Sunday, 25 July 2021

ఆగస్త్య మహర్షి చే ప్రతిష్టించబడి న మీనాక్షి ఆగస్తేశ్వర ఆలయం

 ఆగస్త్య మహర్షి చే ప్రతిష్టించబడి ఎన్నో అద్బుతాలకు నెలవు అయిన మీనాక్షి ఆగస్తేశ్వర ఆలయం

శివలింగం తల భాగంలో నుంచి దివ్యజలం ఊరుతూ వుంటుంది.
గుంటూరు జిల్లలోని ఉన్న దాచేపల్లి కి అతి దగ్గరలో #తెలంగాణా రాష్ట్ర దామచర్ల మండలం #వాడపల్లే గ్రామంలో #మీనాక్షీ #ఆగస్తేశ్వర #స్వామి వారి ఆలయం ఉంది .. 🙏
ఇక్కడి శివుడిని .. లక్ష్మీనరసింహస్వామి మూర్తులను 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతోంది.
కృష్ణానది,ముచికుందానది(మూసీ)ప్రవహించే పవిత్ర సంగమ ప్రాంతాన్ని 6000 సంవత్సరాల క్రితం ఆగస్త్య మహర్షి తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతాన్ని చూసి రెండు నదుల సంగమ ప్రదేశం అతి పవిత్ర స్థలంగా భావించి నదిలో స్నానమాచరించి శివలింగాన్ని,లక్ష్మీ నృసింహ స్వామి వార్ల కు నది ఒడ్డున 120 అడుగుల ఎత్తులో ప్రతిష్టించి పూజించాడట. అప్పట్లో అటవీప్రాంతం కావటంతో ఆగస్త్యడు ప్రతిష్టించిన విగ్రహాలు ను ఎవరూ చూడక వాటిపై క్రమేణా పుట్టలు వెలిసాయి
14 వశతాబ్దంలో రెడ్డి రాజులు (అన వేమారెడ్డి.భీమా రెడ్డి పరిపాలనా కాలంలో) ఈ ప్రాంతాన్ని సందర్శించి నదీ తీరంలో కోట నిర్మించుకోవచ్చని త్రవ్వకాలు చేపట్టగా పుట్టలో కనిపించిన శివలింగం,నృసింహ స్వామి వార్ల విగ్రహాలు చూసి ఆశ్చర్యం పొంది భక్తితో దేవాలయాన్ని నిర్మించి పూజలు చేయనారంభించారు
ఆ కాలంలో ఈ గ్రామాన్ని ఆగస్త్యపురం,నరసింహపురం,వీరభధ్రపురం అని పిలిచేవారట.
కాలక్రమేణా నైజాం నవాబ్ మేనల్లుడు నజీర్ సుల్తాన్ ఈ ప్రాంతం పై దండెత్తి రెడ్డి రాజుల కోటలను ద్వంసం చేసారు,కాని పవిత్ర ఆలయం అని తెలిసి ఆలయం ను ఏమి చెయలేదట
ఇక శివలింగం తల భాగంలో నుంచి దివ్యజలం ఊరుతూ వుంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కలేదు. శివలింగం తల భాగంలో రెండు వైపులా నీరు ఊరటం వెనుక ఒక చారిత్రక కధనం ఉంది:
ఒక రోజు ఒక బోయవాడు బాగా ఆకలిగా ఉండి ఒక పావురం ను తన బాణం తో వేటాడుతూ రాగా ఆ పావురం ఈ ఆలయంలో శివలింగం వెనుక దాక్కునగా,బోయవాడు అప్పటికి వేటాడబోగా స్వామి వారి ఆ పావురం నా రక్షణలో ఉంది దానిని వదులుము అని తన వాక్కు వినిపించారట.
బోయవాడు అది నమ్మక మరి నా ఆకలి ఎవరూ తీర్చుతారు దానిని వదిలితే అని ఎదురు ప్రశ్న వేయగా నా తలలో మెదడు భాగం స్వీకరించమని వినిపించగా బోయవాడు వెళ్లి శివలింగం తలపై తన రెండు చేతులతో గట్టిగా లాగగా కొంత మాంసం వచ్చిందట.. వెంటేనే తలపై ఉన్న గంగమ్మ పైకి ఉబికింది.
అప్పటి నుండి ఈ ఆలయంలో శివలింగం పై తల భాగాన చేతి వేళ్ళ గుర్తులు, రెండు వైపులా వేళ్లు పట్టే చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. శివలింగం తలపై రెండు వైపులా ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు ను తోడివేసినా మరలా వెంటేనే ఊరుతూ ఉంటుంది.అది ఈ నాటికి జరుగుతూ ఉంది
1524 వ సంవత్సరంలో శంకరాచార్యులు ఈ ఆలయం దర్శించి శివలింగంపై నీరు ఎలావస్తుందో స్వయంగా పరిక్షించ దలచి ఒక ఉద్దరిణి కి దారం కట్టి ఆ బిలంలో వదిలారట. ఆ దారం ఎంత వదిలినను లోపలికి వెళ్తూ ఉందట,చివరికి పైకి లాగి చూడగా ఆ ఉద్దరిణి చివర రక్తపు మరకలు కనిపించగా,స్వామివారిని పరీక్షించి తప్పు చేసానని శాంతి హోమం చేసి క్షమించమని స్వామి వారిని కోరి ఇదే విషయం ను ఆలయం లో పాళీ భాషలో శాసనం వేయించారు.అది ఇప్పటికి మనం చూడవచ్చు
ఒక వైపున మూసీ నదీ .. మరో వైపున కృష్ణా నది ప్రవహిస్తూ ఉండగా, మధ్యలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. మూసీ నది ఒడ్డున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం .. కృష్ణా నది ఒడ్డున శివాలయం దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రెండు నదుల సంగమ క్షేత్రం కావడం వలన భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి శ్వాస తీసుకుంటున్నట్టుగా ఆయన నాసిక ఎదురుగా వున్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ దీపానికి కాస్త కిందగా వున్న మరో దీపం నిశ్చలంగా ఉంటుంది. స్వామి వారికి నిత్యపూజలతో పాటు,శివరాత్రి,కార్తీక మాసంలో గొప్ప ఉత్సవాలు చేస్తారు. ఈ ఆలయ్యంలో మీనాక్షి అమ్మవారు,నాగదేవత లు విగ్రహాలు ఉంటాయి.అలనాటి పురాతన రాతి స్తంభాలు,పురాతన మర్రి చెట్టు మనం చూడవచ్చు
ఈ ఆలయంలో స్వామి వార్లను ఆరాధించిన వారికి కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు చెపుతారు..
ఆలయ సమయాలు ;-
ఉదయం 6 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
తిరిగి సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 8 గంటల వరకు.
మిర్యాలగూడ నుండి 25 km దూరం లో కలదు ..

old is gold

 ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు 27 ఏళ్ళ సాడియో మానె సెనెగల్ ￰ఆఫ్రికా దేశస్థ ఆటగాడు

