Friday, 27 October 2017

మన గురువు గారి పర్యటన

మన అభిమానుల కోరిక మేరకు డిల్లీ పర్యటన చేస్తున్నాము.

ఎందుకనగ ఎంతో మంది నిరుధ్యోగ యువకుల ఏదైనా పని లేదా జాబ్ చేసి నెలకు కనీసం నెలకి 10 వేలు వచ్చిన చాలు ఏదైనా మార్గం దోరుకితే చాలు అనే ఉద్ధేశ్యంతో మమ్మల్ని కలవటంతో వారి కోరిక మేరకు...

మనకు తెలిసినా ఉత్పత్తి కంపెనీల వ్యాపార సమాచారం మరియు లాభ విశేషాలు తెలుసుకుని మన వారికి అందిద్దమని మా ప్రయణం...

మాకు తెలిసి అక్కడ ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా మా అభిమానులకు అందియ్యాలని మా కోరిక
ఇట్లు  మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 
944 12 88 365

2018 లో కొన్ని రాశులు కోటీశ్వరుల ? నిజమా ?

26-10-2017 గురువారం రోజున
శని గ్రహం ధనస్సు రాశీలో ప్రవేశిస్తే

ఏ రాశీ వారికి శుభం ?
ఏ రాశీ వారికి అశుభం ?

చాల మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఎంతవరకు కరెక్టు  ?

నేటినుండి  గోచార రీత్యా  శనైశ్చరుడు  ధనస్సులో వస్తున్నాడు. ద్వాదశ రాశులకి లగ్నాలకు ఫలితాలు...

*1 మేష రాశికి
శుభం, ఆదాయ వృద్ధి, తండ్రి తరఫు ఆస్థి నష్టం
మాజిక సహకారం లభిస్తుంది, శత్రువుల పై విజయం.


*2 వృషభ రాశికి
( తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు )
స్వల్ప శుభం, ఉద్యోగస్తులు ఆశించిన ఫలితాలు సాధించలేరు, ఉద్యోగ ఆదాయలో కాస్త ఇబ్బందులు, మాటకు విలివ తగ్గును,

*3 మిధున రాశికి
అత్యంత శుభం, అవివహితులకు వివాహ యోగం, పేరు ప్రతిష్టలు పెరుగును, ప్రజల మనిషిగా గుర్తింపు, స్థిర ఆస్తులు, వాహనాలు కొంటారు.

*4 కర్కాటక రాశికి
శుభ ఫలితాలు తక్కువగా సూచిస్తున్నాయి. కష్టాలు ఎదుర్కునే ధైర్యం  సహకార లోపం,

( ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి, )  ఆరోగ్యం కొరకు అధిక ధన ఖర్చులు.


*5 సింహ రాశికి ఉగాది నుండి కాస్త
శుభం, అవివహితులకు వివాహం యోగం ఉంది, 50%
ప్రేమికులకు శుభ సమయం, సంతానం ప్రయత్నాలు నెరవేరుతాయి, విదేశీయానం సూచిస్తుంది, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

*6 కన్యా రాశికి *
శుభఫలితాలు తక్కువగా సూచిస్తున్నాయి, గృహంలోని వారితో మనస్పర్థలు, వాహన ఇబ్బందులు, అనారోగ్యము, వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన శ్రమ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు, వ్యాయామం తప్పకుండా చేయాలి, గౌరవ మర్యాదలు తగ్గును.

*7 తులా రాశికి*
సహకార వృద్ధి, స్వయంకృషితో కార్య జయం, సంతానం వృద్ధిలోకి వస్తారు, సంతాన యోగం, విదేశీయానం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దూరపు బంధువులను కలుస్తారు.

*8 వృశ్చిక రాశికి*
శుభం, స్థిర చర ఆస్తులు నష్టం , కొత్త విద్యలు నేర్చుకుంటారు, పెట్టుబడితో చేసే చిన్న వ్యాపారాలు లభిస్తాయి.

*9 ధనూ రాశికి
 తీవ్ర ఆరోగ్య బంగం
శుభం, లాభం, స్వయంకృషితో కార్య జయం, సోదర సోదరీమణులు సహకారం, వివాహానికి మంచి సమయం, వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, ఉద్యోగంలో ఉన్నతి, మంచి పదవులు లభిస్తాయి.

*10 మకర రాశికి
శుభఫలితాలు మిశ్రమం, మాటకు విలువ తగ్గును, ఖర్చులు అధికం, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి, విదేశీయానం సూచనలు ఉన్నాయి.

*11 కుంభ రాశికి
అత్యంత శుభం, అధిక లాభాలు, అదృష్టం కలిసి వచ్చును, విశేషమయిన పేరు ప్రతిష్టలు, ఖ్యాతి సంపాదిస్తారు, అనుకోని విధముగా ధన లాభాలు, సంతానం కలుగును, లాటరీలు తగులును.

*12 మీన రాశికి
మిశ్రమ ఫలితాలు, విదేశీయాన సూచనలు, ఉద్యోగంలో స్థిరత్వంతో పాటు అధిక శ్రమ, కుటుంబానికి దూరముగా ఉండాల్సిన పరిస్థితి, అలస్య వివాహాలు, సమాజం నుండి ఏమి ఆశించకపోవటం మంచిది.

*ముఖ్యగమనిక:*
1 పైన తెలిపినవన్నీ స్థూల ఫలితాలు

2 వ్యక్తిగత జాతకము-గ్రహస్థితుల రీత్యా ఫలితాలలో తేడాలు ఉండవచ్చు

3 ఖచ్చితమయిన వ్యక్తిగత ఫలితాల కొరకు వ్యక్తిగతాముగా సంప్రదించండి
🙏🙏

*పరిహారాలు:*  ఓంకారం మోక్షమార్గం
మీ శ్రేయోభిలాషి 944-12-88-365 గురూజీ 

Wednesday, 25 October 2017

కార్తీక పురాణం 6

💎💎
మీ సేవకుడు 9441288365
 💎💎
కార్తీక పురాణం 6వ అధ్యాయం

వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు..

 ’ ఓ మహారాజా! కార్తికమాసములో భక్తితో నెలంతా శ్రీ హరికి కస్తూరితోటి, గంధముతోటి, పంచామృతములతోటి స్నానము చేయించువారు పదివేల అశ్వమేధయాగముల ఫలాన్ని పొంది అంత్యమున ఉత్తమ గతులను పొందెదరు. కార్తికమాసమున సాయంకాలసమయంలో శ్రీ హరి సన్నిధిలో దీపదానమిచ్చువారు విష్ణులోకమును పొందెదరు. కార్తిక మాసంలో దీపదానం చేసినవారు జ్ఞానమును పొంది విష్ణులోకాన్ని పొందెదరు. ఈ కార్తీక మాసంలో పత్తిన చక్కగా ధూళి, నలుసులు లేకుండా విడతీసి వత్తిని చేసి, బియ్యపు పిండితో గాని గోధుమపిండితోగాని చేసిన ప్రమిదలో ఆవునేతిని పోసి వత్తిని తడిపి వెలిగించి ఉత్తమ బ్రాహ్మణుని పూజించి ఇవ్వవలెను.

