వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
*భగవద్గీత అంటే ఏమిటి?
*స్వయంగా భగవంతుడే తన గురించి, తన భక్తుని గురించి, తనపై ఉండవలసిన భక్తి గురించి చెప్పటం వల్ల మరొక మానవమాత్రునితో పనిలేకుండా మార్పులు, చేర్పులు, తీర్పులు లేకుండా స్వయం సిద్ధమై నిలిచిందీ భగవద్గీత.
*అసలు ఏమిటీ భగవద్గీత?.
భగవద్గీతకు మనకు సంబంధం ఏమిటి?
*అందులోని విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది..??
మానవజన్మను సార్థకం చేసుకొనుటకు *భగవద్గీత ఎలా సాయపడుతుంది…
*మనం సరదాగా మీ బంధువులింటికీ వెళ్ళాలని హైదరాబాదు వెళ్ళామనుకుందాం.
*ఒకరోజు బిర్లా మందిరానికని, ఒకరోజు పార్కుకు, జూకు వెళ్ళివస్తున్నారు.
*ఒక రోజున ఎవరో స్వామీజీ భగవద్గీతపై ప్రవచనములు చేస్తున్నారని అక్కడికి వెళ్ళారు.
* ఒక గంట సేపు ఆ ప్రవచనాలు విని ఆనందించారు, అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటే హాయిగా ఉండేది.
*కాని మధ్యలో స్నేహితుడు కనిపించి దగ్గరలో సర్కస్ ఉంది, వెళ్దాం అంటే వెళ్ళారు…. జనంలో త్రోసుకొని టికెట్టు కొనుక్కొని లోపలికెళ్ళారు.
*స్నేహితుడు కనిపించలేదు. రెండు గంటలు సర్కస్ చూశారు, తిరిగి ఇంటికి బయలుదేరారు, దారి తెలియలేదు, కరెంటు పోయింది, అయినా ముందుకెళ్ళారు,అక్కడ చిమ్మ చీకటి, కీచురాళ్ళ ధ్వనులు, భయం వేసింది.వడి వడిగా అడుగులు వేస్తున్నారు, వెనుక కుక్క మొరుగుతూ వెంట బడుతున్నట్లు అనుమానం వచ్చి పరుగు లంకించుకున్నారు. బాధ, దుఃఖం, ఆకలి, అలసట, దిక్కు తెలియక అలా వెళుతున్నారు, అలా ఎంత దూరం వెళ్ళినా మన బంధువుల బజారు రాలేదు…. కనిపించిన వారినల్లా అడ్రసు అడుగుతున్నారు, ఎవరూ తెలియదంటున్నారు….
చివరకు ఒకాయన ఆ ప్రాంతాలన్నీ పరిచయమున్న వ్యక్తి తటస్థపడి “ఇదిగో ఇటు వెళ్ళు, ఒక ఫర్లాంగు వెళ్ళిన తరువాత దారి చీలుతుంది, ఎడమ వైపు తిరిగి సరాసరి వెళ్ళిపో. మీ బజారు వస్తుంది” అని చెప్పాడు.
*ఆ దారి వెంట వెళ్ళి ఇల్లు చేరుకున్నారు, మన బాధలు, భయాలు తొలగిపోయి హాయిగా ఉన్నాము…
ఇదే విధంగా మనం కూడా మన స్వస్థానాన్ని పరమాత్మ స్థానాన్ని విడిచి ఈ మానవ లోకంలోకి వచ్చిపడ్డాం….
"ఇక్కడ ఏవేవో పనులు చేస్తూ వాటి ఫలితంగా సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాం.
*ఈ జన్మను విడిచిపెట్టి మనం చేసిన పుణ్యకర్మల ఫలితంగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన భోగాలు అనుభవిస్తాం.
"అలాగే పాపకర్మల ఫలితంగా నరకయాతనలు, భయంకరమైన దుఃఖాలు అనుభవిస్తాం, ఆ పుణ్య, పాప కర్మల ఫలితాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్లీ ఈ లోకంలో కుక్కగా, నక్కగా, పిల్లిగా, బల్లిగా, పక్షిగా, పందిగా, పులిగా, ఏనుగుగా, చెట్టుగా, పుట్టగా, లేక మానవుడిగా అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం…
" అనేక సుఖాలు, భోగాలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం.
ఇలా అనంత కోటిజన్మలు, ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది…
"ఇప్పటి వరకు కనీసం 83,99,999 జన్మలు ఎత్తాం"
*మనం రోజుకొక డ్రస్సు వేసుకున్నట్లు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహాన్ని తగిలించుకొని ఈ అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం.