మన కరెన్సీ తో పోలిస్తే అతను వారానికి 140 మిలియన్లు సంపాదిస్తున్నాడని చెప్పబడింది
అతను పలుచోట్ల పగిలిపోయిన ఫోన్ తో కనిపించాడు
ఆ విషయమై ఒక్కసారి ఆయన్ను అడగగా
అటువంటి ఫోన్ ఒక వెయ్యి
10 ఫెర్రారీస్ 2 జెట్ విమానాలు వైడూర్యపు గడియారాలు కొనగలను కానీ నేను ఎందుకు కొనాలి అని అడిగాడు
నేను పేదరికాన్ని చూసినవాని
నేను పేదరికాన్ని అనుభవించినవాణ్ణి
నేను చదవలేకపోయాను అందుకే ప్రజల కోసం పాఠశాలలు కట్టించాను
వేసుకోవడానికి కనీసం బూట్లు లేవు
అవి లేకుండానే ఆటలు ఆడాను
మంచి దుస్తులు లేవు ధరించడానికి
కడుపు నిండా తిండి లేదు
ఇప్పుడూ నేను చాలా పొందాను
వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను అన్నాడు
నలుగురికి సాయపడే మనసు అందరికి రాదూ
ఇటువంటి వారు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము❤️🌷❤️
సేకరణ

Saturday, 24 July 2021

1955 వ సంవత్సరం విజయవాడలో జరిగిన యదార్థ సంఘటన🙏



1955 వ సంవత్సరం విజయవాడలో
జరిగిన యదార్థ సంఘటన🙏
విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు..
ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది..
1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది..
విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు..
అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి..
అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది..
అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లీ అమ్మ.. తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు..
కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాదానం లేదు అదేంటీ అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో అదేంటీ అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగా లో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, పదిరూపాయల నోటు మరో పక్క ఉన్నాయి.
వెంటనే ఆయనకి అర్ధమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని..
దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికీ జరిగింది చెప్తే వెనుకబడిన బలహీన వర్గాల్లో కొంత మందికి పూనకం వస్తుంది అది సాక్షాత్తు అమ్మవారే అని అంటున్నారు .. ఎందుకంటె వాళ్ళకే భక్తి భయం ఎక్కువ అమ్మ వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది...
ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి
ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు..

Tuesday, 6 July 2021

🙏🌺నవదిన"కాశీ_యాత్ర🌺🙏

 🙏🌺నవదినకాశీ_యాత్ర🌺🙏


🌺కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి🌺


🌺మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి, అ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు..


అయితే కలికాలం లో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.. దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు. అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు🌺


🌺మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి


విశ్వేశ్వర నామ స్మరణ,

దానాలు చేయటం,

ధర్మ ప్రసంగాలు వినటం,

ఏక భుక్తం,

ప్రాతఃకాల స్నానం,

ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,

కోపం లేకుండా ఉండటం,

అబద్ధమాడకుండా ఉండటం,

అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి🌺


🌺 మొదటి రోజు కార్యక్రమం


ఆగత్య మణి కర్న్యామ్తు –

స్నాత్వా దత్పధనంబహు –

వపనం కారయిత్వాతు –

స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః

సచేల మభి మజద్యా ధ–

కృతా సంధ్యాధిక  క్రియాహ్

సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –

కుశ గంధ తిలొదకైహ్’’


మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న...  శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే . అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు.. 

విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు.🌺


🌺యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..

కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..

మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..

రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి.


’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే.. 

ఆ గంగా కేశవస్చైవ –

ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –

ఆ మద్ధ్యా ద్దేవ సరితః 

స్వర్ద్వారా న్మణికర్ణికా 

నమస్తే నమస్తే నమః‘’


అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను ,

21 కుడుములను సమర్పించి , 21 సార్లు గుంజీలు తీసి  21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.🌺


🌺దున్దీ రాజ గణేశాన –

మహా విఘ్నౌఘనాశన –

నవాఖ్యాదిన యాత్రార్ధం –

దేహ్యాజ్ఞానం కృపయా విభో’’

అని ప్రార్ధించాలి . తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..

ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి..

ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.


 ‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –

మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’

అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.🌺


🌺 రెండవ రోజు కార్యక్రమం


రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా 

ఘట్టం లో స్నానం చేయాలి. తీర్ధ శ్రాద్ధం  చేయాలి.  వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి..  గురు ఉపదేశం తో ....

‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి.  రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి 🌺


🌺  మూడవ రోజు కార్యక్రమం


తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప  స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి.. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి .

వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి.  పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి. 

కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –

పంచ నద్యోత్ర కీర్తితః ‘’

అని స్మరిస్తూ స్నానం చేయాలి .


తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్నేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమె స్వీకరించాలి .🌺


🌺 నాల్గవ రోజు కార్యక్రమం


ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన  కాల భైరవుని పూజించాలి..


కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..

 ‘’ఓం కాశ్యై నమః ‘’అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి  భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు,పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.🌺


🌺 అయిదవ రోజు కార్యక్రమం


ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాతా తిలా భాన్దేశ్వర , చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం దక్షిణా సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు..

అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.🌺


🌺 ఆరవ రోజు కార్యక్రమం


సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి  వాయన దానాన్ని చేయాలి..

వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,

శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.🌺


🌺 ఏడవ రోజు కార్యక్రమం


గంగాస్నానం, నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి. ఇరవై  ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి..  ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..


డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,

హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి.🌺


🌺ఎనిమిదో రోజు కార్యక్రమం


గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.

దక్షిణా తాంబూలం సమర్పించాలి...  భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ 

నిద్ర పోవాలి.🌺


🌺 తొమ్మిదో రోజు కార్యక్రమం


గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,

నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..

రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి 🌺


🌺పదవ రోజు కార్యక్రమం


నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి.🌺


🌺ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  

శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత

🌿🌼🙏యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని దర్శనం 🙏🌼🌿పూర్తిగా చుడండి 🙏🌼🌿

 🌿🌼🙏అత్యంత అరుదైన దర్శనం 🙏🌼🌿

🌿🌼🙏యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని దర్శనం 🙏🌼🌿పూర్తిగా చుడండి 🙏🌼🌿


🌿🌼🙏యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చరిత్ర🙏🌼🌼


🌿🌼🙏స్థల పురాణం🙏🌼🌿


ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.


తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా  ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.


ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.


రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.


చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.


మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.


🌿🌼🙏యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి.... యాదగిరి గుట్ట🙏🌼🌿


యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏం కావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు.


ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ  నమః

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 


మన గురు . మన ఓంకారం 


ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 


https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ


మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 


జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత

ప్ర‌హ్లాదోపాఖ్యాన‌ము శ్రీ నరసింహావిర్భావం ⚜️⚜️🌺🌺⚜️⚜️🌺🌺⚜️⚜️

 ప్ర‌హ్లాదోపాఖ్యాన‌ము


శ్రీ నరసింహావిర్భావం


⚜️⚜️🌺🌺⚜️⚜️🌺🌺⚜️⚜️


బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "


ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.


ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.


ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.


హిరణ్యాకశిపుని చంపుతున్న నరసింహ అవతారము


స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.


మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.


"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.


శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.


ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.


శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సంహారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సంచారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!


జ‌య‌ జ‌య‌ శ్రీన‌ృసింహ‌

జ‌య‌ జ‌య‌ శ్రీన‌ృసింహ‌

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 


మన గురు . మన ఓంకారం 


ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 


https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ


మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  

శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత

🌹🌹🌹🌹🌹🌹🌹🌹 కర్నూలు జిల్లా అహోబిలం నవనారసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాం

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కర్నూలు జిల్లా అహోబిలం నవనారసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాం.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.

☘☘☘☘☘☘☘☘

1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

2.అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 


మన గురు . మన ఓంకారం 


ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 


https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ


మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  




శ్రీ గురూజీ మహారాజ్ 


జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత

స్నానం ఏ సమయంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి

 💦🔴 రుషి స్నానం, 

💦🔴 దేవ స్నానం, 

💦🔴 మానవ స్నానం, 

💦🔴 రాక్షస స్నానం... ఇంతకీ మీది ఏ స్నానం...? 

💦🏵️ బారెడు పొద్దెక్కినా నిద్రలేవ‌కుండా ప‌డుకోవడం ఇపుడు సిటీల‌లోనేకాదు. ప‌ల్లెలోనూ ఫ్యాష‌న్‌గా మారింది. అర్థరాత్రివ‌ర‌కు సినిమాలు, టీవీల‌తో గ‌డిపేసి ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.

సూర్యుడు న‌డినెత్తిన చేరినత‌ర్వాత స్నానం చేస్తుం టారు. కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తికాదు. అస‌లు స్నానం ఎపుడుచేయాలి? దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలేవి? 

 💦🏵️ తెల్లవారుజామున 4-5 గంటలమధ్య చేసే స్నానం "అత్యుత్తమం". దీన్ని "రుషిస్నానం" అంటారు. 

💦🏵️ 5 నుంచి 6 గంటలమధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది "మధ్యమం".

💦🏵️  ఇక 6 నుంచి 7 గంటలమధ్య చేసే స్నానాన్ని "మానవస్నానం" అంటారు. ఇది "అధమం". 

💦🏵️ ఇక 7 గంటల తర్వాత చేసేస్నానాన్ని" రాక్షస స్నానం" అంటారు. ఇది "అధమాతి అధమం". 

💦🏵️ కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానంచేయడం పుణ్యప్రదం. ఇక స్నానాల్లోకెల్లా చన్నీటిస్నానం ఉత్తమం. 

💦🏵️ ప్రవహించే నీటిలో స్నానంచేయడం ఉత్తమోత్తమం.

💦🏵️ చెరువులో స్నానం చెయ్యడం మద్యమం. 

💦🏵️ నూతి(బావి) వద్ద స్నానంచెయ్యడం అధమం. 

💦🏵️ వేయి పనులున్నా వాటినివదిలి సమయానికి స్నానం చేయాలి. ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు. కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. షాంపేన్ తో స్నానం చేసేవారు కూడా అక్కడక్కడా ఉన్నారు. 

💦🏵️ అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పడుకోటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు. ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది. మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు. అగ్నిలో దాహక శక్తి మనల్ని దహించేస్తుంది.

💦🏵️  కనుక జలంతో శుద్ధి చేసుకోవడం అందు బాటులో ఉన్న శాస్త్రసమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూపురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది. 

 ⛱ మంత్ర స్నానం : వేదంలో చెప్పబడిన నమక, చమక, పురుషసూక్తాలను, మార్జనమంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం"

 ⛱ భౌమ స్నానం :  పుణ్యనదుల్లో దొరికే మన్ను లేక పుట్టమన్ను లాంటి పవిత్ర మృత్తికను ఒంటి నిండా రాసుకుని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".

 ⛱  ఆగ్నేయ స్నానం : సమస్తపాపాలను దగ్ధంచేసి పుణ్యరాశిని చేకూర్చే భస్మాన్ని మంత్రసహితంగా లేదా శివనామం ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"

⛱ వాయువ్య స్నానం : 33 కోట్ల దేవతులు నివశించు గోమాత పాదధూళితో చేసేది "వాయువ్య స్నానం"

 ⛱ దివ్య స్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మసాక్షి అయినసూర్యభగవానుడు ఆకాశంలోఉండి సూర్యకిరణాలను వెలువరి స్తున్నపుడు వానలో స్నానంచేయడం "దివ్య స్నానం".

 ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

 ⛱ వారుణ స్నానం :  పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".

 ⛱ మానస స్నానం : నిత్యం నారాయణనామ స్మరణతో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, అహంకార, ఢంభ, దర్ప, దైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీకపోవడం "మానస స్నానం". ఇది మహత్తరస్నానం. మహర్షులచేత ఆచరించ బడుతుంది. ఈ స్నానంకోసం అందరూ ప్రయత్నం చేయాలి.

.........

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 


మన గురు . మన ఓంకారం 


ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 


https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ


మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  




శ్రీ గురూజీ మహారాజ్ 


జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత

నిత్య పారాయణ శ్లోకాః

 నిత్య పారాయణ శ్లోకాః


ప్రభాత శ్లోకః

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥

[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥]


ప్రభాత భూమి శ్లోకః

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥


సూర్యోదయ శ్లోకః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥


స్నాన శ్లోకః

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥


నమస్కార శ్లోకః

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥


భస్మ ధారణ శ్లోకః

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణం ।

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనం ॥


భోజన పూర్వ శ్లోకాః

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ।

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ॥


అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ॥


అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥


త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ।

గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥


భోజనానంతర శ్లోకః

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనం ।

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం ॥


సంధ్యా దీప దర్శన శ్లోకః

దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।

దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥


శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।

శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥


నిద్రా శ్లోకః

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం ।

శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ॥


అపరాధ క్షమాపణ స్తోత్రం

అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా ।

దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥


కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధం ।

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥


కాయేన వాచా మనసేంద్రియైర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి ॥


దేవ స్తోత్రాః


కార్య ప్రారంభ స్తోత్రాః

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥


యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం ।

విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥


గణేశ స్తోత్రం

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।

అనేకదం-తం భక్తానాం-ఏకదంత-ముపాస్మహే ॥


విష్ణు స్తోత్రం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ।

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥


గాయత్రి మంత్రం

ఓం భూర్భువ॒స్సువః॒ । తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ ।

భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥


శివ స్తోత్రం

త్ర్యం॑బకం యజామహే సుగ॒ంధిం పు॑ష్టి॒వర్ధ॑నం ।

ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్-మృత్యో॑ర్-ముక్షీయ॒ మాఽమృతా᳚త్ ॥


వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం‌ ।

వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం‌ ॥


సుబ్రహ్మణ్య స్తోత్రం

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం

దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ।

స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం

కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ॥

గురు శ్లోకః

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।

గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥


హనుమ స్తోత్రాః

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥


జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।

హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥


శ్రీరామ స్తోత్రాం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే


శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।

సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు ॥


శ్రీకృష్ణ స్తోత్రం

మందారమూలే మదనాభిరామం

బింబాధరాపూరిత వేణునాదం ।

గోగోప గోపీజన మధ్యసంస్థం

గోపం భజే గోకుల పూర్ణచంద్రం ॥


గరుడ స్వామి స్తోత్రం

కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ ।

విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥


దక్షిణామూర్తి స్తోత్రం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।

నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥


సరస్వతీ శ్లోకః

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥


యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।


లక్ష్మీ శ్లోకః

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥


సరస్వతీ స్తోత్రం

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీం ।

విద్యారంభం కరిష్యామి సిధ్ధిర్భవతు మే సదా ॥


దుర్గా దేవీ స్తోత్రం

సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।

భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥


యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ।

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।


త్రిపురసుందరీ స్తోత్రం

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ।

ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం ॥


దేవీ శ్లోకః

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥


వేంకటేశ్వర శ్లోకః

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినాం ।

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥


దక్షిణామూర్తి శ్లోకః

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥


బౌద్ధ ప్రార్థన

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి


శాంతి మంత్రం

అసతోమా సద్గమయా ।

తమసోమా జ్యోతిర్గమయా ।

మృత్యోర్మా అమృతంగమయా ।

ఓం శాంతిః శాంతిః శాంతిః


సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః ।

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥


ఓం స॒హ నా॑వవతు । స॒ నౌ॑ భునక్తు । స॒హ వీ॒ర్యం॑ కరవావహై ।

తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై᳚ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥


స్వస్తి మంత్రాః

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం

న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం

లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ॥


కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।

దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ॥


విశేష మంత్రాః

పంచాక్షరీ మంత్రం - ఓం నమశ్శివాయ

అష్టాక్షరీ మంత్రం - ఓం నమో నారాయణాయ

ద్వాదశాక్షరీ మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ;;


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

అసుర సంధ్య... ✨✨✨🌷🌷🌷✨✨✨

 అసుర సంధ్య...


✨✨✨🌷🌷🌷✨✨✨


హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్య" అని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం. సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య. 


ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమథ గణములు, భూతకోటి శివ నామాన్ని ఉచ్చరిస్తూ,శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు. 


ముప్పది మూడు కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వం తో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు. సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. 


అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి, నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.


అలాగాక పరమేశ్వర జపం / ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

చెప్పులను..చెప్పుడు మాటలను .. గుమ్మం దగ్గరే వదిలెయ్యాలి .. !!

 చెప్పులను..చెప్పుడు మాటలను .. గుమ్మం దగ్గరే వదిలెయ్యాలి .. !! 


 " ప్రతి మనిషి వాస్తవాల కన్నా..పక్కవాడు చెప్పిందే ఎక్కువగా నమ్ముతాడు

..కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాన్నీ కాకుండా..

ఎవరూ ఏదో చెప్పిన దాన్ని గురించి ఆలోచిస్తాడు .. 

నువ్వు బాగా నమ్మిన ఒక విషయాన్నీ లేదా..

నువ్వు బలంగా తీసుకున్న నిరణయాన్ని..

నీ చుట్టూ ఉన్నవాళ్లు కొంతమంది ) మార్చడానికి లేదా 

తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు ( కొంచం ఎక్కువగానే ) .. 

నువ్వు కూడా తెలియకుండానే ఆ వైపు ఆలోచించడం మొదలుపెడ్తావు..

నీ మనస్సు వరకు తీసుకెళ్తావ్..అలా ఆలోచించడం ఎక్కువసార్లు నీకు నష్టాన్నే తీసుకురావొచ్చు .. 

నేను చెప్పాలనుకున్న విషయం ఒక్కటే..నిన్ను పాడుచేసే ఆలోచనలని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది ... 

నీపై నీకు నమ్మకం ఉంటే..

ఎవ్వరి మాటలను వినాల్సిన అవసరంలేదు .. 

నీకు మంచి చేసే వాటి గురించి ఆలోచించు..

నీ దారి మార్చేసే వాటి గురించి అస్సలు ఆలోచించకు..

నీ వెంట తీసుకెళ్లకు .. !! " ప్రపంచం లో సగానికి పైగా పక్కవాడి గురించి ఆలోచించడం వల్లే మనం వెనకపడిపోయం

 పొద్దున మొదలు రాత్రి వరకూ ఇంకొకడి ఆలోచనలే తప్ప ని గురించి అలోచించి వుంటే 

ఎప్పుడూ నీ జీవితం బాగుపడేది

ఇప్పటికైనా మనుకో.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

కుటుంబం... ✨✨✨🌷🌷🌷✨✨✨

 కుటుంబం...


✨✨✨🌷🌷🌷✨✨✨


అరటిపండును తొక్క తీసే తింటాం. సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం .సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం,పై తొక్కు,లోపలి గింజలు వదిలేస్తాం.ఆపిల్,జామ పళ్ళని మొత్తం తినేస్తాం.ఇలాగ మనం ఒక పండులో టెంకని,ఒక పండులో గింజని ,ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం .


ఒక్కోటి ఒక్కో రుచి.తీపి,పులుపు,వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు.అన్ని ఇష్టమే ,ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు.మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే.అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు. కుటుంబంలో భార్య భర్త ,అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు,అందరు ఒక్కో రకం పండు ,ఒక్కోరిది ఒక్కో స్వభావం .


అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే ,వాళ్ళు చూపించిన కోపమో ,చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !


పండులాగే కోపతాపాలు,ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.ఇది గుర్తించగలిగితే ,వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.కుటుంబమనేది -

ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

💫 మనిషికి సహనమే సంస్కారం..! 🎊

 💫 మనిషికి సహనమే సంస్కారం..!  🎊


మన సనాతన సంప్రదాయాలు మనకు నేర్పినది ఏమిటి ? మనిషైపుట్టిన వానికి సహనం, శాంతం అవసరమని మన పూర్వీకులు నేర్పించారు. జీవితంలో ఆధ్యాత్మిక లక్షణాలను నేర్చుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి.


చాలామంది ఎన్నో ముఖ్యమైన విషయంలలో 'అది నాకు సంబంధించింది కాదు' అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. ఇందులో గమ్మత్తేమిటంటే తను అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.


సహనం అంటే ఏమిటి : నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం. పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది.


మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంటుంది. అందుకేనేమో తత్వవేత్తలు సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నను ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనం అవసరం.


సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర పురాణాలే మనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టిలో కలవడం లాంటివి ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞత అని అంటాడు.


కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కనపెడితే విజ్ఞతతో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వలన భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదానుగ్రహానికి చేరువ చేస్తుంది. మనిషికి విలువైనదేదీ తొందరగా దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు.