ఇట్లు ఈ నెలంతా చేసి చివర్లో వెండితో ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తిని చేయించి బియ్యపుపిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించినతరవాత బ్రాహ్మణ భోజనము గావించి తరవాత ఈ క్రింది మంత్రమును చెప్తూ దీపమును బ్రాహ్మణునకు దానము చేయవలెను (మంత్రము పైన ఇవ్వబడింది, దాని అర్థము ఇక్కడ పొందుపరచడమైనది) ."దీపము సర్వజ్ఞాన దాయకము, సమస్త సంపత్ప్రదాయకము, ఈ దీపమును నేను దానమిచ్చుచున్నాను, ఈ దీపదానమువల్ల నాకు నిరంతరము శాంతికలుగును గాక". లింగబేధములేక ఎవరైననూ ఈ ప్రకారంగా  కార్తీకమాసమందు ఆచరించిన అనంత ఫలము పొందెదరు. దీపంవలన జ్ఞానం కలుగును, దీపంవలన శృత్యాది శాస్త్రఫలము కలుగును, దీపదానమువలన ఆయుష్షును పొందును, దీపము వలన ఉన్నతలోకములకు పొందవచ్చును.

కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత తెలిసిగానీ తెలియకగానీ చేయబడిన పాపములు నశించును. ఈ విషయమై పూర్వమొక కథ గలదు. వినుము, పూర్వము ద్రావిడదేశమందు సుతులు కానీ, బంధువులు కానీ లేని ఒక స్త్రీ కలదు, ఆ స్త్రీ నిత్యము భిక్షమెత్తుకొనిన అన్నము తినునది. ఎప్పుడూ దూషితాన్నమునే భుజించెడిది, పరిశుభ్రమైన అన్నము తినునది కాదు. చద్ది అన్నముని తిని రోజూ ఇతరలవద్ద ధనము పుచ్చుకొని వారికి వంట చేయుట, బట్టలు కుట్టుట, రుబ్బుట నూరుట వంటి పనులు చేసెడిది. ఇట్లా ధనము సంపాదించి, దూష్యమైన భోజనము చేస్తూ అధిక ధనము కూడబెట్టినది. ఆస్త్రీ ఎన్నడూ భగవన్నామము ధ్యానించలేదు. హరికథలు వినలేదు, పుణ్య తీర్థములకు పోలేదు, ఏకాదశీఉపవాసం చేయలేదు. అనేక వ్యాపారములచే చాలా ద్రవ్యం సంపాదించినది. కానీ తాను తినలేదు పరులకోసం ఉపయోగించలేదు.

ఇలా అజ్ఞాన సముద్రంలో మునిగిన ఆమె ఇంటికి దైవ వశాత్త్ శ్రీరంగమునకు పోతూ ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి అయ్యో ఈమె అన్యాయంగా నరకము నకు పోగలదని దయకలిగి ఆమెతో ఇట్లనె. ’ఓ మూఢురాలా! ఇప్పుడు నేచెప్పేది జాగ్రత్తగా విను. విని ఆలోచించుము. ఈ శరీరం సుఖదుఃఖముల సమన్వయం. చర్మము, మాంసము, ఎముకలతో గూడినది. ఇది దుఃఖములకు నిలయము.  పంచభూతములైన భూమ్యాకాశవాయురగ్నిజలములు వలన కలిగి వాటితో కూడి ఉన్నది. దేహము నశించగానే ఈ పంచ భూతములు ఇంటిపై బడిన వాన చినుకులు ఎలాగైతే వేర్వేరుగా పోవునో అలా వేరువేరగును. ఇది నిశ్చయం.

ఈ దేహము నీటిమీద నురుగువలె నశించును. ఈ దేహము నిత్యము కాదు ఇట్టిదేహము నిత్యమని నమ్మియున్నావు. ఇది అగ్నిలో పడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము.

దేవుడే సత్యమనీ, సమస్త భూతములందు దయగలవాడు అని గుర్తెరుకు. హరిపాదములను ధ్యానించు. కామం-కోరిక, క్రోధము - అత్యంత కోపము,  భయము-ఈశరీరమునకు తత్సంబంధమునకు ఏమగునో అని బెంగ ఆత్మాత్మీయము, లోభము- ద్రవ్యచింతన, ఖర్చు పెడితే ఖర్చవుతుందని ఏదో దాచుకోవాలని ఉబలాటం. మోహము- మమత, అనురాగం, అహం, ద్రవ్యాభిలాషణం- ఇంకా ఇంకా ఇంకా సంపాదించవలెనని కోరిక -  వీటన్నిటిని వదులి నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చెయ్యి.

కార్తీక మాసమందు ప్రాతఃస్నానం చేసి, విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము అట్లు చేసిన అనేక జన్మ పాపములు నశించును. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు.’ అని చెప్పి ఆ బ్రాహ్మణుడి తూర్పు దిశగా పయనం సాగించెను. తరవాత ఆ మాటలు నమ్మి విచారణ చేసుకొని, ఆశ్చర్యమును పొంది తాను చేసిన అకార్యములకు బాధ పడి కార్తీక వ్రతమును ఆరంభించెను.

సూర్యోదయ వేళలో చన్నీటి స్నానము, హరి పూజ తరవాత దీపదానము అటు పిమ్మట పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసము నెలరోజులు కార్తీక వ్రతమాచరించి చివరకు బ్రాహ్మణ సమారాధన చేసెను.  ఇతః పూర్వం సరియైన భోజనము లేని కారణము చేతనూ, నెలరోజులు శీతోదకస్నానము చేయుటవలననూ,ఆ స్త్రీకి శీతజ్వరము సోకి గర్భమందు రోగము పుట్టి దివారాత్రులు బాధపడి బంధుహీనయై మృతినొందినైది. అనంతరం ఆమె దివ్య విమానమెక్కి స్వర్గమునకు బోయి శాశ్వత సుఖములను పొందినది.

కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధికమైన ఫలప్రదము. కార్తీక దీపదానము తెలిసికానీ తెలియకకానీ చేసిన పాపములను నశింపచేయును’ అని పూర్వము సాక్షాత్ శంకరుడే పలికెను. రాజా ఈ రహస్యమును నీకు తెలిపితిని దీనిని విన్న వారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని విష్ణుపదమును పొందెదరు.
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఆరవ అధ్యాయము సమాప్తము.
మీ శ్రేయోభిలాషి గురూజీ మహరాజ్
944-12-88-365

తరచుగా అనారోగ్య సమస్యల ఇబ్బంది పెడుతున్నాయా ?

