🙏#పులస్త్య మహర్షి :
👉🏻మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం.
ఈ రోజు మనం పులస్త్య మహర్షి గురించి తెలుసుకొందాం...
పులస్త్య మహర్షి బ్రహ్మగారి కుడి చెవి నుంచి పుట్టాడు...అంటే బ్రహ్మమానసపుత్రుడు అన్నమాట. తపస్సు చేసుకుంటూ క్రోథం, కామం జయించి అపరశివుడిలా వెలిగిపోతూ ఉన్నాడు పులస్త్య మహర్షి.
కర్దమ ప్రజాపతి కుమార్తె హవిర్భవను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే అగస్త్య మహర్షి.
అగస్త్యుడి జననం తర్వాత పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకుంటాడు. ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఆడుకుంటారు.
తపస్సుకి విఘ్నం కలగడానికి ఇష్టపడక పులస్త్యుడు ఇక ముందు తన ఆశ్రమం వైపు వచ్చిన ఆడపిల్ల వెంటనే గర్భవతవుతుందని శపించాడు.
ముని శాపంతో భయపడిన ఇద్దరు బాలికలు అక్కడనుంచి పారిపోతారు.
ముని శాపం తెలియని తృణబిందు రాజు రాజర్షి కుమార్తె ఇద్విద ఆశ్రమానికి వచ్చి గర్భవతిగా మారుతుంది. తన ప్రమేయం లేకుండా జరిగిన విషయాన్ని తండ్రికి వివరించడంతో మహారాజు పులస్త్యుడి దగ్గరకి వచ్చి తన కుమార్తెను భార్యగా స్వీకరించమని అభ్యర్థించాడు. అతడి మాటను మన్నించిన పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఈ దంపతులకు విశ్రవసు జన్మించాడు. ఈయనే రాక్షసులను పుట్టించాడని అంటారు. ఆయన కుమారులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణక, కుబేరుడు.
ఒకసారి రావణుడు అహంకారం తో కార్తవీర్యుడు పై యుద్ధానికి వెళతాడు.కార్తవీర్యుడు జైల్లో పడేశాడు. పులస్త్యుడు కార్తవీర్యుడింటికి వెళ్ళి రావణుణ్ణి విడిచిపెట్టమని అడిగాడు. కార్తవీర్యుడు పులస్త్యుడికి సత్కారం చేసి ఆయన చెప్పిన విధంగా రావణుణ్ణి విడిపించి సంపదలిచ్చి పంపాడు.
ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో మొదలుపెట్టిన సత్రయాగం ఆపినందుకు ఆనందించి పరాశరుడ్డి వరం కోరుకోమన్నాడు పులస్త్యుడు.
తన మనసెప్పుడు వేదపురాణాల మీద ధ్యాసతో ఉండాలని, వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుని పులస్త్యుడి దగ్గర వరం పొందాడు పరాశరుడు.
భీష్ముడు గంగా నదీతీరంలో తండ్రికి పితృకర్మలు చేస్తుంటే పులస్త్యుడు అక్కడికి
వెళ్ళాడు.
భీష్ముడు మహర్షిని పూజించి ఆయన పాదాలు తలమీద పెట్టుకుని స్వామీ ! ఆజ్ఞాపించండి అన్నాడు.
భీష్మా! నీకేమయినా సందేహాలుంటే అడుగు చెప్తాను అన్నాడు పులస్త్య మహర్షి .
మీరు తీర్థప్రియులు కదా! తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాల గురించి చెప్పండని భీష్ముడు అడిగాడు
పులస్త్యుడు భీష్మా ! ఇంద్రియాల్ని జయించడం, గర్వం, కోపం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, మితంగా తినడం, నిజాన్నే పలకడం, ఎప్పుడు సంతోషంగా ఉండడం
మంచిపన్లే చెయ్యడం ఇలాంటివి చేసేవాళ్ళకి అన్ని తీర్థాలవల్ల వచ్చే ఫలితము దానికదే వచ్చేస్తుంది. ఎక్కడికీ తిరగక్కర్లేదు.
పుష్కర తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం వస్తుంది జంబూ మార్గం, తండులికాత్రమం, అగస్త్యసరం వీటి వల్ల అశ్వమేధయాగం చేసిన పుణ్యం, రుద్రకోటి అనే తీర్థాలు కురుక్షేత్రం, సోమతీర్థం, నర్మద, దక్షిణ సింధు, చరణ్వతి, సరస్వతి సాగర సంగమం, పింగళతీర్ధం ఇలా అన్ని తీరాలకి దీని ఫలితం దానికే వుందని పులస్త్యుడు వివిధ తీర్ధాల విశేషాలన్నీ భీష్ముడికి చెప్పాడు.
పులస్త్యుడు స్మృతికర్త, బ్రహ్మ, మహర్షి, సర్వజ్ఞుడు, సర్వదేవతల పూజలందుకున్నవాడు అని పేరు తెచ్చుకున్నాడు.
మరెన్నో మరెన్నో ఇలాంటి సమాచారాలు పొందాలంటే
మన గురు . మన ఓంకారం
ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి
https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ
మీకు ముందుగానే సమాచారం వస్తుంది.
శ్రీ గురూజీ మహారాజ్
జ్యోతిష్య బ్రహ్మ ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత
No comments:
Post a Comment