కష్ట, నష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో జీవిస్తున్న మనిషి ద్వంద్వ వైఖరి లేకుండా చిత్త శుద్ధి ఎంతో అవసరం. స్పృహతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణానికి బొమ్మ, బొరుసూ అంటు ఉంటాయి. మనిషి అన్ని తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజమే కానీ, ఎదో అదృశ్యశక్తి అనేది పరిస్థితుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి యొక్క మంచి ఆలోచనలు సహనంతో ముడిపడి ఉంటాయి, ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి.


ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు అని ఉదాహరణగా చూసుకోవచ్చును. అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు.


మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే అన్నిమతాలు సహనాన్నే బోధిస్తాయి. వాటిని చదవడం, వినడంతో సరిపోదు హితభోదలు చేసే గ్రంథాల మర్మం కనుగొన్న వాడే సహనాన్ని అర్ధం చేసుకోగలడు.


మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి.


సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఈ విషయంలో మనిషి తప్పు కాని మతం కాదు, కులంకాదు ప్రధానం గుణం ప్రధానం. సహనం ఉన్న వానికే తానేమిటి, తన కుటుంబం, ఊరు, దేశం గురించి ఆలోచ విచక్షణలు కలుగుతాయి !


🙏🇮🇳😷🥦🔮💉🎊💫🪴

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

*🔱శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే...! *🔱

 *🔱శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే...!


👉🏾చాలా సంవత్సరాల క్రితం కాంచీవరం లో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండే వాడు. అతను బంగారు నగలు తయారు చెయ్యడంలో నిపుణుడు.‌‌

అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్లు ధరించే గొలుసులు , గాజులు , పాపిడి చేరు లాటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా , నడుముకి ధరించే , వడ్డాణం అతను చేస్తే చాలా బాగా అమరేది.‌ అతను చేసినంత బాగా నడుముకి పెట్టుకొనే నగ చేయడం ఇంకెవరి వల్లనా అయేది కాదు. దానివల్ల అందరూ‌ అతని చేతే నగలు చేయించుకోవాలని ఉబలాటపడేవారు.


స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగు ఉండేది కాదు. ‌ కానీ అతను అపర శివ భక్తుడు.‌‌ విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు.‌


దాని వలన‌ అతను కేవలం శివ భక్తులకి మాత్రమే నగలు చేసేవాడు. అదీ కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోడం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన‌ అతను ధనార్జన గురించిగానీ , రాజాశ్రయం గురించి గానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు.


ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహా విష్ణువు కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణ కారులు తయారు చేసేసారు. అయితే , స్వామి వారి నడుముకి పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు.


మహారాణీకి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకి శివయ్య గురించి చెప్పీ తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకి పెట్టే నగలు తెప్పించి రాణీ గారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణీ మైమరచిపోయింది. శివయ్య చేత స్వామి వారి‌ నగ చేయించాలని వెంటనే నిర్ణయించి , శివయ్యని పిలిపించింది.


ఈ విషయం‌ తెలీని శివయ్య, రాణీగారి వద్దకు వచ్చేడు.‌ రాణీగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని , తను శివుని‌ తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పేడు. మహా రాణీకి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చెయ్యడు ? అన్న పంతం వచ్చింది.‌


అక్కడ శివయ్య గురించి‌ తెలిసినవారు జోక్యం చేసుకొని శివయ్యతో ఇలా చెప్పేరు.


" శివయ్యా !  ఇది మహారాజుతో వ్యవహారం.‌ ఈ ఒక్కసారికీ , ఈ నగ చేసేయ్ ! లేకుంటే , అనవసరంగా , శిక్షకి గురికావలసి ఉంటుంది." అయితే శివయ్య , నేను విష్ణు ఆలయంలోకి వెళ్లను కదా !  కొలతలు లేకుండా నగ ఎలా చెయ్యాలి ? అని అడిగేడు.


దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము. నువ్వు దాని ప్రకారం , నగ చేసెయ్యి , చాలు అని స్వామి వారి నడుము కొలతలు తీసి శివయ్య కి అంద జేసారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకి తన ఊరు వెళ్లడానికి అనుమతి ఇమ్మని అడిగేడు.


రాణీ ఆలయ పెద్దలతో , ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయింది.


మళ్లీ మహా రాణి శివయ్య ని నగ సరి చేసి ఇమ్మంది.‌ శివయ్య చేసి ఇచ్చేడు. మళ్లీ అలాగే చిన్నది అయింది. ఇలా‌‌ మూడు సార్లు జరిగే సరికి శివయ్యే ఆశ్చర్య పోయేడు. కొలత సరిగా ఇవ్వటం లేదేమొ అందుకే సరిగా అమరటం లేదేమో అని అన్నాడు.‌‌ మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది.


కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా ! దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పేడు. "నువ్వు కళ్లకి గంతలు కట్డుకొని రా ! మేము నీకు సాయం చేస్తాం" అన్నారు శివయ్యకి ఇష్టం లేక పోయినా , ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదాని , కళ్లకి గంతలు కట్టుకొని గుడికి బయలుదేరేడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది.


గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కొలత తీసుకునేటందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివ లింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కి పడి , ఇదేమిటి ? ఇది శివాలయమా ! అనుకుంటూ కళ్ల గంతలు తీసేసాడు.


ఎదురుగా విష్ణు విగ్రహం. చటక్కున కళ్లు మూసుకొని మళ్లా కొలతలకని నడుముని తాకేసరికి , ఈసారి చేతికి నెలవంక , నాగుపాము తగిలేయి. మళ్లీ ఆశ్చర్యంతో కళ్లు తెరిచి చూసేసరికి శ్రీ మహా విష్ణువే ! మళ్లీ కళ్లు మూసుకొని కొలత తియ్యబోతే అర్ధ నారీశ్వరం లా తోచింది. కళ్లు తెరిస్తే మహా విష్షు కళ్లు మూస్తే శివుడూ లా గోచరిస్తూ ఉండేసరికి శివయ్య కే కనువిప్పు అయింది.‌


వెంటనే చెంపలు వాయించుకుంటూ


" స్వామీ ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా ! శివ కేశవులు ఒకరే అన్న గొప్ప నిజం తెలిసినా , అహంకారం చేత విష్ణువు కన్నా , శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసినా , ఈ‌ దీనుడికి అసలు నిజం బోధపడేట్టు రుజువు చేసేవు.‌ ఇక పై నా జీవితం శివ కేశవ సేవకే వినియోగిస్తాను" అని పాదాభిషేకం‌ చేస్తున్న శివయ్య ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.


ముందుగా మహారాణి తేరుకొని , శివయ్యా ! నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే , స్వామి నీద్వారా శివకేశవులు ఒకటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ తెలియజెప్పేరు. ఇకపై ఎవరూ శివ కేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను " అని ప్రకటించింది ప్రజలందరూ హర్షం‌ ప్రకటించారు.


ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అతికినట్డు సరిపోయింది.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

ఆయుర్దాయం..... ✨✨✨🌻🌻🌻✨✨✨

 ఆయుర్దాయం.....


✨✨✨🌻🌻🌻✨✨✨


“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. 


అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలo.


కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి.... అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. 