💎💎
ఓంకారం మోక్షమార్గం.
944-12-88-365
 💎💎
ఓం .."త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్ "

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.
మీ శ్రేయోభిలాషి గురూజీ మహరాజ్ 944-12-88-365

Monday, 23 October 2017

కార్తీక మాసంలో ప్రతిరోజూ ఇల చేస్తే


🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼

_కార్తీక మాస ప్రాశస్త్యం!!!_
*నియమాలు పాటించాలి*

*1వ రోజు*
_నిషిద్ధములు :-_
ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి.
చల్లని వస్తువులు

దానములు :- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :-
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :- తేజోవర్ధనము

*2వ రోజు*
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము :- బ్రహ్మ
జపించాల్సిన మంత్రము :-
ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము :- మనః స్థిమితము

*3వ రోజు*
నిషిద్ధములు :- ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు :- ఉప్పు
పూజించాల్సిన దైవము :- పార్వతి
జపించాల్సిన మంత్రము :-
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము :- శక్తి, సౌభాగ్యము

*4వ రోజు*
నిషిద్ధములు :- వంకాయ, ఉసిరి
దానములు :- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము :- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- సద్బుద్ధి, కార్యసిద్ధి

*5వ రోజు*
నిషిద్ధములు :- పులుపుతో కూడినవి
దానములు :- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము :-
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
ఫలితము :- కీర్తి

*6వ రోజు*
నిషిద్ధములు :- ఇష్టమైనవి, ఉసిరి
దానములు :- చిమ్మిలి
పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

*7వ రోజు*
నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం

*8వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు :- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :-
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం

*9వ రోజు*
నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :-
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ

*10వ రోజు*
నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :-
ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు - ధనలబ్ధి

*11వ రోజు*
నిషిద్ధములు :- పులుపు, ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :-
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి

*12వ రోజు*
నిషిద్ధములు :- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

*13వ రోజు*
నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి
దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :-
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం

*14వ రోజు*
నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట

*15వ రోజు*
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

*16వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత

*17వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

*18వ రోజు*
నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి

*19వ రోజు*
నిషిద్ధములు :- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు :- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము :- వినాయకుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- విజయం, సర్వవిఘ్న నాశనం

*20వ రోజు*
నిషిద్ధములు :- పాలుతప్ప - తక్కినవి
దానములు :- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము :- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

*21వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు :- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము :- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము :- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము :- సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

*22వ రోజు*
నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు :- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు.

*23వ రోజు*
నిషిద్ధములు :- ఉసిరి, తులసి
దానములు :- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము :-
ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము :- మాతృరక్షణం, వశీకరణం

*24వ రోజు*
నిషిద్ధములు :- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు :- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము :-
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము :- శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

*25వ రోజు*
నిషిద్ధములు :- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు :- యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము :-
ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము :- అఖండకీర్తి, పదవీప్రాప్తి

*26వ రోజు*
నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు
దానములు :- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము :- కుబేరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము :- ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

*27వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు :- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

*28వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
దానములు :- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- ధర్ముడు
జపించాల్సిన మంత్రము :- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
ఫలితము :- దీర్ఘకాల వ్యాధీహరణం

*29వ రోజు*
నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

*30వ రోజు*
నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- సర్వదేవతలు, పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం.

_*🦑ఓం...నమో...వేంకటేశాయ*🦑_
మీ శ్రేయోభిలాషి ఓంకారం మోక్ష మార్గం 9441288365

కార్తీక పురాణం 5వ అధ్యయనం



💎💎💎
గురూజీ మహరాజ్ 9441288365
💎💎 💎
..కార్తీకపురాణం 5 వ అధ్యాయము*
*వనబోజన మహిమ*
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము   తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకు౦టమునకు
వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠి౦చిన  వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క ప దమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా  పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి,  ఉసిరి చెట్టు నీడను  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను- యని  వశిష్టుల వారు  చెప్పిరి. అది విని జనక రాజు ' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల  కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.
*🌺కిరాత మూషికములు మోక్షము నొందుట🌺*
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారములు కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము
విని, తండ్రీ ' ఓరి నీ చుడా! కార్తిక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శాపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివ శర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి ' తండ్రీ  క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధ కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. నక శాపవిమోచన మోప్పుడే  విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ మెమో వివరింపు'మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ ' బిడ్డా ! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పది యుండగా నివెప్పుడు కార్తిక మహత్యమును వినగాలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దు దువు ' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.
ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న య పెద్ద వట వృక్షము నీడను కొంత సేపు విశ్రమించి, లోకబి రామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వుత వృక్షం క్రినకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని' విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు'న నెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో న మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గణ, వివరింపుడు' అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఐ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరి౦చి కార్తీక పురాణమునకు పతిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుంది సావడనుడవై యలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణ న౦తరము  వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ' ముని వార్య ! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత  వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*
*ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.*
మీ శ్రేయోభిలాషి ఓంకారం మోక్షమార్గం 9441288365

అమావాస్య రోజున ఇల చేస్తే ధనలక్ష్మి

మన హిందు సాంప్రదాయం ప్రకారం ప్రతి పద్దతికి ఒక నిగుడమైన రహస్యం దాగి ఉంటుంది

నవగ్రహలకు ఇల పూజ చేసి చూడండి..

పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం
ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?
నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?
నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.
గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.
ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.
మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!

తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్
944 12 88 365

కాలసర్ప దోషం అంటే ఏమి? ‘కాళహస్తిలో ’ పూజ చేయిస్తే సరిపోతుందా ?

కాలసర్ప దోషం అంటే ఏమి? ‘కాళహస్తిలో ’ పూజ చేయిస్తే సరిపోతుందా?

944 12 88 365


హిందువులకు ఉండే భక్తి విశ్వాసాలతో పాటు మూఢ నమ్మకాలు అధికం. 



ఇలాంటి వాటిలో జ్యోతిష్యం ఒకటి. కేవలం వ్యక్తిగత దిన, వార, మాస ఫలితాలే కాదు వధూవరుల వివాహాలకు కూడా జాతకాలు చూస్తుంటారు. వారి పేరుబలాలకు తగినవిధంగానే ముహుర్తాలు ఖరారు చేస్తుంటారు.

అయితే, చాలా మంది జాతకాల్లో కాలసర్ప దోషం అనేది ఉంటుంది. ఇది ఉన్నవారు భయంతో వణికిపోతారు. తమకు అంతా చెడు జరుగుతుందని గుడ్డిగా నమ్మేసి పూజలు చేస్తూ శాంతి హోమాలు జరిపిస్తుంటారు. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి, ఏలా నివారించుకోవాలో తెలుసుకుందాం..


అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి?

కాలసర్పదోషం జాతకంలో రాహు కేతువుల వలన ఏర్పడుతుంది. జాతకంలో 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చు.

ఈ దోషం వలన వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే!

జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా వాటిని కాల సర్పదోషం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి ఉద్యోగంలో ఉన్నతి మొదలైన వాటికి ప్రధాన అవరోధంగా మారుతుంది.


కాలసర్పదోషం ఎందుకు వస్తుంది?

ఈదోషం వంశపారంపర్యంగా లేదా ఒక్కరికైనా గానీ రావొచ్చు. చాలామంది అనుకునేది ఏంటి అంటే సర్పాలను చంపడం వలననే ఈ దోషం వస్తుందేమో అని. కొంత నిజమే అయినా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సర్పాలను తెలిసిగానీ తెలియకగానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా సంహరించడం చేసినా దోషం వదలదు అని నిర్ణయకౌముది చెబుతుంది. పీడించినా హింసించినా బంధించినా సంహరించినా ఆ పాపం సర్పదోషం రూపంలో మనల్ని పీడిస్తుంది.

వంశ క్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం.

వంశ క్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం. అంతేకాదు.. గురువులు, ముసలివాళ్ళు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశు పక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది. అంటే ధర్మహీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే సమస్తకర్మలు సర్పశాప స్థితి ద్వారా అమలవుతాయన్నమాట. కర్త అనగా చేసినవాడు, కారయితా అనగా కారణం అయినవాడు, ప్రేరకః అనగా ప్రేరేపించినవాడు అనుమోదకః అనగా ఆమోదించినవాడు ఈ నలుగురు పాపం అయినా పుణ్యం అయినా సమానంగా అనుభవిస్తారట.

నాగదోష ఫలితాలు ..!

సంతానహీనతకు, గర్భశోకానికి, గుణ - రూప హీనులైన సంతానానికి, భర్తహీనతకి, సంసార దుఖానికి, ఈ నాగదోషమే కారణం. రోగాలకి అశాంతికి అభద్రతకి చంచలమైన - స్థిరత్వం లేని జీవితానికి కూడా ఈ దోషమే కారణం. వివాహం కాకపోవడం, దంపతులు త్వరగా విడిపోవడం బాల వైధవ్యం దాంపత్యంలో కలహాలు అన్యోన్యత లేకపోవడం కూడా నాగదోషమే. ఒక్కమాటలో చెప్పాలి అంటే జాతకంలో ఉండే అన్ని దోషాలకన్నా ప్రధానమైనదీ ప్రమాదమైనదీ కూడా ఈ ‘కాలసర్పదోషమే’ ఈ దోషం ఉన్న జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. వీరి మిత్రులు, సహచరులు వీరికన్నా తక్కువ స్థాయి వారూ వీరిని దాటి ముందుకు వెళ్తారు కానీ వీరు మాత్రం ప్రతిభా పాటవాలు ఉన్నా అక్కడే ఉండిపోతారు.

‘కాళహస్తిలో ’ పూజ చేయిస్తే సరిపోతుందా..?

అందరూ ఇలాగే అనుకోని తప్పుచేస్తుంటారు. ఉదాహరణకు: గుండె జబ్బుతో బాధపడే వ్యక్తికి చికిత్స నిమిత్తం ఒక మాత్ర ఇస్తే సరిపోదు. బైపాస్ చేయించడమే తగు చికిత్స. అలాగే ఈ దోషానికి కూడా ’కాలసర్ప శాంతి’ అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం. అలా శాంతి చేయించిన తరువాత కాళహస్తి వెళ్లి అక్కడ రాహు - కేతు పూజ చేయించడంతో సమాప్తం అవుతుంది.


దోషం పోవావాలంటే?

శాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది 3 రోజులు లేదా 1 రోజు గానీ చేసుకోవచ్చు. గణపతి పూజ - పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం రాహువు 18 వేలు జపం, కేతువు 7 వేలు జపం, నక్షత్ర జపం, సర్ప మూల మంత్రం, లక్ష్మి గణపతి మూల మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గో క్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం చేయాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మాసాదేవి ఇష్టదేవతా కులదేవతా రుద్ర ప్రధాన కలశాల స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, మినుములతో; కేతువుకి దర్భ, ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేసాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో ఉలవలు కిలో, సర్ప ప్రతిమలు 2 కలిపి దక్షిణతో దానం చేసి, ఆయా కలశాల జలంతో కర్తకి (ఎవరికోసం చేసుకుంటున్నారో వారు ) మంత్రయుక్తంగా స్నానం చేయించాలి.

బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి.

కుదిరితే పూజలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తి అయినట్లే!మరి తమ పుట్టిన తేదీ తదితర జాతక వివరాలు తెలియనివారు తమకు కాలసర్పదోషం ఉన్నదో లేదో అనేది ఎలా తెలుసుకోగలరు అనే సందేహం రాకమానదు. అయితే అలాంటివారు తమ జీవితంలో జరిగిన, జరుగుతున్న ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అది కాలసర్ప దోషమో కాదో నిర్ధారణ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

కాలసర్ప దోష యంత్రంను

కాలసర్ప దోష యంత్రంను 40రోజుల పాటు 1,24,000 సార్లు జపం చేస్తే దోష నివారణ అవుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహములుండుటను కాలసర్ప దోషముగా భావింతురు. వ్యక్తీ గతం కాదనీ, సామూహిక విలక్షనాంశమని రాహు,కేతువులు ఇతర గ్రహములతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి, అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం

అని పెద్దలంటున్నారు

Omkaram మోక్ష మార్గం Guruji Maharaj HYD 9441288365

నిత్య పారాయణ శ్లోకాలు Omkaram మోక్ష మార్గం 9441288365 Guruji Maharaj HYD

💢నిత్య పారాయణ శ్లోకాలు💢

మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...




🌷ప్రభాత శ్లోకం :🌷

కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!



☘ప్రభాత భూమి శ్లోకం : ☘

సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !

విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!



🌝సూర్యోదయ శ్లోకం : 🌝

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!



🍀స్నాన శ్లోకం : ☘

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!



♨భస్మ ధారణ శ్లోకం : ♨

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!



🍀భోజనపూర్వ శ్లోకం : 🍀

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!



అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !

ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!



త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !

గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!



💢 భోజనానంతర శ్లోకం : 💢

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!


🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :🌷

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!



😔నిద్రా శ్లోకం :😔

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !

శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!



👍కార్య ప్రారంభ శ్లోకం : 👍

వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!



🌷హనుమ స్తోత్రం : 🌷

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!



బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !

అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!



💢శ్రీరామ స్తోత్రం : 💢

శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే



♨గణేశ స్తోత్రం : ♨

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!

అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !

అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!



🔯శివ స్తోత్రం : 🔯

త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !

ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!



🕉గురు శ్లోకం : 🕉

గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !

గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!



☸సరస్వతీ శ్లోకం :☸

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!



 యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!



🌷లక్ష్మీ శ్లోకం 🌷:

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!


