Wednesday, 27 December 2017

ముక్కోటి ఏకాదశి అంత గోప్పదా ? Omkaram Guruji MAharaj Hyd 9441288365


ముక్కోటి ఏకాదశి సందర్భంగా
ముక్కోటి ఏకాదశి అంత గోప్పదా  ???
సనాతన ధర్మం అనబడే హిందూమతంలో మహోన్నతమైన రహస్యాలు దాగున్నాయి. మన గుడ్డిగా చేస్తున్న వ్రతాలు-పూజలకూ, ఖగోళ గమనానికీ, జ్యోతిష్యసూత్రాలకూ, యోగసాధనకూ సంబంధాలున్నాయి. హిందూ మతంలోని అతి గొప్పదైన విషయం ఇదే. పిండాండానికీ-బ్రహ్మాండానికీ, దీనిలో-దానిలో ఉన్న అన్నింటికీ మన మతంలో సమన్వయం కనిపిస్తుంది.
విశ్వంతో పోలిస్తే మానవుడు ఒక అణువైనప్పటికీ, ఈ అణువులోనే మళ్లీ ఆ విశ్వం అంతా దాగుంది. ఎలా దాగుంది అన్న రహస్యాన్ని మన గ్రంధాలు విప్పిచెప్పటమేగాక, ఏం చేస్తే ఈ రెంటికీ చక్కని సమన్వయం సాధించవచ్చో వివరించాయి. మానవుడు బాహ్య-అంతరిక స్థాయిలలో సమన్వయాన్ని సాధించగలిగితే అతని జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. కాని అందరూ అంతరిక సాధన చెయ్యగలరా? అంటే, ఆ అర్హత అంత త్వరగా అందరికీ రాదు అనే చెప్పాల్సి వస్తుంది.
అంతరిక యోగసాధన చెయ్యలేనివారు నామజపం చెయ్యవచ్చు. లేదా బాహ్యపూజ చెయ్యవచ్చు. సరిగ్గా చేస్తే అన్నీ ఒకే ఫలితానికి దారి తీస్తాయి. కారణమ్? అంతరికం బాహ్యం ఒకే మూలంపైన ఆధారపడిఉన్నాయి అన్నదే ఇక్కడి రహస్యం. బాహ్యం అంతరికాన్ని ప్రభావితం చేస్తుంది. అంతరికం బాహ్యానికి ఆధారాన్ని కల్పిస్తుంది. చివరకు, రెండూ వేరువేరుకావు ఒకటే అన్న సత్యస్ఫూర్తి కలుగుతుంది.
ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుపూజ,స్మరణ చెయ్యాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దానిద్వారా వెళ్ళడం ద్వారా మానవునికి విష్ణు దర్శనం కలిగి తద్వారా మోక్షం కలుగుతుందని చెబుతూ దీనిని మోక్ష- ఏకాదశి అని పిలిచాయి. దీనినే ఉత్తర ద్వార దర్శనం అనికూడా అంటారు.
తిరుమల ఏడుకొండలలోని ఏడవకొండమీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. మనలోపల ఉన్న సప్త చక్రాలలో ఏడవదైన సహస్రదళపద్మం మీద ఆయన నారాయణునిగా శయనించి ఉన్నాడు. యోగపరిభాషలో మానవుని తలభాగం ఉత్తరం, కాళ్ళవైపు భాగం దక్షిణం. భౌగోళిక ఉత్తరంలో అయస్కాంత దక్షిణ ధృవం ఉంది. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దని అంటారు.
ఈరోజున ఉత్తరద్వారం తెరుచుకుంటుంది అంటే అర్ధం- సహస్రదళపద్మానికి వెళ్ళేదారి సునాయాసంగా తెరుచుకుంటుంది అని. ఈ రోజున నారాయణుడు ఉత్తరద్వారాన్ని తెరిచి తన ద్వారపాలకులైన జయవిజయులను లోనికి అనుమతించాడని పురాణాలు చెబుతాయి.
