Tuesday, 15 May 2018

మహిళా సోదరిల కోసం ఒక మంచి సమాచారం...

✍✍✍మహిళా సోదరిల కోసం ఒక మంచి సమాచారం...✍✍

పసుపు అనేది భారతీయ జీవన విధానంలో ఒక భాగంగా ఎప్పుడో మారింది. మనకు తెలిసో తెలియకో నిత్యం పసుపు లేనిదే మనకు చాలా పనులు కావు. యాంటీ బైటిక్ మందుగా మనకు పసుపు సుపరిచితమే. చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలితే పసుపు రాయడం అనేది మనకు తెలిసిన విద్యే. ఇలాంటి పసుపుని కూడా వారి సొంతం చేసుకోవడానికి పాశ్చాత్యులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పసుపు గొప్పదనం, పాశ్చాత్యులకు పసుపు విజ్ఞానం సొంతమైందా అనే విషయాలు చూద్దాం.

1) ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ అనేది భారత ముత్తయిదువుల సౌభాగ్యవరం.
2) పసుపు కాళ్లకూ ముఖానికీ రాసుకోకుండా ఏ సుమంగళీ స్నానం చేసేవారు కారు.
3) అది కేవలం చర్మ సౌందర్యం కోసమే కాక,చర్మకాంతి, నునుపు, పగుళ్లు లేని పాదాలు, మొదలైన ఆరోగ్యదాయక పదార్థంగా వాడబడేది.
4) పసుపు కొమ్ములను దంచి, నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి, బాగా ఎండబెట్టి, పొడి చేసి, స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తారు. ఆ కుంకుమనే స్త్రీలు నుదుట మాంగల్య చిహ్నంగా ధరిస్తారు. పేరంటాళ్లకు పంచుతారు.
5) ఇంతే కాక ప్రతి భారతీయ గడపా పసుపు కుంకుమలతో శోభిల్లుతుంటుంది. ఇంటి ముందు మంగళకరంగా ఉండాలని పసుపునీళ్లు చల్లుతారు.
6) ఈ పసుపు కొమ్ములను కలశ పూజల్లో కూడా వాడతారు. వంటలలో పసుపు వాడకం భారతీయ ఆనవాయితీ.
7) పసుపు వాడకం కేవలం రంగు కోసమే కాక ఆరోగ్యదాయకం కూడా. గొంతు బొంగురు పోయినపుడు దగ్గు జలుబు తగ్గడానికి పాలల్లో పసుసు వేసి ఇస్తారు.
8) నీరు మరగబెట్టి పసుపు వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం భయటికి వస్తుంది.
9) పసుపును అద్దకపు రంగుగా కూడా వాడతారు. పసుపుతో తయారు చేసే ఔషధాలు ఎన్నో. అవి ఆయుర్వేద గ్రంథాలనిండా వివరించబడి ఉంది.
10) దెబ్బ తగిలితే పసుపు రాయడంలో దాని యాంటీసెప్టిక్ లక్షణాలను తెలియజేస్తోంది.
11) హిందూలో ప్రచురించిన వ్యాసం(25 ఏప్రిల్ 2005) లో అల్జీమర్స్ కు పసుపు వాడితే రోగం నయమవుతుందని కనుగొన్నారు. రోగనివారిణిగా కూడా చెప్పారు.
12) అందుకే పసుపు భారతీయ వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు కాబట్టి భారతీయుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
మీ శ్రేయోభిలాషి
 ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365 Hyd

మన ఇంటి వాస్తు ఎలా ఉండాలి ?

ఇల్లు కట్టు నిమిత్తం స్థల సాధన

 ఒక నిర్ణీత స్థలము నందు ఇల్లు కట్టుట కు         నిర్ణయించుకున్న పిదప ఆ స్థలము నందు పథకము కట్టిన తరువాత ఆగ్నేయము నుండి వాయువ్యమునకు  ఈశాన్యము నుండి నైరుతి దిశకు సూత్రము (తాడు) పట్టవలయును. ఈ సూత్రములన్నియు కలియు బిందువును క్షేత్ర గర్భమందురు.అచట నుండి యజమాని ఎడమ పాదం బిందువు నందు ఉంచి ఈశాన్యమునకు నడువవలెను.13 వ అడుగు ఎక్కడ పడినదో ఆ ప్రదేశమును క్షేత్ర మూలముగా పరిగణించి ఆ ప్రదేశము నందు మూడు అడుగుల లోతు త్రవ్వి అచట మట్టిని పరిశీలింపగా బూడిద కనిపించినచో అచట అగ్ని ప్రమాదము సంభవించినదని నిర్ణయించవలెను.అందువల్ల ఆస్థలము మొత్తమూ ఒకటిన్నర అడుగు త్రవ్వి మట్టిని వెలికితీసి పునాది వేయవలెను.పెంకులు కనిపించినచో పాత ఇల్లు ఉందని గ్రహించి పూర్తిగా వెలికితీయవలెను.ముఖ్యముగా ఒకటి కన్నా ఎక్కువ ఎముకలు రాకుండా చూసుకొనుట మంచిది.ఇక పై చెప్పిన విధముగా లేనిచో మట్టిని వాసన చూడ వలయును. తేగ కాల్చిన వాసన వచ్చినచో మంచి నీరు పడును.త్రవ్వగానే పొగలు వచ్చినచో 30 అడుగుల లోతు లోపు అద్భుత మైన నీరు పడును.పాటి మట్టి అనగా బూడిద రంగు మట్టి వచ్చినచో ఉప్పు నీరు,బురద నీరు పడును. ఈ విధముగా క్షేత్ర (స్థల)నిర్ణయము జరిగిన పిమ్మట శాలా నిర్ణయము..
 మీ శ్రేయోభిలాషి
ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365

Saturday, 5 May 2018

దేవునికి ఇలా నమస్కరిస్తే ఇంతా అద్భుతమా?

✍✍.ఓంకారం గురూజీ మహరాజ్ 9441288365...✍✍మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.

దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

"దేహిమే పరమేశ్వరం"
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.

2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.

3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.

ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.

లోకా సమస్తా సుఖినో భవంతు..!!
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహరాజ్ hyd 9441288365

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...