దూరంగా తీసుకొని వెళుతున్నది ._*

*_నైతిక విలువలకు, నిజాయితీకి, ధార్మిక జీవనానికి నేటి ఆధునిక మానవుడు దూరమైనాడు మనం వస్తువుల చేతిలోకి వెళ్ళిపోవటం బలహీనత._*

*_మనిషి సౌశీల్యం, ధర్మానురక్తి, ఆధ్యాత్మికత వలన వచ్చే బలం పొందకపోవడం వలన, తాను కనుక్కున్న వస్తువులు తనకు సహాయకారులుగా, ఆనంద ప్రదాయినులుగా కాకుండా దుఃఖకారకాలుగా మారుతున్నాయి.._*

*_నిజానికి ప్రక్కవారితో పోల్చుకొని వారికన్నా మిన్నగా ఉండాలన్న తపన మనిషిని మృగములా మార్చి పందెంలోకి నెట్టేస్తుంది. తనకు ఇష్టం లేకపోయినా పందెంలో తోయబడ్డాడు కాబట్టి పరుగెత్తాల్సి వస్తున్నది.ఈ పరుగే ఆందోళనకు, ఒత్తిడికి గురిచేస్తున్నది._*

*_"ధర్మంగా సంపాదించటానికి చాలా సమయం పడుతుంది.కాబట్టి ఎలాగోలా ధనం కూడబెట్టాలి . అనేభావన సమాజంలో బలంగా నాటుకుపోయింది._*

*_"నిండా మునిగిన వారికీ చలి ఏమిటి..? " అన్నచందాన ధర్మానికి సంబంధించిన విషయాలను వినటానికి కూడా సమయం లేదు నేటి మనిషికి._*

*_డొక్కనిండివున్నది. ఇంకా అక్కడ ఏమి పట్టదు. ఐనా ఇంకా కావాలి. ఇది లోభం. ఇదొక భయంకరమైన అంటువ్యాధి.ఇంకా కావాలనీ కోరుకోవడం మానసిక బలహీనత కాకపోతే మరేమవుతుంది... ? దీనిని జబ్బు అని అందామా...?లేక వ్యసనం అందామా...?_*

*_ఈ వస్తుసంపదంతా ఎవరి వలన సాధ్యమైంది..? భగవంతుడి వలననే కదా...? ఆయనలేకపోతే మనం ఒక్క క్షణం ఊపిరి కూడా తీసుకోలేం కదా ! ఆయన నుంచే ఇదంతా పొందాం._*

*_అనుభవిస్తున్న సంపదంతా కూడా ఆయన వలననే మనకు సాధ్యమైంది. అహంకారంతో మన స్వప్రయత్నం ద్వారనే సాధ్యమైంది అంటూ అనుభవిస్తున్నాం. మనం కృతఘ్నులమవుతున్నామేమో !కాస్త ఆలోచించండి......,_*

..

మీ శ్రేయోభిలాషి ఓంకారం ఫౌండేషన్ 


జ్యోతిష్య బ్రహ్మ గురూజీ మహారాజ్ Hyd 

8331085555 8500034444 9059406999..

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...