☘వెంకటేశ్వర శ్లోకం ☘:

శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !

శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!



♨దేవీ శ్లోకమ్♨ :

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!



💢దక్షినామూర్తి శ్లోకం💢 :

గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!



☸అపరాధ క్షమాపణ స్తోత్రం☸ :

అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !

దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!



కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!



కాయేన వాచా మనసేంద్రియైర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి !!





🔯 విశేష మంత్రా: 🔯

💢పంచాక్షరి -

ఓం నమశ్శివాయ

☘అష్టాక్షరి -

ఓం నమో నారాయణాయ

🌷ద్వాదశాక్షరి -

 ఓం నమో భగవతే వాసుదేవాయ.

............,,,,,,,,,............☸
9441288365 Guruji Maharaj  HYD 

Astrology జ్యోతిష్య శాస్త్రం నిజామా ?

ప్రియ.బంధువులారా......జోతిష్యం.....ప్రభావము..గ్రహ....ప్రభావానికి.....యోగులు...ఋషులు...

చివరికి.....సర్వదేవతల..లోబడ వలసిందే.. కాదనలేని సత్యము.....రాహుగ్రహ ప్రభావముచే...కృషుడు..నిందలుపడటం......

11..ఇంట.. శుక్రుడు....రాములవారికి....
దంపత్యజీవితము.....లేకుండా..చేయటము...తెలిసినవే.
మరి..మానవులము....అయిన...మనమీద...గ్రహ.ప్రభావం...లేకుండా....ఉండదు....ఉంటుంది....ఇదినిజం...
1...ఈమధ్య.....దంపతులతో....విడిపోవడం...ఎక్కువగా
చూస్తున్నాము....మోసపు..పెళ్లిళ్లు....ఎంత..జాగ్రతలు
తీసుకున్న...పెళ్లి...ముడునాళ్ళ...ముచ్చట...కావటం
తరచు...చూస్తున్నవే.... కాదనలేని....నిజాలు.......
2...జోతిష్యం నకు.... విలువ...ఇవ్వాలి....జాగ్రతలు.
తీసుకోవాలి.....అంతకంటే.....మానవ...సంబంధాలకు
విలువ....ఇవ్వాలి.....
నా....అన్వేషణలో.....నాకు....అనిపించింది...మీకు
తెలియ.జేయాలి....అని....పించి...తెలియ.చేస్తున్నాను...

3....పూర్వకాలంలో....జోతిష్యం....గృహాలు....వాటి.
పెభావాలు....ఉన్నాయి....మరి...విడిపోవటాలు...ఇంతగా
లేవు...కారణం...మనవసంభంధాలు...బలంగా..ఉండటమే....కారణం......
4....ఆరోజుల్లో.....అమ్మ...నాన్న....మన...బంధువులు
అటు...ఏడు తరాలు....ఇటు...ఏడూ...తరాలు..చూసి
వివాహం....జరిపేవారు.....ఇదినిజం......అంటే...ఏమిటి
వారి..తాత.ముత్తాతల...దగ్గరనుండి....ఎవరైనా...విడిపోయార..... సంతనంపరిస్థితి...ఎలావుందీ.... అని..చూచుట.....అంటే....జోతిష్యా నికి....ఆవిధంగా
విలువ....ఇచ్చారు......
5....గ్రహ...ప్రవభావం...కర్మలను.బట్టి...జననం..మరణం
పూర్వకర్మలను...బట్టి...జననం..అని...ముందే...చాలాసార్లు...వివరించాను.....

6....పూర్వ.కాలంలోకూడా...విడిపోవటాలు.....సర్పశాపము...వల్లాసంతానంలేకపోవటం....అన్నీవున్నాయి..
కానీ....ఇంతలాలేవు......కారణం.....మానవాసంభంధాలు..వివాహపూర్వమే.....అటు.ఇటు...ఏడూ.తరాలు..పరిశీలించుట.....వల్ల....జాగ్రతలు.....తీసుకోవటం..వల్ల..
సమస్యలు....ఇస్తాయిలో...కనపడలేదు....

7....ఈనాటి...పరిస్థితి....మనఅమ్మాయిని...ఇచ్చేవాడు
మనకుతెలియదు...వాడి...వంశ...కుటుంభ.చరిత్ర
మనకుతెలియదు....ఏడు... తరాలుకాదుకదా...పిల్లని
చేసుకొనే...వాడితరంకుడా...తెలియదు.....
8..కారణం....కన్నాం....పెంచాం....డబ్బుపెట్టి...చదివించాం
సాఫ్ట్వేర్.... ఉద్యోగం....వచ్చింది.... ఫినిష్....ఎవడో..
ఒక్కడికి....ఇచ్చిచేద్దాం.....అంతా... వ్యాపార...దృక్పథంతో
వ్యవహిస్తున్నాం...అంటే... పోటియుగం...అంట్టారు..
ఎవడు..పోటీ...ఎవడితో...పడమన్నారు.....
9....గ్రహ..ప్రభావము....ఎవరికి...తప్పదు....ఆరోజు...సమస్యలు...తక్కువగా...ఉండటానికి..కారణం.....మానవ
సంబంధాలు....ఈనాడు....అసంబంధాలు...లేకపోవుటవల్లనే.....సమస్యలు....ఎదుర్కొంటున్నాము....
10...జోతిష్య. పండితుని...దగ్గరకు...వెళ్లి....ఇద్దరిజాతకాలు...చూపెడతారు....వాడు....భేషుఖ్... గావుఉంది అంట్టాడు....మరి
ఎందుకు.....విడిపోతున్నారు....సిద్దాంతి....సరైనవాడు..వాడు...కాదు....అంతలా....అన్నివిష్యాలు.పరిశీలించే
వారు....అరుదు.....అందుకే......ఇసమస్యలు.......
ఆశ...ఉంచుకొండి.... కానీ.....అన్నివిష్యాలు...సంపురణముగా..పరిశీలించేషిద్దాంతిని......చూసుకొని.....అప్పుడు....అడుగులు...వేయండి.....ముఖ్యంగా.....మానవాసంభంధాలు....
విలువలు....పెంచండి....తధ్వా రా....మనకుతెలిసిన.
వారి....మనభందువులలోనే....మానంకోరుకొనే...సంబంధాలు....మనపిల్లలకు...దొరుకుతాయి....