జయవిజయులంటే ఇడా పింగళానాడులు. సామాన్యంగా ఈ రెండూ భ్రూమధ్యంలో ఉన్న ద్విదళ ఆజ్ఞాపద్మం వరకే వెళతాయి. ఇవి గుమ్మంవరకూ వెళ్లగలవుగాని సహస్ర దళ పద్మంలోనికి వెళ్ళలేవు. కనుకనే వీటిని ద్వారపాలకులు అని యోగపరిభాషలో అంటారు. ఇడానాడి చంద్రనాడి ఇది చంద్రునికి సూచిక. పింగళానాడి సూర్యనాడి ఇది సూర్యునికి సూచిక. కనుక అగ్నిస్వరూపమైన సుషుమ్నలోనికి ఈ రెండూ లయించిన స్థితినే జయవిజయులను ఉత్తరద్వారంగుండా నారాయణుడు లోనికి రానిచ్చాడని మార్మికభాషలో చెప్పారు.ఈ ఏకాదశి రోజున అది జరిగింది. అప్పుడు వైకుంఠం అనే స్థితి కలుగుతుంది. కుంఠితము కానిది వైకుంఠం. అంటే నిశ్చలము, స్థిరము, నాశనములేనిది అయిన స్థితి. ఉచ్చ్వాస నిశ్వాసములతో నిత్యం చంచలంగా ఉండే మనస్సు పరబ్రహ్మానుసంధానంద్వారా నిశ్చలత్వాన్ని పొంది అఖండ సచ్చిదానంద స్థితిలో లీనంకావడమే ఇడాపింగళా రూపులైన జయవిజయులు ఉత్తరద్వారం గుండా వైకుంఠప్రవేశం చెయ్యటం అంటే అర్ధం. అంటే ఈ రోజున సాధనకు అనువైన స్పందనలు, ఈ స్థితిని సులభంగా ఇవ్వగల ప్రభావాలు ప్రకృతిలో అధికంగా ఉంటాయి. దైవస్వరూపమైన గ్రహాలు-ప్రకృతీ కూడా ఈ రోజున భగవద్దర్శనానికి బాగా సహాయపడతాయి.
ఇది అంతరిక విషయం. ఇక బాహ్యంగా కనిపించే సూర్యచంద్రుల విషయం గమనిద్ధామా? ఎందుకంటే బాహ్యంగా ఉన్నదే అంతరికంగా ఉన్నదన్న సూత్రం మీదనే యోగమూ-తంత్రమూ నిర్మితమైనాయి మరి.
సూర్యుడు నిరయన ధనురాశిలో సంచరించే సమయంలో ఈ ఏకాదశి వస్తుంది. ఆ సమయంలో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉంటాడు. మూలా నక్షత్రం గాలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉన్న నక్షత్రమండలం. దీనినే విష్ణునాభి అని పిలుస్తారు. ఈ నాభిలోనుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడని మన పురాణాలు చెపుతున్నాయి. ఇదంతా మార్మికపరిభాష. దీన్ని కొంచం అర్ధం చేసుకుందాం.
నిరవధికశూన్యంలోనుంచి మొదటగా సృష్టి జరిగిన ప్రదేశం మూలా నక్షత్రమండల ప్రాంతంలోనే ఉంది. కనుకనే దీనిని విష్ణునాభి అంటూ, ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్థానంగా అలంకారిక మార్మికభాషలో చెప్పారు. మన గ్రహమండలానికి సూర్యుడే శక్తిప్రదాత. ఆ సూర్యుడు ఇక్కడినుంచి పుట్టినవాడే. కనుక, సూర్యుడు తనకు శక్తినిస్తున్న మరియు తాను పుట్టిన విష్ణునాభి అనే మహాశక్తికేంద్రం ఉన్నటువంటి మూలానక్షత్రమండల ప్రాంతం మీదుగా ప్రతి ఏడాదీ ఇదే సమయంలో సంచరిస్తాడు. వెలుగును శక్తిని ఇచ్చేటటువంటి సూర్యుడు ఈ సమయంలో మూలశక్తియైనటువంటి మూలానక్షత్రప్రాంతంలో సంచరిస్తూ లోకానికి శుభంకరమైన ధర్మస్వరూపమైన ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాడు.
