Thursday, 23 April 2020

సైన్స్ అభివృద్ధి చెందాలి.. మన మాతృభూమి భారతదేశంలో ( కరోనా ను ఎదురిద్దాం )

దేవుడు vs కరోనా
------------------------
* దేవుడు కంటికి కనిపించడు. కరోనా కూడ కంటికి కనిపించదు.

* కరోనా ఉనికిని ప్రయోగశాలలో  గుర్తించవచ్చు. దేవుడిని ఏ ప్రయోగశాలలోనూ గుర్తించలేము.

* దేవుడంటే భక్తులకు భయం.
కరోనా అంటే అంతకు మించిన భయం.

* గతంలో రోగ నివారణకు భక్తులు దేవుళ్లను ఆశ్రయించే వారు.
నేడు కరోనా నివారణకు దేవుళ్లను పక్కనపెట్టి , వైద్యులే దిక్కు అంటున్నారు.

* దేవుణ్ని నమ్మితే మరణానంతరం స్వర్గం లేదా పరలోకం సిద్ధిస్తుందన్న ఆశ భక్తుల్లో గతంలో కనిపించేది. కరోనాతో మరణిస్తామన్న భయం నేడు పీడిస్తోంది.

* స్వస్థత ప్రార్థనలతో అన్ని రోగాలను పారదోల గలమని గతంలో  దైవజనులమని చెప్పుకొనే కొందరు   ప్రకటించేవారు. అలాంటి దైవజనులందరూ నేడు కరోనాకు భయపడి ఇళ్లకు పరిమితం అయ్యారు.

* దేవుడిని నమ్మేవారు తమ స్వార్థం కోసం అప్పుడప్పుడు దైవ భావనను పక్కన పెట్టేవారు.
కరోనాను నమ్ముతున్న వారు
దాని ఉనికిని పక్కన పెట్టే సాహసం చేయలేకపోతున్నారు.

* దేవుణ్ని నమ్ముకొంటే కలసి వచ్చేది శూన్యం. కరోనాని నమ్మకుంటే ప్రాణం పోవడం ఖాయం.

* మనిషి లేకుంటే దేవుడు మరణిస్తాడు. మనిషి అంతరించినా కరోనా కొన్ని జీవుల్లో బతికే ఉంటుంది.

అంటే..

దేవుడు కల్పితం - కరోనా వాస్తవం.
భక్తి ఒక నటన - కరోనా వాస్తవం.
దేవుళ్లు మతాల పేర మనుషుల్ని విడగొట్టారు - కరోనా మనుషులంతా ఒక్కటే అని చెప్పింది.

వాస్తవం ఇదీ...
దేవుళ్లూ, దేవుళ్ల పేర జరిగే తంతులూ కొందరు స్వార్థపరుల పన్నాగం. వ్యాపార కోణం లేని మతం లేదు.
ప్రపంచంలో ఉన్న అతిపెద్ద వ్యాపార వ్యవస్థ మతమే.

కరోనా వచ్చాక స్పష్టంగా అర్థమైనది ఏమంటే....

దేవుళ్ళు మరణించడానికి మానవజాతి అంతరించ నవసరం లేదు!
మనిషి దేవుణ్ని పట్టించుకోకపోతే ఆటోమేటిక్ గా దేవుడు మరణిస్తాడు!!

అప్పుడు మనుషుల మధ్య సోదరభావం పెరిగే అవకాశాలుంటాయి.
స్వర్గాన్ని భూమి మీదే సృష్టించుకోవచ్చు.
ఆలోచించండి.
ఓంకారం ఫౌండేషన్స్ ( ఓంకారం ఆయుర్వేదం )

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...