గ్రహగతులా....అవి.ఎలాను....తప్పించలేము...కానీ..
మానవాసంభంధాలు....పడితే....వాటి..ప్రభావం.
తగ్గుతుంది.....కారణం.....అన్నీ... తెలిసినవారితో
అడుగులేస్తాం....పూర్వాకాలంలో.....అమ్మ...నాన్నసలహాలు...తీసుకొనేవారం....వారు....ఎన్నోకోణాల్లో...ఎంతమంది...భందువులను....ఆలోచించి....నిర్ణయం... తీసుకునేవారు....సమస్యలు...ఇంతలా..ఉండేవికావు
ఇప్పుడో...మనమేహీరోలం.....అందుకే....మానవాసంభంధాలలో.....జీరోలం......ఈపోస్టు.....జాగ్రతగా..మనసుపెట్టి.
ఆలోచించండి...నిజామోకాదో......మీకే... తెలుస్తోంది..
సర్వేజనా.....సుఖినోభవతు..... శనిదేవుని.....ఆరాధించండి......ధర్మం... న్యాయం...నేర్పుతాడు.......సుఖంగా.... జీవించండి...
......మీ.శ్రేయోభిలాషి శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365

గుణ గణాలు Omkaram మోక్ష మార్గం Guruji Mahjaraj 944 12 88 365 Contact HYD

1.సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మ)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)..
Guruji Mahjaraj  944 12 88 365 Contact

Tirumala తిరుమలలో బంగారు బావి Omkaram మోక్ష మార్గం Guruji Maharaj HYD 9441288365 Contact

తిరుమలలో బంగారు బావి !
శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవేంకటేశ్వరుడు లీలామానుష రూపుడై శ్రీ వైకుంఠం నుంచి వచ్చి భోలోకవైకుంఠం అయిన శ్రీవేంకటాచలక్షేత్రంలో సంచరిస్తూవున్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీమహాలక్ష్మి ఒక తీర్ధాన్ని ఏర్పరచింది.అదే శ్రీతీర్థం అనీ, లక్ష్మీ అని పేరు గాంచింది. అలాగే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటుచేయగా అది భూతీర్థంగా పేరొందింది. కాలాంతరంలో ఈ తీర్థాలు రెండూ అదృశ్యములై నిక్షిప్తంగా వుండివున్నాయి. మళ్ళీ అనంతరకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖానసాగమన శాస్త్రోప్తంగా అర్చిస్తూవున్న గోపీనాధుడనే అర్చకునకు సహాయంగా రంగదాసు అనే సేవకుడు తిరుమల చేరుకున్నాడు. శ్రీ స్వామివారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాల కోసం తోటను పెంచటానికి రెండుబావులు నిర్మించినాడు. అదే స్థలంలో ఎప్పుడో నిక్షిప్తములైన శ్రీతీర్థ,భూతీర్థాలు మళ్ళీ దైవికంగా బహిర్గాతాలైనాయి. అనంతరం ఆ రంగదాసు మరణించగా మళ్ళీ ఆ రెండు బావులు శిథిలమైనాయి.శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవచేసిన ఫలితంగా ఆ రంగదాసు అనంతరకాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మళ్ళీ శ్రీస్వామి వారిని చేరుకున్నాడు. తిరుమలలో బంగారు బావి !
ఆలయ ప్రాంగణం మళ్ళీ ఈ జన్మలో కూడా పెక్కువిధాలుగా సేవిస్తున్న తొండమానునితో స్వామి వారు అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేసి తాను వుండటానికి ఒక ఆలయాన్ని నిర్మించి దానిపై బంగారుతొడుగుతో ఒక బంగారు విమానాన్ని ఏర్పాటుచేయించవలసిందని ఆలయ ప్రాంగణంలో పూర్వజన్మలో నిర్మించిన శ్రీతీర్ధం,భూ తీర్థాలను మళ్ళీ పునరుద్దరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.
తొండమాన్ చక్రవర్తి తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీతీర్థాన్ని ఉద్దరించి దాని చుట్టూరా రాతి తీర్థాన్ని ఏర్పాటుచేసి దానికి బంగారు రేకును తాపించినాడు. అదే అప్పటినుండి బంగారుబావిగా పేరుపొందింది.
పూలబావి అలాగే భూతీర్థాన్ని దిగుడుబావిగా మెట్లతో నిర్మించినాడు. అదే పూలబావిగా ప్రసిద్దిపొందింది. కాలాంతరంలో ఆ శ్రీతీర్థం అంటే బంగారు బావి శ్రీ వారి వంట శాలకు, అర్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖస్థానాన్ని పొందింది.
బంగారుబావి ఈ బంగారుబావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని బంగారువాకిలి నుండి వెలుపలికి వచ్చినతరువాత ఎదురుగా వున్న వంటశాలకు వెళ్ళే మార్గంలో అంటే వకుళాదేవిని దర్శించుకొనటానికి వెళ్ళేమార్గంలో వంటశాల మెట్లకు ఆనుకునిపక్కనే వుంటు శ్రీ తీర్థం ఈ బావికి చుట్టూ భూమిమట్టం నుండి చెక్కడపురాళ్ళతో నిర్మించబడివుంటుంది. ఈ రాతి కట్టడం మీద బంగారుమలాం చేయబడిన రాగిరేకులు తాపడంవుండటం వలన ఇది బంగారుబావి అని ప్రసిద్ధిపొందింది. ఈ బంగారు బావికే శ్రీ తీర్థం అనీసుందరస్వామి బావీ అని పేర్లు వున్నాయి.
శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ మూర్తి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ మూర్తికి ప్రతిశుక్రవారం నాడు అభిషేకం జరపబడుతుంది. ఈ అభిషేకం గాను తిరుమలనంబి 11వ శతాబ్దంలో పాపవినాశన తీర్ధంనుండి రోజూ ఆ పవిత్ర జలాన్ని తెచ్చేవారు.
తిరుమలనంబి ఈ తిరుమలనంబి భగవద్రామానుజులకు గురువుమాత్రమే కాక మేనమామకూడా.ఇలా అభిషేక జలాన్ని,సమర్పిస్తూ సేవిస్తూవున్న కాలంలో తిరుమలనంబి గురువుగారైన యామనాచార్యులవారు తిరుమలకు వేంచేసి శ్రీనివాసప్రభువుల వారిని దర్శించారట.
అభిషేకజలం ఆ సమయంలో ఎడతెరిపిలేని కుంభవృష్టిపడుతుండగా తిరుమల నంబి పాపవినాశనం నుండి అభిషేకజలం తెచ్చుటకు ఆటంకం ఏర్పడినది.అప్పుడు శ్రీస్వామి వారి అభిషేకానికి ఎలాంటి విఘ్నం కలగకుండా వుండటానికి శ్రీ మహాలక్ష్మిని ఇలా ప్రార్ధించారట. శ్రీ తీర్థజలం సర్వశ్రేష్టం శ్రీనివాసుని అభిషేకానికి ఇతర తీర్ధముల కంటే నీవు వెలయింపచేసిన శ్రీ తీర్థజలం సర్వశ్రేష్టం. అందువలన ఈ జలాలు ఇక మీదట శ్రీవారి అభిషేకయోగ్యములై వుండుకాక సాక్షాత్తూ బంగారుబావి సుందరమైన భగవంతుని రూపమేనంటూ దానికి సుందరమైన స్వామికూపం అని నామకరణంచేసినారు.
మూడు బావులు తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు బావులున్నాయి. మొదటిది సంపంగి ప్రదక్షణలో రామానుజ కూటం,యామునై తురై ఎదురుగా ఉన్న బావి.రెండొవది పూల బావి. మూడోవది బంగారు బావి.తిరుమామణి మండపం ఎదురుగా కనిపించే బావి బంగారు బావి.
బంగారు బావి శ్రీవారి దర్శనం చేసుకొనే బయట అడుగు పెట్టెచోట ఎదురుగా కనిపించే బావి ఇదే.ఈ బావికి బంగారు రేకుల తాపడం వల్ల బంగారు బావి అని విఖ్యాతి. స్వామివారి పూజలకు ,నైవేద్యములకు అవసరమైన నీరు అందించే బావి ఈ బావి.శ్రీదేవి భూదేవి సౌకర్యం నిమిత్తం ఈ బావిని నిర్మించినట్లు ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఈ బావిని రంగదాసు నిర్మించినట్లు పురాణగాధ అతడు పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తి ఈ బావి కింద విరజానది ప్రవహిస్తుందని పెద్దల విశ్వాసం.శ్రీ వెంకటచల ఇతిహాసాలలో బంగారు బావి ప్రసక్తి కనిపిస్తుంది. వకుళమాత ఈ బావి నుండి నీరు తోడే పద్ధతి విజయనగర రాజుల కాలంలో హంపిలో నీరు తోడే పద్దతిని పోలివుందని చారిత్రుకులు బావిస్తున్నారు.శ్రీవారి అభిషేకానికి బంగారు బావి నీళ్లు ఉపయోగిస్తారు. వకుళమాత కొలువైన పోటు (వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. గర్భాలయంలోని మూలమూర్తి స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపల వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారు బావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడుతారు. :రాగి రేకులు బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీ తీర్థం, సుందర తీర్థం, లక్ష్మి తీర్థం అని కూడా పిలుస్తుంటారు. పురాణాలు వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహా లక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.....
Omkaram మోక్ష మార్గం Guruji Maharaj HYD 9441288365 Contact