ఈ మాసంలో ఏకాదశినాడు, సూర్య చంద్రులు ఒకరికొకరు పంచమ నవమ స్థానాలలో ఉంటారు. ఇవి కోణస్థానాలు కనుక అత్యంత శుభప్రదమైనవి. ఇక చంద్రుని స్తితి చూద్దాం. రాశులలో మొదటిదైన మేషంలో చంద్రుడూ, ధర్మ స్వరూపమైన నవమ స్థానంలో నారాయణ స్వరూపుడైన సూర్యుడూ ఉంటారు. మేషం తలకు సూచిక కనుక తలలో ఉన్న సహస్రదళపద్మం సూచింపబడుతున్నది. తెల్లని పాలవంటి శుక్లపక్ష ఏకాధశినాటి చంద్రునికి సూచికగా పాలసముద్రంమీద శయనించి ఉన్న మహావిష్ణువు ( సర్వవ్యాపకమైన మహాశక్తిస్వరూపం ) సూచింపబడుతున్నాడు. ఈ రోజున సూర్యుడు మూలశక్తిస్థానంలో ఉంటాడు. చంద్రుడు దానికి పంచమ కోణంలో ఉండి కోణదృష్టితో ఆయన్ను చూస్తుంటాడు. అంటే మనస్సుకు సూచిక అయిన చంద్రుని దృష్టి ఈరోజున మూలానక్షత్రస్థితుడైన ఆత్మసూర్యునిపైన ఉండటం వల్ల, ఏం సూచింపబడుతున్నది? మానవుని యొక్క మనస్సు ఈ రోజున సమస్త చరాచరసృష్టికర్త అయిన దైవంమీద సులభంగా నిమగ్నం కాగలదు అన్న ప్రకృతిమాతయొక్క వరం మనకు దర్శనమిస్తున్నది. అంతేకాదు. సూర్యుని కోణ దృష్టికూడా చంద్రునిపైన ఉండటంవల్ల మూలానక్షత్రప్రాంతపు మహాశక్తి సూర్యుని వేడిమిద్వారా వచ్చి అది చంద్రునిపైబడుతున్నది. అంటే భగవంతుని ప్రసన్నదృష్టి కూడా ఈ రోజున అత్యంత దయాపూరితంగా మానవుల అందరిమీదా ప్రసరిస్తుంది. దీనినే వైకుంఠపు ఉత్తరద్వారం తెరుచుకోవటం, నారాయణుని దర్శనం కలగటం అని మార్మికభాషలో చెప్పారు.
ఆత్మకారకుడైన సూర్యనారాయణుడు ధర్మస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. మన: కారకుడైన చంద్రుడు శిరోస్థానమైన మేషంలో ఉండి సూర్యుని చూస్తున్నాడు. ఇది ఈ సమయంలో ప్రకృతిలో జరిగే ఒక అమరిక. అంతరికంగా ఇది ఒక అత్యంతమార్మికసూచన. దీని అంతరార్ధం యోగులకు విదితమే.
ఖగోళంలో జరిగే ఈ అమరికవల్ల మానవునిలోపల కూడా ఈ రొజున విష్ణుసాన్నిధ్యాన్ని సులభంగా పొందగలిగే స్పందనలు ఉంటాయి. మానవుని సాధనకు విశ్వంలోని వాతావరణం ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మనస్సు తేలికగా భగవధ్యానంలో నిమగ్నం కాగలుగుతుంది. కనుక యోగులైనవారు ఈ రోజున సాధనను తీవ్రతరం చేస్తే అనుకూలంగా ఉన్న గ్రహ అయస్కాంత ప్రభావంవల్ల ఉత్తరద్వారం అనబడే అజ్ఞా-సహస్రదళపద్మముల మధ్యనున్న రహస్య ద్వారం తెరుచుకొని కుండలిని సహస్ర దళ పద్మం అనబడే వైకుంఠాన్ని చేరగలుగుతుంది. ఇదే మోక్షం పొందటం అంటే.
మూలాధారం నుంచి సహస్రదళం వరకూ వ్యాపించి యున్న కుండలినీ శక్తిమీద పవళించి ఉన్న మహాశక్తి స్వరూపాన్నే మన పురాణాలు-- ఆదిశేషుడనబడే మహాసర్పంపైన శయనించి ఉన్న మహావిష్ణువుగా మార్మికభాషలో చెప్పాయి. ఆ సర్వేశ్వరుని కరుణ ఈ రోజున ఇతోధికంగా మానవులకు లభించగలదు. ఇదే ముక్కోటి ఏకాదశి యొక్క రహస్య ప్రాశస్త్యం. మరి ఈ రోజు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇక మనమీద అధారపడి ఉంది.
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365
https://www.facebook.com/Omkaram.GURUJI.MAHARAJ.9441288365.HYD.Live.PROGRAM/