నిజమే... ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా ? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా ? ఆని సందేహం.


ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|

పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||


అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని" దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని మరొక ప్రశ్న...


“లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” 


నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న...


ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా ? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా ! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.


లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా... మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూసాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. 


కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు.. “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి...

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

గోత్రం అంటే ఏమిటి?

 గోత్రం అంటే ఏమిటి? 

సైన్సు ప్రకారము 

మన పూర్వీకులు

గోత్ర విధానాన్ని ఎలా 

ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న 

ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం  వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

జీన్-మ్యాపింగ్ అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 

పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?


మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 


వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?


వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? 

తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  

మన గోత్ర వ్యవస్థ వెనుక 

జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం


గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 

వీటిల్లో సెక్స్ క్రోమోజోములు

 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి 

మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు 

అది X లో కలవదు. 

కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 

ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు 

ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్  పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 

లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది

మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

🙏#పులస్త్య మహర్షి :

 🙏#పులస్త్య మహర్షి  :

👉🏻మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం.


ఈ రోజు మనం  పులస్త్య మహర్షి గురించి తెలుసుకొందాం...


 పులస్త్య మహర్షి  బ్రహ్మగారి కుడి చెవి నుంచి పుట్టాడు...అంటే బ్రహ్మమానసపుత్రుడు అన్నమాట. తపస్సు చేసుకుంటూ క్రోథం, కామం జయించి అపరశివుడిలా వెలిగిపోతూ ఉన్నాడు పులస్త్య మహర్షి.


కర్దమ ప్రజాపతి కుమార్తె హవిర్భవను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే అగస్త్య మహర్షి.


 అగస్త్యుడి జననం తర్వాత పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకుంటాడు. ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఆడుకుంటారు.


తపస్సుకి విఘ్నం కలగడానికి ఇష్టపడక పులస్త్యుడు ఇక ముందు తన ఆశ్రమం  వైపు వచ్చిన ఆడపిల్ల వెంటనే గర్భవతవుతుందని శపించాడు. 

 ముని శాపంతో భయపడిన ఇద్దరు బాలికలు అక్కడనుంచి పారిపోతారు.


ముని శాపం తెలియని తృణబిందు రాజు రాజర్షి కుమార్తె ఇద్విద ఆశ్రమానికి వచ్చి గర్భవతిగా మారుతుంది. తన ప్రమేయం లేకుండా జరిగిన విషయాన్ని తండ్రికి వివరించడంతో మహారాజు పులస్త్యుడి దగ్గరకి వచ్చి తన కుమార్తెను భార్యగా స్వీకరించమని అభ్యర్థించాడు. అతడి మాటను మన్నించిన పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఈ దంపతులకు విశ్రవసు జన్మించాడు. ఈయనే రాక్షసులను పుట్టించాడని అంటారు. ఆయన కుమారులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణక, కుబేరుడు. 


ఒకసారి రావణుడు అహంకారం తో కార్తవీర్యుడు పై యుద్ధానికి వెళతాడు.కార్తవీర్యుడు జైల్లో పడేశాడు. పులస్త్యుడు కార్తవీర్యుడింటికి వెళ్ళి రావణుణ్ణి విడిచిపెట్టమని అడిగాడు. కార్తవీర్యుడు పులస్త్యుడికి సత్కారం చేసి ఆయన చెప్పిన విధంగా రావణుణ్ణి విడిపించి సంపదలిచ్చి పంపాడు.


ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో మొదలుపెట్టిన సత్రయాగం ఆపినందుకు ఆనందించి పరాశరుడ్డి వరం కోరుకోమన్నాడు పులస్త్యుడు.


తన మనసెప్పుడు వేదపురాణాల మీద ధ్యాసతో ఉండాలని, వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుని పులస్త్యుడి దగ్గర వరం పొందాడు పరాశరుడు.


 భీష్ముడు గంగా నదీతీరంలో తండ్రికి పితృకర్మలు చేస్తుంటే పులస్త్యుడు అక్కడికి

వెళ్ళాడు. 


భీష్ముడు మహర్షిని పూజించి ఆయన పాదాలు తలమీద పెట్టుకుని స్వామీ ! ఆజ్ఞాపించండి అన్నాడు.


 భీష్మా! నీకేమయినా సందేహాలుంటే అడుగు చెప్తాను అన్నాడు పులస్త్య మహర్షి .


మీరు తీర్థప్రియులు కదా! తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాల గురించి చెప్పండని భీష్ముడు అడిగాడు


పులస్త్యుడు భీష్మా ! ఇంద్రియాల్ని జయించడం, గర్వం, కోపం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, మితంగా తినడం, నిజాన్నే పలకడం, ఎప్పుడు సంతోషంగా ఉండడం

మంచిపన్లే చెయ్యడం ఇలాంటివి చేసేవాళ్ళకి అన్ని తీర్థాలవల్ల వచ్చే ఫలితము దానికదే వచ్చేస్తుంది. ఎక్కడికీ తిరగక్కర్లేదు. 


పుష్కర తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం వస్తుంది జంబూ మార్గం, తండులికాత్రమం, అగస్త్యసరం వీటి వల్ల అశ్వమేధయాగం చేసిన పుణ్యం, రుద్రకోటి అనే తీర్థాలు కురుక్షేత్రం, సోమతీర్థం, నర్మద, దక్షిణ సింధు, చరణ్వతి, సరస్వతి సాగర సంగమం, పింగళతీర్ధం ఇలా అన్ని తీరాలకి దీని ఫలితం దానికే వుందని పులస్త్యుడు వివిధ తీర్ధాల విశేషాలన్నీ భీష్ముడికి చెప్పాడు. 


పులస్త్యుడు స్మృతికర్త, బ్రహ్మ, మహర్షి, సర్వజ్ఞుడు, సర్వదేవతల పూజలందుకున్నవాడు అని పేరు తెచ్చుకున్నాడు.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

✍️... నేటి చిట్టికథ 3

 ✍️... నేటి చిట్టికథ 



ఒక అడవిలో ఒక జింక ఉండేది

ఒక రోజు అది దాహం తీర్చుకోడానికి కాలువ దగ్గరకి వెళ్ళింది. 


తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది.


 'ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకొంటూ... అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంతో నిలబడింది.


 ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని మొఖం దిగులుగా మారిపోయింది. 'కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా! ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు'? అని ఎంతో దిగులుపడింది.



       అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది.


 'ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా!' అనిపించింది దానికి. 


ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది.


 ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది.


 కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. 


వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం, చెంగుచెంగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక.


 అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చేవరకు అలా పరిగెడుతూనే ఉంది. 


ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, "హమ్మయ్య! ఎంత గండం గడిచింది?" అనుకుంది. 


ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి



 దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంది.🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

అందుకే...అన్నమయ్య ఇలా అంటాడు...



 కందువగు హీనాధికము లిందు లేవు | 

 అందరికి శ్రీహరే అంతరాత్మ | 

 ఇందులో జంతుకులమింతా నొకటే | 

 అందరికి శ్రీహరే అంతరాత్మ || 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

"ముకుంద" అని విష్ణు నామాలలో ఒక గొప్ప నామం ఉంది.