108 రూపాలలో శ్రీ గణపతి Omkaram మోక్ష మార్గం Guruji Maharaj HYD 9441288365 Contact

నమామి గణనాయక:

(108 రూపాలలో శ్రీ గణపతి)

1. ఏకాక్షర గణపతి

 ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి

భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్

3. బాల గణపతి

కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి

పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి

విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి

ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి

త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి

బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో  దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి

శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10.  దుర్గా గణపతి

తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి

సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి

దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి

అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15.  నిధి గణపతి

విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16.  వక్రతుండ గణపతి

స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి

దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ || 

18. ఉచ్ఛిష్గ్ట గణపతి

లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19.  హరిద్రా గణపతి

హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి

నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.  మేధా గణపతి

సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం  మమ ఆత్మరక్ష వినాయకం

22. మోహన గణపతి

రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23. త్రైలోక్య మోహన గణపతి

గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి

భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి

యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి

సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి

ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి

వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి

మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి

సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి

ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి

యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి

పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి

దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి

నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి

లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||   

39. విద్యా గణపతి

భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి

వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి

పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి

హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి

శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి

గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి

వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47.  చింతామణి గణపతి

కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి

అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి

వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి

వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి

శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి

రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి

హేరంబతే రత్నసువర్ణయుక్తే  సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి

మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి

పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి

నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి

పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి

కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి

యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి

ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి

ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి

అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66. ద్విముఖ గణపతి

స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి

శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి

వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి

సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి

మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి

ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి

నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి

ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి

సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి

బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి

గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80.  విషహర గణపతి

నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి

బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి

స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి

సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84. మాయావల్లభ గణపతి

సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి

తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86.  గౌరి గణపతి

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి

అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి

కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి

సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి

రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి

వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92.  బ్రహ్మవిద్యా గణపతి

బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి

విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి

ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95.  జ్ఞాన గణపతి

గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి

నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి

గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి

సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి

యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి

వందే గజేంద్రవదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం - క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి

విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి

అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి

పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి

చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి

సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో

విచిత్ర వినాయక దేవాలయాలు Omkaram మోక్ష మార్గం Guruji Maharaj HYD 9441288365

విచిత్ర వినాయక  దేవాలయాలు

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.

అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.

వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం: ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

తెలంగాణలో తొలి సిద్ధి వినాయక క్షేత్రం: తెలంగాణ రాష్ట్రంలోని తొలి సిద్ధివినాయక ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న రేజింతల్ గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహార్రాష్టల నుంచి ఎందరో భక్తులు వస్తూంటారు. గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ఈ సిద్ధివినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతిమీద అస్పష్టంగా ఉంటుంది. ఈ స్వామికి సింధూరవర్ణం పులమడంవల్ల చూడగానే ముందు మనకు ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. దాదాపు 208 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోను సిద్ధివినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకరతోరణం, దిగువన రజిత మకరతోరణంతో పాటు సూక్ష్మగణపతి విగ్రహం కూడా ఉంటుంది.
స్థల విశేషాలు: ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి శివరాం పంతులు అనే యాత్రికుడు కాలినడకన అనేక క్షేత్రాలు దర్శిస్తూ, ఈ రేజింతల్ ప్రాంతానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత కలిగిందట. అందుకే ఆయన చాలాకాలం అక్కడ తపోదీక్షలో ఉన్నాడు. ఆ సమయంలో సిద్ధివినాయకుడు ఆయనకు తన ఉనికిని తెలియజేసి, పూజాదికాలు నిర్వహించమని ఆదేశించాడు. శివరాం పంతులు ఆ ప్రాంతం అంతా అన్వేషించి స్వయంభువుడుగా వెలసిన సిద్ధివినాయకుని ప్రతిమను దర్శించి బాహ్య ప్రపంచానికి తెలియజేసాడు. అప్పటి నుంచీ రేజింతల్ సిద్ధివినాయకుడు మహావైభవంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ సిద్ధివినాయకుడు ఏటేటా పెరుగుతూంటాడని భక్తుల నమ్మకం. ముందు రెండున్నర అడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తూ, ఆరడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు అంటారు.

