"ముకుంద" అని విష్ణు నామాలలో ఒక గొప్ప నామం ఉంది. "ముకుంద" అంటే మోక్షాన్ని సైతం ప్రసాదించే వాడు అని అర్థం. మనకు మళ్ళీ జన్మ లేకుండా చావు లేకుండా చేసే వాడు.మనకు బ్రహ్మానందాన్ని కలిగించే వాడు, మనకు బ్రాహ్మీ స్థితిని
ప్రసాదించే వాడు నారాయణుడు. అందుకే ఆయన "ముకుందుడు". అయితే ఇంత గొప్ప మోక్ష స్థితిని ఇవ్వాలి అంటే మనకు ఆ అర్హత ఉండాలి. మన బుద్ధికి ఆ యోగ్యత ఉండాలి.
ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక శిష్యుడు తన గురువు ఉన్న ఆశ్రమానికి వచ్చాడు. గురువుకు నమస్కరించి అలా ఇలా
చూశాడు. ఒక పక్క 100 రూపాయల నోటును,మరో పక్క ఒక రంగు రాయిని చూశాడు."గురుదేవా నేను కష్టాలలో ఉన్నాను,నాకు ఆ 100 రూపాయలను ఇస్తారా" అని శిష్యుడు అడిగాడు."ఈ 100 రూపాయలతో నీ కష్టాలు ఎంత మాత్రం తీరతాయి,ఇదిగో ఈ రంగు రాయిని తీసుకో,నీ కష్టాలన్నీ మాయమై పోతాయి" అని గురువు తన శిష్యుడికి చెప్తాడు. "ఇప్పుడు నాకు ఆ రాయితో పని లేదు గురుదేవా.ఆ 100 రూపాయలు ఇవ్వండి వెళ్ళిపోతాను" అని అంటాడు శిష్యుడు. ఇక చేసేది ఏమీ లేక గురువు సరే అంటాడు.
ఆ రంగు రాయి వజ్రం.కానీ శిష్యుడి బుద్ధికి అది వజ్రం అని తెలుసుకునే యోగ్యత లేదు.అందుకే 100 రూపాయలు చాలు అనుకున్నాడు. అలాగే నారాయణుడు "ఎవరైనా నా దగ్గరకు వచ్చి మోక్షాన్ని అడుగుతారా.అడిగితే ఇచ్చే ద్దాం" అని ఎదురుచూస్తూ ఉంటాడట. కానీ స్వామి దగ్గరికి వచ్చిన ప్రతి వాడూ "స్వామీ నాకు మంచి I- phone కావాలి,ఆడపిల్ల ఉంది కానీ మగపిల్ల వాడు కావాలి, లక్షలు ఉన్నాయి కానీ కోట్లు కావాలి" అని ఈ విధమైన కోరికలను అడుగుతూ ఉంటే స్వామి వారు మాత్రం ఏంచేస్తారు. తథాస్తు అని అంటాడు.
కానీ ఎవరైతే నారాయణా నాకు నీవు తప్ప ఇంకేదీ వద్దు అని అనన్యమైన భక్తి తో ధ్యానిస్తారో,అలాంటి వారికి ఏకంగా మోక్షాన్నే ఇస్తాడు.కాబట్టి మనం ఖరీదైన వస్తువుల కోసం,సిరి సంపదల కోసం కాదు భగవంతుడిని ప్రార్థించాల్సింది. మన అసలైన సమస్య చావు,పుట్టుకలు. వీటి నుండి బయట పడేయమని నారాయణుడిని ప్రార్థించాలి.మన ఆర్తి నుండి వచ్చేదే ప్రార్థన. మన ఆర్తి దేని కోసం? నారాయణుడి లో కలిసిపోవడం కోసం, యోగించడం
కోసం.అంతేకానీ ఈ శరీరాలతో భోగించడం కోసం కాదు.
భోగించే కొద్దీ బంధాలు పెరుగుతాయి, కానీ ఆ ముకుందుడితో యోగించే కొద్దీ మన బంధాల నుండి విడుదల. అదే మోక్షం. ఈ విధంగా మనకు మోక్షాన్ని ప్రసాదించి,మనకు చావు,పుట్టుకలు లేకుండా చేసే పరమ దయా స్వరూపుడు "ముకుందుడు". విష్ణు సహస్ర నామాలలో ఎంతో లోతైన జ్ఞానం ఉంది.
మరెన్నో మరెన్నో ఇలాంటి సమాచారాలు పొందాలంటే
మన గురు . మన ఓంకారం
ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి
https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ
మీకు ముందుగానే సమాచారం వస్తుంది.
శ్రీ గురూజీ మహారాజ్
జ్యోతిష్య బ్రహ్మ ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత
No comments:
Post a Comment