కుజ దోషం అందరికి వర్తించదు..
నిజానికి – శాస్త్రప్రకారము – అన్ని లగ్నాలకీ ఈ కుజ దోషం వర్తించదు. ఇది ప్రతి సామాన్యుడు తెలిసికోవలసిన విషయం.
లగ్నమనగా శరీరము, చంద్రు డనగా మనస్సుకి సంభంధించినది. శుక్రుడు కళత్ర (భార్య)కారకుడు. అనగా భార్య కు సంభంధించిన విషయము.
ఒక జాతకంలో లగ్నం నుంచి మరియు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడనుంచీ
అలాగే శుక్రుడు ఎక్కడ వున్నా అక్కడనించి ( ఈ మూడూ వేరువేరుగా చూడాలి)
లెక్క చూడగా 1,2,4,7,8,12 గదులలో ( రాసులలో) కనుక కుజుడు ఉన్నచో ఆజాతకం లో కుజ దోషం ఉంది అనవచ్చు.
ఇందులో కొన్ని సవరణలు వున్నాయి.
పిల్లవాడిజాతకం లోనూ పిల్ల జాతకం లోనూ కుజదోషం ఉన్నప్పుడు అనగా ఒకరి జాతకంలో లగ్నం నింఛి మరొకరి జాతకం లో శుక్రుడు నించి కాని మరి ఏ ఇతర ( పైన చెప్పిన ప్రకారం) రకాలుగావున్నా కుజ దోషం సమసిపోయినట్లే! అనగా దోషం లేదు.
కర్కాటక, మీనం, ధనుస్సు, సింహం, మేషం, వృశ్చికం, మరియు మకర లగ్నాలకి అసలు కుజ దోషం పట్టింపు లేదు, కుజుడు ఉన్న రాశి లోనే గురుడు వున్నా గురుడు వున్న రాశిలో కుజుడు వున్నా – ఆ జాతకానికి కుజ దోషం లేనట్లే.
“ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా” అని చెప్పిన శ్లోకం దేవ కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిదున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు.
వృషభం తులలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. మేష వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి నాల్గవ ఇంట కుజుడు వున్న దోషం ఉండదు. మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. సింహం కుంభం లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం.
మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశిర, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు.
పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు. చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ.
కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు, కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు. కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లేకపోతే వారు సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.
మరెన్నో మరెన్నో ఇలాంటి సమాచారాలు పొందాలంటే
మన గురు . మన ఓంకారం
ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి
https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ
మీకు ముందుగానే సమాచారం వస్తుంది.
శ్రీ గురూజీ మహారాజ్
జ్యోతిష్య బ్రహ్మ ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత
No comments:
Post a Comment