 "ముకుంద" అని విష్ణు నామాలలో ఒక గొప్ప నామం ఉంది. "ముకుంద"  అంటే మోక్షాన్ని సైతం ప్రసాదించే వాడు అని అర్థం. మనకు మళ్ళీ జన్మ లేకుండా చావు లేకుండా చేసే వాడు.మనకు బ్రహ్మానందాన్ని కలిగించే వాడు, మనకు బ్రాహ్మీ స్థితిని

ప్రసాదించే వాడు నారాయణుడు. అందుకే ఆయన "ముకుందుడు". అయితే ఇంత గొప్ప మోక్ష స్థితిని ఇవ్వాలి అంటే మనకు ఆ అర్హత ఉండాలి. మన బుద్ధికి ఆ యోగ్యత ఉండాలి. 


ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక శిష్యుడు తన గురువు ఉన్న ఆశ్రమానికి వచ్చాడు. గురువుకు నమస్కరించి అలా ఇలా

చూశాడు. ఒక పక్క 100 రూపాయల నోటును,మరో పక్క ఒక రంగు రాయిని చూశాడు."గురుదేవా నేను కష్టాలలో ఉన్నాను,నాకు ఆ 100 రూపాయలను ఇస్తారా" అని శిష్యుడు అడిగాడు."ఈ 100 రూపాయలతో నీ కష్టాలు ఎంత మాత్రం తీరతాయి,ఇదిగో ఈ రంగు రాయిని తీసుకో,నీ కష్టాలన్నీ మాయమై పోతాయి" అని గురువు తన శిష్యుడికి చెప్తాడు. "ఇప్పుడు నాకు ఆ రాయితో పని లేదు గురుదేవా.ఆ 100 రూపాయలు ఇవ్వండి వెళ్ళిపోతాను" అని అంటాడు శిష్యుడు. ఇక చేసేది ఏమీ లేక గురువు సరే అంటాడు. 


ఆ రంగు రాయి వజ్రం.కానీ శిష్యుడి బుద్ధికి అది వజ్రం అని తెలుసుకునే యోగ్యత లేదు.అందుకే 100 రూపాయలు చాలు అనుకున్నాడు. అలాగే నారాయణుడు "ఎవరైనా నా దగ్గరకు వచ్చి మోక్షాన్ని అడుగుతారా.అడిగితే ఇచ్చే ద్దాం" అని ఎదురుచూస్తూ ఉంటాడట. కానీ స్వామి దగ్గరికి వచ్చిన ప్రతి వాడూ "స్వామీ నాకు మంచి I- phone కావాలి,ఆడపిల్ల ఉంది కానీ మగపిల్ల వాడు కావాలి, లక్షలు ఉన్నాయి కానీ కోట్లు కావాలి" అని ఈ విధమైన కోరికలను అడుగుతూ ఉంటే స్వామి వారు మాత్రం ఏంచేస్తారు. తథాస్తు అని అంటాడు. 


కానీ ఎవరైతే నారాయణా నాకు నీవు తప్ప ఇంకేదీ వద్దు అని అనన్యమైన భక్తి తో ధ్యానిస్తారో,అలాంటి వారికి ఏకంగా మోక్షాన్నే ఇస్తాడు.కాబట్టి మనం ఖరీదైన వస్తువుల కోసం,సిరి సంపదల కోసం కాదు భగవంతుడిని  ప్రార్థించాల్సింది. మన అసలైన సమస్య చావు,పుట్టుకలు. వీటి నుండి బయట పడేయమని నారాయణుడిని ప్రార్థించాలి.మన ఆర్తి నుండి వచ్చేదే ప్రార్థన. మన ఆర్తి దేని కోసం? నారాయణుడి లో కలిసిపోవడం కోసం, యోగించడం

కోసం.అంతేకానీ ఈ శరీరాలతో భోగించడం కోసం కాదు. 


భోగించే కొద్దీ బంధాలు పెరుగుతాయి, కానీ ఆ ముకుందుడితో యోగించే కొద్దీ మన బంధాల నుండి విడుదల. అదే మోక్షం. ఈ విధంగా మనకు మోక్షాన్ని ప్రసాదించి,మనకు చావు,పుట్టుకలు లేకుండా చేసే పరమ దయా స్వరూపుడు "ముకుందుడు". విష్ణు సహస్ర నామాలలో ఎంతో లోతైన జ్ఞానం ఉంది.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

ఈ వీడియో చాల ముఖ్యమైనది.

 ఈ వీడియో  చాల ముఖ్యమైనది.

💝దయచేసి అందరూ చూసి తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి.💝

🎾_ఎడమ వైపు నిద్ర పోవడం

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి . 

# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .

పడుకునే విధానం :----

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి . 

 దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు . 

# మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది . 

మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .

ప్రయోజనాలు ( Benefits ) :--

1 . గురక తగ్గి పోవును . 

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును . 

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది . 

4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు . 

5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి . 

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును . 

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును . 

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి . 

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు . 

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి . 

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది . 

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది . 

15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .

ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును . 

ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి


గమనిక : -

తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి . 

💝 ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది ...💝💝💝

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 
మన గురు . మన ఓంకారం 
ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 
https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ
మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  

శ్రీ గురూజీ మహారాజ్ 
జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

*భగవద్గీత అంటే ఏమిటి?

 వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్


*భగవద్గీత అంటే ఏమిటి?


*స్వయంగా భగవంతుడే తన గురించి, తన భక్తుని గురించి, తనపై ఉండవలసిన భక్తి గురించి చెప్పటం వల్ల మరొక మానవమాత్రునితో పనిలేకుండా మార్పులు, చేర్పులు, తీర్పులు లేకుండా స్వయం సిద్ధమై నిలిచిందీ భగవద్గీత.


*అసలు ఏమిటీ భగవద్గీత?.

భగవద్గీతకు మనకు సంబంధం ఏమిటి?


*అందులోని విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది..??


మానవజన్మను సార్థకం చేసుకొనుటకు *భగవద్గీత ఎలా సాయపడుతుంది…


*మనం సరదాగా మీ బంధువులింటికీ వెళ్ళాలని హైదరాబాదు వెళ్ళామనుకుందాం.


*ఒకరోజు బిర్లా మందిరానికని, ఒకరోజు పార్కుకు, జూకు వెళ్ళివస్తున్నారు.


 *ఒక రోజున ఎవరో స్వామీజీ భగవద్గీతపై ప్రవచనములు చేస్తున్నారని అక్కడికి వెళ్ళారు.


* ఒక గంట సేపు ఆ ప్రవచనాలు విని ఆనందించారు, అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటే హాయిగా ఉండేది.


*కాని మధ్యలో స్నేహితుడు కనిపించి దగ్గరలో సర్కస్ ఉంది, వెళ్దాం అంటే వెళ్ళారు…. జనంలో త్రోసుకొని టికెట్టు కొనుక్కొని లోపలికెళ్ళారు.