Saturday, 23 December 2017

సన్యాసికి స్వర్గమా ? వేశ్యకి స్వర్గమా ? Omkaram Guruji Maharaj Hyd

భౌతికంగా జరిగే మార్పుల వల్ల మనుషుల్లో ఎట్లాంటి పరివర్తనా జరగదు. మానసికమయిన మార్పులవల్లే మనుషుల్లో పరివర్తన కలుగుతుంది. మనసులో కాంతి ఉంటే ఆచరణలో కూడా ఉంటుంది. తమని తాము మార్చుకోవాలని ఆశించే వాళ్లని ఆశ వెంటాడుతుంది. వాళ్లు హృదయ పరివర్తన గురించి ఆలోచించరు. పైపై మార్పులతో తృప్తి పడిపోతారు.

మనిషి నిత్యచైతన్యంతో ఉండాలి. తను బాహ్యమయిన మార్పుల్ని కోరుకుంటున్నాడా? అంతరంగికమైన పరివర్తనని కోరుకుంటున్నాడా? అన్న స్పృహతో ఉండాలి. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. లేకుంటే అంతా అస్తవ్యస్తమవుతుంది.

ఒక పట్టణంలో ఒకేసారి ఒక సన్యాసి ఒక వేశ్య చనిపోయారు. ఆసన్యాసి ఆశ్రమం చాలా పేరుపొందింది. దేశవిదేశ భక్తులు వచ్చేవాళ్లు. ఆశ్రమంలో ఎన్నో యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉండేవి. ఆ సన్యాసి గొప్ప జ్ఞానిగా పేరుపొందాడు. ఆయన సర్వశాస్త్ర పారంగతుడు. తన బోధనల్తో జనాల్ని ఊగించేవాడు. తన ప్రతిభతో ఆట్టుకునేవాడు.