సకల విఘ్నాలను తొలగించి, భక్తకోటికి సర్వశుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధివినాయకునికి ఎంతో పేరున్న కారణంగా శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకట చతుర్థి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహస్తారు. సంకటహర చతుర్దశి, మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. పుష్య శుద్ధ పాడ్యమి నుంచి... పుష్య శుద్ధ చతుర్దశి వరకూ శ్రీ సిద్ధివినాయక స్వామివారి జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలు సహస్ర మోదకాలతో 451 గణేశ హవనాలూ, శతచండీ హవనం, సపాద లక్ష గణేశ గాయత్రీ హవనాలతో నిర్వహిస్తారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ఆది మంగళ వారాలలో వచ్చే అంగారక చతుర్థి పర్వదినం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలివచ్చి శ్రీ స్వామివారిని దర్శిచుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత.ఏ శుభకార్యం తలపెట్టినా ఎందరో భక్తులు తొలిపూజ చెయ్యడానికి ఈ స్వామి దగ్గరకు రావడం ఈ క్షేత్రం గొప్పతనం. అందుకే ఈ సింధూరవర్ణ గణపతి భక్తజన పూజ్యనీయుడూ, ప్రేమపాత్రుడు అయ్యాడు.
పశువుల కాపరి వేషంలో వినాయకుడు: ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళరాడు రాష్ట్రంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు.

ఈ ఆలయాన్ని ఉచ్చ పిళ్ళైయార్ ఆలయం అంటారు. తమిళ భాషలో ఉచ్ఛ అంటే ఎత్తునఅని అర్థం. ఇక పిళ్ళై..యర్ అంటే పిల్లవాడు ఎవరు అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాప లాగా ఉంచిన బాలుడు అడ్డగించగా, శివుడు కోపగించి ఆ బాలుని తల ఖండించి లోపలకు వెళ్ళడు. శివుడు, పార్వతిని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న పిళ్ళైయార్. అంతవరకూ ఈ బాలునకు పేరే లేదు. ఆనాటి నుండి వినాయకునకు పిళ్ళైయార్ అనే పేరు స్ధిరపడిపోయింది. అందుకు ఈ ఆలయాన్ని ఉచ్చ పిళ్ళైయర్ ఆలయం అంటారు. ఈ ఆలయం ఉన్న కొండ సుమారు 3800 మిలియన్ల సంవత్సరాలకు పూర్వందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయానికీ..శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దానికి సంబంధించిన కథ ఏమిటంటే.... త్రేతాయుగ కాలంలో, శ్రీరామచంద్రుడు వానరులతో కలసి రావణుని మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు రావణ సోదరుడైన విభీషణుడు ఎంతో సాయం చేసాడు. ఫలితంగా శ్రీరాముడు రావణుని సంహరించాడు. అందుకు కౄఎతఙ్ఞతగా శ్రీరాముడు.. విభీషణునకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని బహూకరిస్తూ విభీషణా.., లంకలో ఈ విగ్రహం ప్రతిష్ఠిచే వరకూ ఈ విగ్రహాన్ని నేలమీద పెట్టవద్దు అని చెప్పాడు. ఆ విగ్రహం తీసుకుని విభీషణుడు లంకకు బయలు దేరాడు. అయితే విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించడం దేవతలకు ఇష్టం లేదు. అందుచేత దేవతలంతా వినాయకుని ప్రార్థించి తమ కోరిక చెప్పారు.
వినాయకుడు వారికి సహకరిస్తానని చెప్పి ఒక పశువుల కాపరి వేషం వేసుకుని, విభీషణునికి ఎదురుగా వస్తున్నాడు. అది సాయం సమయం. అస్తమయ సూర్యునకు అర్ఘ్యప్రదానం ఇవ్వాలని విభీషణుడు తలచి తన చేతిలోనున్న విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని, తనకు ఎదురుగా వస్తున్న పశువుల కాపరిని చూసి, దగ్గరకు రమ్మని పిలిచి, తన చేతిలోనున్న విగ్రహాన్ని ఆ పిల్లవాని చేతిలో ఉంచి నేను పూజ పూర్తి చేసుకుని వచ్చే వరకూ ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకు అని చెప్పాడు. మాయా గణపతి సరే అన్నాడు. విభీషణుడు కావేరీనదిలో దిగి సంథ్యావందనం చేస్తున్నాడు.

ఆ సమయం చూసి, విభీషణుడు ఎంత వద్దని చెప్తున్నా వినకుండా, ఆ విగ్రహాన్ని నేలమీద ఉంచి పరుగు తీసాడు. విభీషణుడు ఆ బాలుని తరుముతున్నాడు. ఆ బాలుడు కావేరీనది ఒడ్డున ఉన్న కొండ ఎక్కాడు. విభీషణుడు ఆ బలుని పట్టుకుని నుదుటి మీద గట్టిగా కొట్టాడు. (ఆ దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ ఉచ్చ పిళ్ళైయార్ విగ్రహానికి ఉండడం భక్తులు గమనించవచ్చు) అప్పుడు వినాయకుడు నిజరూపంతో విభీషణునికి దర్శనమిచ్చి, శ్రీరంగనాథస్వామి విగ్రహం శ్రీరంగ క్షేత్రంలో ప్రతిష్ఠితమౌ గాక. మన ఇద్దరి కలయికకూ గుర్తుగా నేను ఈ కొండమీద ఉంటాను అని వరమచ్చి సూక్ష్మ గణపతిగా ఆ కొండమీద వెలిసాడు. విభీషణుడు ఆ సూక్ష్మ గణపతికి ఆలయం నర్మించాడు. ఆ ఆలయమే పల్లవుల కాలంలో అభివౄఎద్ధి చెందింది. అదే ప్రపంచంలోని అతి ప్రాచీన వినాయక దేవాలయం. తిరుచ్చిలోని రాక్ ఫోర్ట్ మీదవున్న ఈ ఆలయాన్ని దర్శించాలంటే 437 మెట్లు ఎక్కి వెళ్లాలి. ఈ మెట్లుకూడా చాలా ఎత్తుగా ఉంటాయి. రాక్ హిల్ ఎక్కి,ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే, తిరుచ్చి నగరం, కావేరీనది, శ్రీరంగం లోని శ్రీరంగనాథస్వామి ఆలయం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక, వినాయకుడు నేలమీద ఉంచిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని చోళరాజు కనుగొని ఆ విగ్రహాన్ని శ్రీరంగంలో ప్రతిష్ఠిచాడు. అదే శ్రీరంగం లోని శ్రీరంగనాథస్వామి ఆలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాతే..ఉచ్చ గణపతి దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఈ రెండు దేవాలయాలే ప్రపంచంలోని అతి ప్రాచీన దేవాలయాలు.
పెన్నులతో పూజలందుకునే వినాయకుడు: అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు.
ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కౄఎపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ... ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ. 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాం తులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభుడు జన్మిం చారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ.., వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది. దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వంనుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుదభ్రిషేకాలు, అష్టోత్తపుష్పార్చన, పుస్తకపూజ, అన్నప్రాశన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి.
సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహో త్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. వినాయకచవితి రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో సప్తనదీ జలాభి షేకం చేస్తారు. ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో...అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.

అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే..., తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదిశలు వ్యాపించడంతో.. ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.
Omkaram మోక్ష మార్గం Guruji Maharaj HYD 9441288365

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...