Tuesday, 6 July 2021

ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు కథ....

 🌾🌾🌾🌾🌾 

ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు


కథ....


ఒక రాజు తన రాజ్యానికి ఒక మంచి సాధువును తన రాజభవనంలోకి  భోజనం తినడానికి  రమ్మని అభ్యర్ధించాడు.

అందుకు  ఆ సాధువు అంగీకరించారు. 

ఆ రాజభవనంలో  భోజనాన్ని తయారుచేస్తున్న వంటవాడు అత్యాశాపరుడు. 


ఎక్కడైతే తను భోజనాన్ని తయారుచేస్తున్నాడో ఆ ప్రదేశానికి ముందున్న కిటికీపై రాణీ యొక్క తొమ్మిది లక్షల విలువచేసే హారం వ్రేలాడదీయబడి ఉంది. 

అటు వైపు పదే పదే ఆ వంట వాని దృష్టి వెళ్తూ ఉంది. 

అవకాశం లభించినచో ఎలా అయినా ఆ హారాన్ని దొంగిలించాలనే ఆలోచన అతనిలో కలిగేది. కానీ, తాను దానిని దొంగిలించలేకపోయాడు. 


ఈ దొంగతనం గురించిన ఆలోచనలతోనే తను భోజనాన్ని తయారుచేశాడు. 


ఆ భోజనాన్ని తిన్న సాధువుకు ఏమయిందో తెలుసా... .


సాధువు మనస్సులో కూడా దొంగతనం గురించిన ఆలోచన రావడం మొదలయ్యింది. 


వెళ్తూ వెళ్తూ రాణి యొక్క హారాన్ని తీసుకొని వెళ్లారు. 


దీని పై ఎవ్వరూ కూడా ధ్యాస పెట్టలేదు. 


ఉదయాన్నే మొత్తం రాజభవనం అంతా వెతికినా హారం కనిపించలేదు. 


అక్కడ సాధువు తన  కుటీరంలోకి వెళ్ళినప్పుడు , మరుసటి రోజు భోజనం యొక్క ప్రభావం తగ్గి తన తప్పిదాన్ని గుర్తించి చాలా గాబరాపడతారు. 


నేను ఇంతటి తపస్వి , త్యాగి సాధువును అయి ఉండి ఇలా ఎందుకు చేసాను అని.

మథనపడతాడు. 


 చివరికి లోపం ఎక్కడ జరిగిందో తపస్వికి అర్ధం అయ్యింది. 


రాజును పిలిపించి  తన భోజనాన్ని ఏ వంటవాడు తయారుచేశాడు.  తనని పిలవండి అని చెప్పెను. 


ఆ వంటవాడిని పిలిపించి కఠినంగా అడిగేసరికి తాను విషయం అంతా సత్యంగా చెబుతాడు. 


తన మనస్సులో హారాన్ని దొంగిలించాలనే ఆలోచన ఉండేదని చెబుతాడు.


అప్పుడు సాధువు రాజుకు ఆ హారాన్ని ఇచ్చి, ఇలా అంటారు..'


 మహారాజా! మీరే చూశారు కదా, ఆహారం యొక్క ప్రభావం మనస్సుపై ఎంతగా పడుతుందో....


 ఈ వంటవాడు దొంగతనానికి సంబంధించిన ఆలోచనలతో భోజనాన్ని తయారు చేశాడు.


 దానిని తినడం వలన నావంటి సాధువు యొక్క ఆలోచనలు కూడా చెడిపోయాయి.


 మరి, ఒక సాధారణ మానవునిపై దీని యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో కదా ....


కనుక, 


మనం శుద్ధ సాత్విక ఆలోచనలతో....... 

మరియు

దైవము  యొక్క తలంపుతో  తయారుచేసిన భోజనాన్ని మాత్రమే స్వీకరించాలి".


భారతదేశంలో అయితే పూర్వకాలం నుండే వంట గదిలో భగవంతుని యొక్క , దేవీ దేవతల యొక్క మూర్తులను పెట్టేవారు. 


ఎందుకంటే వారి యొక్క స్మృతిలోనే భోజనం తయారుచేస్తూ మరియు స్వీకరించే వారి బుద్ధి స్వచ్ఛంగా తయారవుతుంది. కాబట్టి , 


ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు మన పూర్వీకులు ఇలాంటి వంటదోషాలు కలగని విధంగా నిస్వార్ధముగా సేవలను అందించే సత్రాల లోనే భోజనము చేసేవారు. 


ఒకవేళ అటువంటి సత్రాలు లభ్యం కానిచో స్వయం పాకం ద్వారా వండుకుని తినేవారు.


అంతేగాని మన పూర్వీకులు ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి , వండించుకునో ...... వెలబెట్టి ( ధర ఇచ్చి)  కొనుక్కుని ఆహారం భుజించేవారు కాదు. 


సత్రాలలో భగవంతుని పేరిట నివేదించే సంప్రదాయం ఉంటుంది. కాబట్టి ఆ భోజనము అక్కడున్న దేవీ / దేవత ప్రసాధముగా మాత్రమే అందిస్తారు. 


కాబట్టి ఆ ఆహారముకు ఎటువంటి దోషమూ ఉండదు. 


అలా సేవలందించే సత్రాల్లో భోజనము భుజించినవారు వారికి తోచిన విరాళములను అక్కడ అందించే సౌకర్యం కల్పిస్తారు. కాబట్టి దానధర్మాల్లో మనకు కూడా అవకాశము కలుగుతున్నది. 


అన్నదాత సుఖీభవ అంటారు.

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...