అతని ఆశ్రమానికి సమీపంలోనే వేశ్య గృహం ఉండేది. ఎందరో విటులు ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాళ్లు. సన్యాసి ఇదంతా గమనిస్తూఉండేవాడు. తన బోధనలు వినిపిస్తున్నా ప్రార్థనలు చేస్తువున్నా వాటి వెనుక వేశ్యకు సంబంధించిన ఆలోచనలు మెదుల్తూ ఉండేవి. నేను శాస్త్రాల గురించి, సర్వసంగపరిత్యాగం గురించి చెప్పుకుంటూ కాలం గడుపుతూ

ఉంటే… ఈ వేశ్య మాత్రం ఎందరు విటులతో ఆనందాన్ని పొందుతోంది. సుఖాన్ని అనుభవిస్తోంది. జీవితమంటే ఆమెది కదా! అదృష్టమంటే ఆమెది కదా! అని అనుకుంటూ ఉండేవాడు.

ఆ వేశ్య ఎప్పుడయినా ఆ ఆశ్రమం ముందు నడిచిపోతూ ‘ఈ సన్యాసి ఎంత పవిత్ర జీవితం గడుపుతున్నాడు? నిత్యభగవన్నామ సంకీర్తనతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. జీవితమంటే ఆయనదే కదా! నాది నీచమయిన బతుకు. హీనమయిన బతుకు. పూర్వజన్మలో పాపం చేసుకుని నేను ఈ వేశ్యజన్మ ఎత్తాను” అని పశ్చాత్తాపంతో కుమిలిపోయేది.

సన్యాసి, వేశ్య ఏకకాలంలో మరణించారు. దేవదూతలు వేశ్యని స్వర్గానికి తీసుకెళ్లారు. యమభటులు సన్యాసిని నరకానికి తీసుకెళ్లారు. అప్పుడు సన్యాసి యమభటుల్ని ఆపి ”ఆగండి! ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిత్య సత్య ప్రవచనాలతో నిర్మలమైన జీవితం గడిపిన యోగిని నేను. నేను ఎట్లాంటి పాపకార్యాలు చెయ్యలేదు. నన్నెందుకు నరకానికి తీసుకెళుతున్నారు? అనునిత్యం వేశ్యావృత్తిలో ఉంటూ పాప పంకిల జీవితం గడిపిన ఆ వేశ్యను దేవదూతలు స్వర్గానికి ఎందుకు తీసుకెళుతున్నారు? నేను దేవదూతలతో స్వర్గానికి, ఆమె యమభటుల్తో నరకానికి వెళ్లాలి” అన్నాడు. యమ భటులు కిందకు చూడమాన్నారు. ఆ సన్యాసి శవాన్ని పూలరథంలో ఊరేగిస్తూ వేలమంది జనం వెంట వెళుతున్నారు. భగవన్నామసంకీర్తతో పరిసరాలు ప్రతిధ్యనిస్తున్నాయి. ఆ దృశ్యం చూసి సన్యాసి ఆనందించాడు. మరోవేపు వేశ్య శరీరాన్ని ఖననం కూడా చెయ్యకుండా శ్మశానంలో ఒక మూల పడేశారు. ఎవరూ పట్టించుకోలేదు. కాకులు,గద్దలు పీక్కుతింటున్నాయి.

సన్యాసి యమ భటుల్తో ”చూశారు కదా నా గొప్పతనం నా పవిత్రత” అన్నాడు. యమభటులు ”ప్రపంచంలో కనిపించడానికి మనసులోపల ఉన్నదానికి చాలా తేడా

ఉంటుంది. ప్రపంచం పైపైన జరిగే దాన్నే పట్టించుకుంటుంది. నువ్వు బతికి ఉన్నన్ని రోజులు వేశ్య గురించే ఆలోచించావు. ఆమె అంతులేని సుఖాలలో ఓలలాడుతుందనే అనుకున్నావు. నీ జీవితంలో ఆనందం లేదని, అర్థం లేదని అనుకుంటూ గడిపావు. కానీ ఆ వేశ్య తాను నీచ వృత్తిలో ఉన్నా పవిత్రమైన హృదయంతో పరితపించింది. నువ్వు పైపైన దేవుణ్ణి భజన చేస్తే ఆమె పరవశంగా భగవంతుణ్ణి కీర్తించింది. నిన్ను అదృష్టవంతుడవని నీది ఉత్తమజీవితమని తలపోసింది. అందుకే ఆమెకు స్వర్గప్రాప్తి. నీకు నరక ప్రాప్తి” అన్నారు.
సన్యాసి స్థాణువైపోయాడు.

మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365.....