*స్నేహితుడు కనిపించలేదు. రెండు గంటలు సర్కస్ చూశారు, తిరిగి ఇంటికి బయలుదేరారు, దారి తెలియలేదు, కరెంటు పోయింది, అయినా ముందుకెళ్ళారు,అక్కడ చిమ్మ చీకటి, కీచురాళ్ళ ధ్వనులు, భయం వేసింది.వడి వడిగా అడుగులు వేస్తున్నారు, వెనుక కుక్క మొరుగుతూ వెంట బడుతున్నట్లు అనుమానం వచ్చి పరుగు లంకించుకున్నారు.  బాధ, దుఃఖం, ఆకలి, అలసట, దిక్కు తెలియక అలా వెళుతున్నారు, అలా ఎంత దూరం వెళ్ళినా మన బంధువుల బజారు రాలేదు…. కనిపించిన వారినల్లా అడ్రసు అడుగుతున్నారు, ఎవరూ తెలియదంటున్నారు….


చివరకు ఒకాయన ఆ ప్రాంతాలన్నీ పరిచయమున్న వ్యక్తి తటస్థపడి “ఇదిగో ఇటు వెళ్ళు, ఒక ఫర్లాంగు వెళ్ళిన తరువాత దారి చీలుతుంది, ఎడమ వైపు తిరిగి సరాసరి వెళ్ళిపో. మీ బజారు వస్తుంది” అని చెప్పాడు.


*ఆ దారి వెంట వెళ్ళి ఇల్లు చేరుకున్నారు, మన బాధలు, భయాలు తొలగిపోయి హాయిగా ఉన్నాము…


ఇదే విధంగా మనం కూడా మన స్వస్థానాన్ని పరమాత్మ స్థానాన్ని విడిచి ఈ మానవ లోకంలోకి వచ్చిపడ్డాం….


"ఇక్కడ ఏవేవో పనులు చేస్తూ వాటి ఫలితంగా సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాం.


*ఈ జన్మను విడిచిపెట్టి మనం చేసిన పుణ్యకర్మల ఫలితంగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన భోగాలు అనుభవిస్తాం.


"అలాగే పాపకర్మల ఫలితంగా నరకయాతనలు, భయంకరమైన దుఃఖాలు అనుభవిస్తాం, ఆ పుణ్య, పాప కర్మల ఫలితాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్లీ ఈ లోకంలో కుక్కగా, నక్కగా, పిల్లిగా, బల్లిగా, పక్షిగా, పందిగా, పులిగా, ఏనుగుగా, చెట్టుగా, పుట్టగా, లేక మానవుడిగా అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం…


" అనేక సుఖాలు, భోగాలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం.


ఇలా అనంత కోటిజన్మలు, ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది…


"ఇప్పటి వరకు కనీసం 83,99,999 జన్మలు ఎత్తాం"


*మనం రోజుకొక డ్రస్సు వేసుకున్నట్లు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహాన్ని తగిలించుకొని ఈ అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం.


"అయితే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకుండానే ఈ ప్రయాణం సాగిస్తుంటాం…


“క స్త్వం క్కో హం కుత ఆయుతః”..

నీవెవరు.. నేనెవరు.. ఎక్కణ్ణుంచి వచ్చాం.. (భజగోవిందం) అని పెద్దలు, శాస్త్రాలు మనను అడుగుతూనే ఉన్నారు.


“మిత్రమా.. ఎక్కడి నుండి ఎక్కడకు నీ ప్రయాణం.. అని.


 *ఏమో.. ఎక్కణ్ణించి వస్తున్నామో తెలియదు.  ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.


*గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఎండుటాకులా ఎలాగో జీవయాత్ర సాగిస్తున్నాం.


*కాని మన ప్రయాణానికి ఒక గమ్యం లేదు.. ధ్యేయం లేదు.. లక్ష్యం లేదు.. “అచ్చపు చీకటింబడి”.. అన్నట్లు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం.


మన ప్రయాణానికి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు.


* పెద్దలు చెబుతున్నా, శాస్త్రాలు ఘోషిస్తున్నా మనం మాత్రం కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవటం లేదు.


"ఇలా దిక్కులు మరచి, దిక్కు తోచక, చీకటిలో ప్రయాణిస్తున్న మనకు అన్ని మార్గాలు తెలిసిన స్నేహితునిలాగా భగవద్గీత మనం ఎక్కడి నుండి బయలుదేరామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్ని విషయాలను చెప్పి, మనలను చేయిపట్టుకొని మన స్వస్థానానికి నడిపిస్తుంది."


సమస్త దుఃఖాలను అంతం చేసుకొని, దుఃఖంలేని ఆనంద సామ్రాజ్యంలో మనలను ఓలలాడేటట్లు చేస్తుంది.


"అయితే మనం ఈ భగవద్గీత అనే స్నేహితుని చేయిపట్టుకొని వదలకూడదు, ఎటునడిపిస్తే అటు నడవాలి.


"ఈ విధంగా మానవుడికి తన గమ్యస్థానం ఏమిటో తెలియజెప్పి అక్కడకు చేర్చే స్నేహితుడు గనుక - భగవద్గీత" మానవుడికి సంబంధించినది. మనకు సంబంధించినది. "మానవ జన్మను సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడేది భగవద్గీత."


కనుక భగవద్గీత చెప్పే విషయాలను గ్రహించాలి, ఈ లోకం మనది కాదు, ఇక్కడి వస్తువులు మనవి కావు. ఇక్కడి దుఃఖాలు, బాధలు కూడా మనవి కావు….


“ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తిన్కోర్జున”.. అన్నట్లు ఈ పదునాలుగు లోకాలు కూడా మన మజిలీలే.


ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి ఏతం బానలాగా పైకీ🖕 క్రిందికీ 👇తిరుగుతూ ఉండాల్సిందే..


హరిః ఓమ్.


"భగవద్గీత అంటే ఏమిటి?"


* జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?


*రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?


*ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?


*అది కేవలం హిందువులదా?


*పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?


కాదు. అవన్నీ అపోహలు.


" ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌.


సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి


*భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.


*సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.


* ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు.


*అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది.


గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.


*సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు.

అదొక మానసిక స్థితి.


వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.


*ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు.


* ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని.


అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.


*ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు.


*టెన్నిస్ క్రీడాకారుడు Roger Federar ని చూడండి - అర్థం కావటానికి.


 ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది.


 *కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు.


నేను అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది.


*ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది.


*అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది.


‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.


*అసలు భగవద్గీత ఏం చెబుతుంది?


*ధర్మాధర్మాల గురించి చెబుతుంది.


*కర్తవ్యం గురించి చెబుతుంది.


నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.


*ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.


*సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.


*ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.


*పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.


*ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.


స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.


*జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.


ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.


*ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.


*మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.


పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.


ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.


కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.


*నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.


*అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.


*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.


 *అర్థం చేసుకున్నవారు ధన్యులు.


వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు.


 *నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది.


*మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.


గీత చదువుకో.రాత మార్చుకో.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...