Monday, 23 July 2018

తొలి ఏకాదశి / ప్రత్యేకత

తొలి ఏకాదశి శుభాకాంక్షలు

అన్ని ఏకాదశుల్లోకి తొలిఏకాదశి ఉత్తమోత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి.
ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని సంభావిస్తారు.స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులం దరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు.

ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షి ణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్షనారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది.ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది.ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అను రాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు.

హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.గోముఖభాగమందు వేదాలు,కొమ్మలందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాల ముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు.

పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలాలనిస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీవ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు.హరిభజన చేస్తారు.

చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు.దీనిని గురించి బ్రహ్మవైవర్తన పురాణం వివరిస్తుంది.ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయపైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు.దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారుల పండుగగా భావిస్తారు.కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు.పాలేర్లందరికీ కొత్తబట్టలిచ్చి వారిని గౌరవిస్తారు.

తొలి ఏకాదశి నాడు పేలాల  పిండి  తినడంలో అంతరార్ధం  ఏమిటి?

 ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు.

దీనినే శయన  ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ నాలుగు నెలలు  శ్రీమన్నారాయణుడు  శయనిస్తారని అందువలన  లోక  కళ్యాణార్ధము ఋషులు,స్వామీజీలు చాతుర్మాస దీక్షను  ప్రారంభిస్తారని  చెప్తారు.

ఈ  రోజున  అన్ని  దేవాలయములలో పేలాల  పిండిని ప్రసాదంగా ఇస్తారు.

పేలాలలో బెల్లపు పొడి  మరియు యాలకుల పొడిని  వేసి దంచి ఈ పేలాల పొడిని  తయారు చేస్తారు.

గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువుకు మారుతున్న  సమయం  కనుక  సహజంగా  ఏర్పడే  శారీరక ఋగ్మతలను ఈ పేలాల పిండి తీసుకొనటం వలన  మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి  పెరుగుతుంది.

ఈ రోజు పేలాల పిండిని  మన పితృ దేవతలను స్మరించుకుంటూ తీసుకొనడం వలన వారు సంతుష్టులై  మనని  కాపాడుతారని పెద్దలు  చెప్తారు.
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహరాజ్ HYD 9441288365

Monday, 2 July 2018

పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పించవలసినది....Omkaram Contact 9441288365

పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పించవలసినది..




 కాలకాలముగా మనం అమ్మాయికి మట్టుకే బుద్ది చెప్పి పంపుతాము కదా అయితే అబ్బాయిలు ఎలా ఉంటున్నారని మనం యోచించడం లేదు. తల్లి కొడుకుకు చెప్పవలసిన ముఖ్యమైన ఐదు విషయములు......

౧. ఏ సమయములోను తల్లితో భార్యను పోల్చకూడదు. తల్లి వేరే భార్య వేరే నీ తల్లికి ఇరవై యేండ్ల అనుభవం వుంది కాని నీ భార్య నేను నిన్ను పెంచిన విధముగానే తనను అల్లారుముద్దుగా అరచేతిలోపెట్టుకొని పెంచివుండును తనకు కొంచం అవకాశం ఇవ్వడం నీ కర్తవ్యం తర్వాత ఒక గొప్ప శ్రేష్టమైన ప్రేమమూర్తి ఐన తల్లిగా నీ బిడ్డకు వుంటుంది.

౨. భార్య నీకు తల్లి కాదు ఒక సఖి స్నేహితురాలు తాను అందరిని  వదలుకొని నీతో జీవితం పంచుకోవడానికి వచ్చింది. నీ తల్లికి నిన్ను పోషించడం మాట్టుకే ముఖ్యం కాని నీకు నీ భార్య ఆలనా పాలనా ముఖ్యం మీ ఇద్దరు అన్యోన్యముగా వుండడం చాల ముఖ్యం

౩ గౌరవార్హురాలు నీ భార్య నీ జేవితంలో ఒడుదుడుకులు తారతమ్యములు అన్నిటిలోనూ పాలుపంచుకొనే వ్యక్తీ. నీ ప్రతి అడుగులోనూ తన సహాయ సహకారములు ప్రేమానురాగాములు పంచె వ్యక్తీ తనతో ఏది దాచకూడదు. దాంపత్యములో దాచుకోవడం స్వార్థం చాల తప్పు. తనతో కలిసి తన అభిప్రాయములు తెలుసుకొని ఏకీభవించి పయనిమ్చడమే సుఖ సంతోషమైన దాంపత్యము

౪. మెట్టినింటికి వచ్చిన భార్యకు సహజముగా ఉండడానికి నువ్వు సహకరించవలెను. పుట్టినింటిని తోబుట్టువులను తల్లి తండ్రులను గోత్రమును పారంపర్యమును వదలుకొని నిన్ను మట్టుకే నమ్ముకొని వచ్చినది. చిన్న చిన్న వ్యవహారములకు తనకు సంకటమునకు గురిచేయవచ్చు నువ్వు మట్టుకే తనను గమనించి తాను పుట్టినింట వుండిన సుఖ సంతోషములను పొందేటట్టు చేయవలయును

౫. భార్యను ఎప్పుడు ప్రేమించావలయును ప్రేమించడానికి వయస్సుకు ఒక పరిమితిలేదు పత్నిని సంతోషముగా వుంచుకోవలెను . మీ ఇద్దరినీ ప్రేమానురాగములతో వర్ధ్దిలేటట్టు చేసును.

అతి ముఖ్యమైనది గుర్తుంచుకో మీ నాన్న నన్ను ఎలా గౌరవ మర్యాదలతో ప్రేమానురాగాలతో సుఖ సంతోషములతో నడిపించుతున్నారో నువ్వుకూడా నీ భార్యను గౌరవ మర్యాదలతో ప్రేమానురాగాలతో సుఖసంతోషములతో అరమరికలులేని జీవితం గడిపి మన వంశం వృద్ధిలోకి తెచ్చి గొప్పగా వుండాలి.
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ Hyd 9441288365

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి? omkaram Guruji Maharaj Hyd

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?






1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన bv కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ...
అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని 
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి 
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. 
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది.
బాదాం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. 

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.
1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 
2) దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు
*************** 
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు. 
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు. 
ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. 
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం 
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం. అనంతవచనం
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్  Hyd 9441288365

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...