మా పేజీని లైక్ చేయని వారు లైక్ చేయండి..
అందరు షేర్ చేయగలరని మనవి
ప్రతి రోజు ఒక నూతన ఆధ్యాత్మిక సమాచారం మీకు ముందుగానే చేరుతుంది...

https://www.facebook.com/Omkaram.Ayurveda.officially/

Wednesday, 20 December 2017

ఇది తెలుసుకోకపోతే మనజీవితానికి అర్థం లేదేమో ?



ఒక సమయంలో జరిగిన యధార్థ విషయం .......

అతను యువకుడు. అన్ని అనుకూలాలు వున్నవాడు. ఏ యిబ్బందులూ లేవు. అట్లాంటిది అతనికి హఠాత్తుగా సత్యాన్వేషణపైకి దృష్టి మళ్లింది. సత్యాన్ని అన్వేషించాలన్న వాడికి గురువు అవసరం. అందుకని తగిన గురువుని అన్వేషించడానికి బయల్దేరాడు. గ్రామం వదిలి వెళుతూ ఉంటే పొలిమేరలో ఒక పెద్ద చెట్టు కింద రచ్చబండపైన ఒక సన్యాసి వుండడం చూశాడు. అతని దగ్గర ఏదయినా సమాచారం దొరకవచ్చని అనుకుని ఆ యువకుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్లి నమస్కరించి ‘నువ్వు ఎన్నో ప్రదేశాలు తిరిగి వుంటావు. ఎంతో అనుభవాన్ని గడించి వుంటావు. నేను సత్యాన్వేషణలో వున్నాను. సరయిన గురువుని వెతికే పనిలో ఉన్నాను. నీ ప్రయాణంలో నీకు గొప్ప గురువు తటస్థపడే వుంటాడు. అతని గురించి చెబితే నీకు రుణపడి ఉంటాను. గురువు లేకుండా నా జీవితం సంపూర్ణం కాదు” అన్నాడు. ఆ సన్యాసి వృద్ధుడు. అరవయ్యేళ్లు ఉంటాయి. అతను తప్పకుండా నీకు ఆ గురువు వివరాల్ని అందిస్తాను. దాన్ని బట్టి అతన్ని నువ్వు గుర్తు పట్టవచ్చు. అని ఆ గురువు రూపురేఖల్ని వర్ణించాడు. ”ఈ వివరాల్ని మాత్రం విస్మరించకు. అట్లాంటి వ్యక్తి ఎక్కడయినా నీకు ఎదురయితే అతనే గురువు” అన్నాడు.
ఆ యువకుడు వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి అన్వేషిస్తూ సాగిపోయాడు. పదిసంవత్సరాలు గడిచిపోయాయి. యువకుడు కూడా పెద్దవాడయ్యాడు. అన్వేషణలో అలిసిపోయాడు. వృద్ధుడు చెప్పిన పోలికలున్న వ్యక్తి ఎక్కడా అతనికి తటస్థపడలేదు. చివరికి విసిగిపోయి ”బహుశా: అట్లాంటి గురువు లేడేమో” అనుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామపొలిమేరల్లో ఒక వృక్షం,రచ్చబండ. తమ గ్రామాన్ని వదిలిపెట్టినప్పుడు వున్న రచ్చబండ, ఆ రచ్చబండపై అదే సన్యాసి మరింత వృద్ధుడయ్యాడు. పండు ముసలివాడయ్యాడు. ఆ తొంభయి సంవత్సరాల వృద్ధుణ్ణి చూసి యువకుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే పదియిసంవత్సరాల క్రితం ఆ సన్యాసి వర్ణించిన లక్షణాలన్నీ ఆ వృద్ధుడిలోనే ఉన్నాయి. యువకుడి కళ్లలో నీళ్లు కదిలాయి. ఆవేశంతో ఆ సన్యాసి దగ్గరకి వచ్చి ”ఎందుకు నన్ను మోసం చేశావు? నా పది సంవత్సరాల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వే గురువని చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు కదా!” అన్నాడు. దానికి ఆ వృద్ధుడు నవ్వుతూ.. ”మొదట నీ కోపాన్ని ఉపసంహరించుకో. అప్పుడు అసలు సంగతి చెబుతాను. పదియిసంవత్సరాల క్రితం నువ్వు యువకుడివి. ఆవేశంలో ఉన్నావు. నేనే గురువని చెప్పి ఉంటే నువ్వు నవ్వే వాడివి. విశ్వసించేవాడివి కాదు. పైగా మా గ్రామానికి వచ్చి నేనే గురువంటావా?” అని హేళన పట్టించేవాడివి. అయినా అన్నీ నీకు వివరంగా చెప్పాను. వర్ణించాను. కానీ నువ్వు ఇక్కడ కాకుండా ఎక్కడో వెతుకుతున్నావు. పదిసంవత్సరాల నీ అన్వేషణ వ్యర్థం కాలేదు. నువ్వు పరిణితి చెందావు. నన్ను గుర్తించావు. పైగా నీ పదిసంవత్సరాలు వ్యర్థమయ్యాయని నాపై ఆరోపణలు చేస్తున్నావు. కానీ నా సంగతి ఆలోచించు. పదిసంవత్సరాలుగా నేను ఈ వృక్షాన్ని వదిలిపెట్టలేదు. యిక్కడే వున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఏదో ఒకరోజు నువ్వు వస్తావని నీకోసం ఎదురుచూస్తున్నాను. నీకు చెప్పిన మాటల్లో అణువంతుకూడా అసత్యం లేదని గ్రహించు” అన్నాడు.
ఆ మాటలతో యువకుడికి ( నాకు ) జ్ఞానోదయమైంది.
చివరగా నాదొక సందేశం...
ప్రతో మనిషి జీవనగమనంలో కష్టం సుఖం / సంతోషం దుఃఖం మంచి చెడు ,,, జీవితంలో గెలు ఓటములు 
ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కూడాను తాత్కాలికమే ..!!
కావున వాటిని అన్నిటిని అధిగమించటానికి పరిష్కారములు తెలిపే వాడే సద్గురువు..
మన కష్ట సుఖాలు భాదలు పంచుకుని మన జీవనానికి సన్మార్గాన్ని చూపి మోక్ష మార్గం వైపు నడిపించే వాడే సద్గురువు...
ఈ క్రింది ఈ విషయం గమనించండి.. 
విశ్వమందు బ్రహ్మ విస్తరించుటగానుక..!!!
వేరే బ్రహ్మ మునికి వెదక నేల..!!!
తగిలియుండును గాదె తనలోనే బ్రహ్మాంబు..!!!
----------
నీతో సహా అన్నింటా విస్తరించి ఉన్న ఆ పరబ్రహ్మను తెలుసుకోలేక ఆయనకోసం ఈ ప్రపంచమంతా వెతుకుతారెందుకు ?
నిన్నంటిపెట్టుకుని నీలోనే ఉన్నాడు అది చూసుకో ,,, అది చూపించే వాడే సద్గురువు.......
ఇట్లు మీ శ్రేయోభిలాషి ఓంకారం మోక్షమార్గం గురూజీ మహారాజ్ హైదరాబాద్ 9441288365...
షేర్ చేయండి మీ బంధుమిత్రులకు .......