"అయితే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకుండానే ఈ ప్రయాణం సాగిస్తుంటాం…
“క స్త్వం క్కో హం కుత ఆయుతః”..
నీవెవరు.. నేనెవరు.. ఎక్కణ్ణుంచి వచ్చాం.. (భజగోవిందం) అని పెద్దలు, శాస్త్రాలు మనను అడుగుతూనే ఉన్నారు.
“మిత్రమా.. ఎక్కడి నుండి ఎక్కడకు నీ ప్రయాణం.. అని.
*ఏమో.. ఎక్కణ్ణించి వస్తున్నామో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
*గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఎండుటాకులా ఎలాగో జీవయాత్ర సాగిస్తున్నాం.
*కాని మన ప్రయాణానికి ఒక గమ్యం లేదు.. ధ్యేయం లేదు.. లక్ష్యం లేదు.. “అచ్చపు చీకటింబడి”.. అన్నట్లు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం.
మన ప్రయాణానికి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు.
* పెద్దలు చెబుతున్నా, శాస్త్రాలు ఘోషిస్తున్నా మనం మాత్రం కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవటం లేదు.
"ఇలా దిక్కులు మరచి, దిక్కు తోచక, చీకటిలో ప్రయాణిస్తున్న మనకు అన్ని మార్గాలు తెలిసిన స్నేహితునిలాగా భగవద్గీత మనం ఎక్కడి నుండి బయలుదేరామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్ని విషయాలను చెప్పి, మనలను చేయిపట్టుకొని మన స్వస్థానానికి నడిపిస్తుంది."
సమస్త దుఃఖాలను అంతం చేసుకొని, దుఃఖంలేని ఆనంద సామ్రాజ్యంలో మనలను ఓలలాడేటట్లు చేస్తుంది.
"అయితే మనం ఈ భగవద్గీత అనే స్నేహితుని చేయిపట్టుకొని వదలకూడదు, ఎటునడిపిస్తే అటు నడవాలి.
"ఈ విధంగా మానవుడికి తన గమ్యస్థానం ఏమిటో తెలియజెప్పి అక్కడకు చేర్చే స్నేహితుడు గనుక - భగవద్గీత" మానవుడికి సంబంధించినది. మనకు సంబంధించినది. "మానవ జన్మను సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడేది భగవద్గీత."
కనుక భగవద్గీత చెప్పే విషయాలను గ్రహించాలి, ఈ లోకం మనది కాదు, ఇక్కడి వస్తువులు మనవి కావు. ఇక్కడి దుఃఖాలు, బాధలు కూడా మనవి కావు….
“ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తిన్కోర్జున”.. అన్నట్లు ఈ పదునాలుగు లోకాలు కూడా మన మజిలీలే.
ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి ఏతం బానలాగా పైకీ🖕 క్రిందికీ 👇తిరుగుతూ ఉండాల్సిందే..
హరిః ఓమ్.
"భగవద్గీత అంటే ఏమిటి?"
* జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
*రిటైర్‌మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
*ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
*అది కేవలం హిందువులదా?
*పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
కాదు. అవన్నీ అపోహలు.
" ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్.
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి
*భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.
*సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.
* ఉదాహరణకు ప్రమోషన్ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు.
*అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది.
గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
*సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు.
అదొక మానసిక స్థితి.
వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
*ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు.
* ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని.
అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
*ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్ చేసే మేజిక్. మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు.
*టెన్నిస్ క్రీడాకారుడు Roger Federar ని చూడండి - అర్థం కావటానికి.
ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది.
*కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు.
నేను అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది.
*ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది.
*అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది.
‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.
*అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
*ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
*కర్తవ్యం గురించి చెబుతుంది.
నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
*ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
*సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
*ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
*పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
*ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
*జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
*ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
*మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
*నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.
*అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
*అర్థం చేసుకున్నవారు ధన్యులు.
వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు.
*నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది.
*మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో.రాత మార్చుకో.
మరెన్నో మరెన్నో ఇలాంటి సమాచారాలు పొందాలంటే
మన గురు . మన ఓంకారం
ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి
https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ
మీకు ముందుగానే సమాచారం వస్తుంది.
శ్రీ గురూజీ మహారాజ్
జ్యోతిష్య బ్రహ్మ ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత
No comments:
Post a Comment