Tuesday, 19 December 2017

నిజమైన సంపద ఎక్కడ ఉంది ?

యధార్థ సంభాషణ 
నేనొక సంపన్నుడి ఇంట్లో ఒకరోజు బస చేశాను.  అతను రోజంతా సంపాదనలో మునిగిఉండేవాడు.  రాత్రంతా సంపాదించింది లెక్కబెట్టుకుని దాచుకునేవాడు.  దాంతో అతనికి నిద్రా,నీళ్లూ ఉండేవి కావు.  ఉదయానికి అతని ముఖం పేలవంగా ఉండేది.  అశాంతిగా ఉండేవాడు.  అవిశ్రాంతంగా ఉండేవాడు.  అతన్ని చూసి నాకు జాలి కలిగింది.  ఎవరయితే డబ్బు వెంట, కీర్తి వెంట పరుగులు పెడతారో వాళ్లకు శాంతి ఉండదు.  అతనికో కథ చెప్పాను.  ఒక గొప్ప ఆధ్యాత్మిక సద్గురువు నగరానికి వచ్చాడు.  సద్గురువులు ఎక్కడ బడితే అక్కడ ఉంటారు.  ఇతను భిన్నమైన వాడు.  అతని ముఖంలో గొప్ప ప్రశాంతత రూపుకట్టి ఉండేది.  ఎవరు ఆయన దగ్గరికి వెళతారో ఆయన ప్రశాంతత వాళ్ళను కూడా చుట్టుముట్టేది.  ప్రాపంచిక రాగద్వేషాలను దాటిన మహా ఆనందమేదో ఆయన్లో ఉండేది.  అందరూ మంత్రముగ్ధులయి ఆయన మాటల్ని వినేవారు.  ఆయన్లో ఉన్న ఆనంద పరిమళం ఎలాంటిదంటే అది నిశ్చల అరణ్యాలలో ఉంటుంది.  నిర్మల నక్షత్రాకాశంలో మాత్రమే ఉంటుంది.  స్వర్గ సంబంధమయిన స్వచ్ఛత, ఆహ్లాదం ఆయన వర్చస్సులో కనిపిస్తుంది.  ఆయన గొప్ప సంపన్నుడు.  ఆ సంపద భౌతిక సంపదకాదు.  అది ఆత్మధనం.  మన దగ్గరున్న సంపద ఇస్తే తరిగిపోతుంది.  ఆయన దగ్గరున్న సంపద అలాంటిదికాదు.  అది యిస్తూ ఉంటే పెరుగుతూ పోతుంది.  ఆయన శ్వాసలో కూడా ఒక సంగీతముండేది.  ఆయన మాట్లాడినా, మౌనంగా ఉన్నా ఆనందం తాండవించేది.  మామూలు మనుషుల మనసు గర్వంతో నిండిపోయి ఉంటుంది.  డబ్బుతో, కీర్తితో, పదవుల్తో నిండిపోయి ఉంటుంది.  కానీ అవన్నీ పసివాళ్ళ చేష్టలు.ఆ సన్యాసి మధుర వాక్కులు వినడానికి ఎందరో వచ్చేవాళ్లు.  విని తరించేవాళ్లు.  ఆ నగరంలో  కాత్యాయని అనే సంపన్నురాలయిన స్త్రీ ఉండేది.  ఆమె తన చెలికత్తెతో కలిసి వచ్చి ఆ సద్గురువుల ప్రవచనాలని విని పరవశించింది.   సాయంత్రం కావస్తోంది.   ఆయన మధుర వాక్కులు వింటూ ఆమె మైమరచిపోయింది.  ప్రాపంచిక బంధనాలన్నీ పటాపంచలయిపోయాయి.  అర్ధనిమీల నేత్రాలతో ఆమె ఆనందాలోకాల్లో తేలిపోతుంది.  చీకటి పడుతోంది.  తను వెళ్ళి ఇంట్లో దీపం వెలిగించి వస్తానని చెలికత్తె వెళ్లింది.  వెళ్లిందల్లా కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చి ”అమ్మా! ఘోరం జరిగిపోయింది.  మనం   లేనిది చూసి దొంగలు ఇల్లంతా దోచుకున్నారు” అంది.  కానీ కాత్యాయని అవేవీ వినేస్థితిలో లేదు.  సద్గురువుల మాటలు వింటూ  ఆనందభాష్పాలు రాలుస్తోంది.  చెలికత్తె ”అమ్మా! వాళ్ళు మన బంగారు నగలన్నీ దోచుకెళ్లారు” అని ఆందోళనగా అంది.
కాత్యాయని చెలికెత్తె కేసి చూసి, నువ్వు అంతగా బాధపడాల్సిన పని లేదు.  ఎందుకంటే వాళ్ళు దోచుకెళ్లినవి నిజమైన బంగారు ఆభరణాలు కావు.  అవి నిజమైన సంపద కాదు.  ఈ మహానుభావుడు ఏం చెబుతున్నాడో అది నిజమైన ఐశ్వర్యం.  మన నగలు దోచుకున్న దొంగలు ఈ రోజుకాకపోయినా రేపటికయినా ఆ సంగతి తెలుసుకుంటారు. ఏది దోచుకోడానికి వీలుపడదో అదే నిజమైన సంపద. ఆసంపద ఈ మహాపురుషుడి దగ్గర ఉంది.  అది మనకందరకు పంచుతున్నాడు” అంది.  అక్కడే ఉన్న దొంగల నాయకుడు ఆమె మాటలు విని దిగ్భ్రమ చెందాడు.  ఆ మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి.  పరివర్తన తెచ్చాయి.  వెంటనే తన తోటి దొంగలతో దోచుకున్నదంతా తీసుకెళ్లి కాత్యాయని ఇంట్లో వదిలిపెట్టి రమ్మని చెప్పాడు.
ఈ కథ విని నేను బస చేసిన ఇంటి యజమాని తన దగ్గరున్న సంపద నిజమైన సంపద కాదని గ్రహించాడు.  అతని జీవితంలో మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయాడు.
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365
https://www.facebook.com/Omkaram.GURUJI.MAHARAJ.9441288365.HYD.Live.PROGRAM/

Monday, 18 December 2017

కాషాయం బట్టలు వేసుకున్నవాళ్లంతా సన్యాసులైన ?



వాస్తవాలు తెలుసుకుందాం ఈ కాలం కొందరు సన్యాసి సన్నాసుల గురించి యధార్థ విషయాలు తెలుసుకుందాం.
      ఈ ముసుగు వేసుకుని వందల వేళా కోట్లు సంపాదించుకున్నవారు ఎంతమంది ఉన్నారు  ?
కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఎవడూ సన్యాసి కాడు. కాని జనం భ్రమల్లో వుంటారు. బట్టలు మార్చినంతమాత్రన మారిపోతామనుకుంటారు. మారిపోవడం కూడా మరిదేన్నో పొందడానికే అయివుంది. అన్నింటినీ వదులుకోవడం అంత సులభం కాదు. మనుషులు అభిప్రాయాల్ని మార్చుకుంటారు. కానీ అభిప్రాయాల్ని వదులుకోరు. పైపైన మారడం సులభం. లోపలి మార్పు కష్టం. మార్పు లేని తనాన్ని కప్పిపుచ్చడానికి మనుషులు ముసుగులు వేసుకుంటారు. ముసుగులు మారుస్తారు. మారిన ముసుగుల్ని చూసిన జనం వీళ్లు మారిపోయారనుకుంటారు.
సత్యాన్ని గ్రహించాలనుకున్న వ్యక్తి దాన్ని తెలుసుకునేదాకా వదిలి పెట్టడు. సత్యాన్ని తెలుసుకోవడమంటే ఏది వాస్తవమో, ఏది కాదో దాన్ని తెలుసుకోవడం, ఉన్నదాన్ని దర్శించడం వల్ల సత్యం ఆవిష్కారమవుతుంది. తనను తాను తెలుసుకోవడమే సత్యం. అన్వేషి మార్పుల వెంట పరుగు తీయడు. ఇప్పుడు క్షణం జీవిస్తాడు.
ఒక నగరంలో గొప్ప ధనవంతుడు వుండేవాడు. అతను దేశంలోనే గొప్ప సంపన్నుడు. నిరంతరం ధన సంపాదనలోనే మునిగి వుండేవాడు. సంపాదించడం, సంపాదించిన దాన్ని కూడబెట్టుకోవడం తప్ప అతనికి మరో చింతన లేదు. సాధారణంగా సంపన్నులకు గొప్పవాళ్లతో సంబంధాలుంటాయి. అట్లాగే ధనవంతుడికి దేశం రాజుతో సంబంధాలున్నాయి. ఒక సందర్భంలో ఎవరికీ లోటూ కలగకుండా ధనవంతుడు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అతని ఐశ్వర్యానికి విస్తుపోతూ రాజు పరివారం విందువినోదాల్లో మునిగింది.
రాచకుటుంబానికి ప్రత్యేక ఏర్పాట్లు వుంటాయి కదా! తన మందిరంలో ధనవంతుడు రాజుగారికి బస కల్పించాడు. తను కూడా రాజుగారితో బాటు కూచున్నాడు. సేవకులందరూ సపర్యలు చేస్తున్నారు. పంచభక్ష్యపరమాన్నాలు వడ్డిస్తున్నారు. యింతలో ఒక పనివాడి చేతిలోంచి వేడివేడి పళ్ళెం అన్నంతో సహా కింద పడింది. పడడం ధనవంతుడి కాలిమీద పడింది. వేడికి ధనవంతుడి కాలు కాలి బొబ్బలు లేచాయి. ధనవంతుడి కోపం కట్టలు తెంచుకుంది. పనివాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది. తన పని ముగిసిపోయిందనుకున్న పనివాడు ధనవంతుడి ఆగ్రహాన్ని చూసి తన ప్రయత్నం తను చేద్దామనుకునిఎవరయితే తన కోపాన్ని జయిస్తాడో అతను స్వర్గానికి వెళతాడుఅన్నాడు. అందరికీ వినిపించేంతగా. మాటతో ధనవంతుడు కోపాన్ని దిగమింగుకుని చిరునవ్వు నటించాడు. అతని సహనానికి రాజు కూడా అభినందించాడు. పనివాడుక్షమించే తత్త్వమున్న వాళ్ళకే స్వర్గ ప్రాప్తిఅన్నాడు. ధనవంతుడు ఆగ్రహాన్ని అణిచిపెట్టి అందరూ వినేలానిన్ను క్షమించానుఅని పనివాడితో అన్నాడు. పనివాడు ఊపిరిపీల్చుకునిదయాగుణం ఉన్న వాళ్ళనే దైవం ప్రేమిస్తాడు.” అన్నాడు.
ధనవంతుడునీకు స్వేచ్ఛనిస్తున్నాను. ధనం తీసుకుని వెళ్ళు. నీ యిష్టమొచ్చినట్లు జీవించుఅని డబ్బుసంచిని యిచ్చి పంపించాడు. అందరి దృష్టిలో ధనవంతుడు మహాపురుషుడయ్యాడు. నగరంలోనే కాదు దేశమంతా ధనవంతుని కీర్తి వ్యాపించింది. అప్పటిదాకా అతన్లో ఉన్న కోపం,అహంకారం,పగ, లోభి గుణం హఠాత్తుగా రంగు మార్చుకున్నాయి. శాంతం, దానగుణం, దయాశీలంగా మారిపోయాయి. లోకమే అతని పరివర్తనకు విస్తుపోయింది.
అనుకూలాన్ని బట్టి అతని ముసుగులు మారిపోయాయి. కోపం శాంతంగా మారింది. ప్రతికారం దయాగుణంగా మారింది. యీ మార్పులు నిజమైన మార్పులా? అన్నీ అహం కేంద్రంగా వున్నవి కావా? అభినందనల్ని ఆధారం చేసుకున్నవి కావా? ధర్మమన్నది అంత చవగ్గా దొరికితే ప్రతివాడూ ధర్మాత్ముడయి పోతాడు. మనిషి చెయ్యాల్సింది ముసుగులు తగిలించుకోవడం కాదు. రకరకాల ముసుగుల్ని మార్చుకోవడం కాదు. క్రమక్రమంగా అన్ని ముసుగుల్ని వదిలించుకోవడమన్నదే నిజమైన వైరాగ్యం. సన్యాసం.

మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్  9059406999  HYD 

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...