Thursday, 14 December 2017

ఇది చదవకపోతే మనం ఏంటో మనకే తెలియదు...

ఈ పేజీని లైక్ చేసి షేర్ చేయండి

తల్లి  గర్భము  నుండి ! ధనము  తేడెవ్వడు ! 
వెళ్ళి  పోయెడి  నాడు !  వెంట  రాదు !
లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !
మెరుగు  బంగారంబు ! మింగ  బోడు !
విత్తమార్జన జేసి ! విర్రవీగుటె  కానీ !
కూడ బెట్టిన  సొమ్ము ! కుడవ  బోడు !
పొందుగా  మరుగైన- భూమి  లోపల బెట్టి !
దాన  ధర్మము  లేక !  దాచి  దాచి !
తుదకు  దొంగల కిత్తురో- దొరల  కవునో !
తేనె జుంటీగ లియ్యవా- తెర  వరులకు !
భూషణ  వికాస !  శ్రీ ధర్మపురి  నివాస !
దుష్ట  సంహార ! నరసింహ ! దురిత దూర !!

వ్యాఖ్య:- మనము తల్లి గర్భము నుండి ఈ లోకములోకి ఉత్తచేతులతోనే వచ్చాము !! ఉత్త చేతులతోనె పోతాము !! పుట్టిన వాడు
గిట్టక తప్పదు!!
 లక్షాధికారి అయినా ఎవరూ బంగారం తినరు కదా !! ఉప్పుకారంతోకూడుకున్న అన్నమే తింటారు!! అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ధనాన్ని సంపాదించి ఎంత విర్ర వీగినా కూడ బెట్టిన సొమ్ము ఎవరై నా తినగలుగుతారా !! తినలేరుకదా !!

దానము,ధర్మము లేక!! దోచి దోచి దాచిన సొమ్ము చివరకు దొంగలకవుతుందా !!
దొరలకవుతుందా !! ప్రభుత్వమే జప్తు చేసు కుంటుందా!! చెప్పటం కష్టం!!
మన కళ్ళ ముందర ఎంత మందిని చూడటం
లేదు!! అవినీతి మహారాజుల జీవితాలు
తారు మారు కావటం లేదా!!
తేనెటీగలు జీవితాంతము కూడ బెట్టిన తేనె ను అవి తినగలుగుతున్నాయా ? తినలేవు!!

మన హిదుత్వ ఆధ్యాత్మిక జీవన విధానం త్యాగమయమే కాని భౌతిక భోగలాలసత్వం  కాదు!!
" త్యాగేనైక అమృతత్వ మానుషుః! న ధనేన
న ప్రజేన" అని వేదం ఘోషిస్తుంది!!

త్యాగము చేయటం వలననే "అమృతత్వం"
సిద్ధిస్తుంది! ధనం వలన గానీ సంతానము
వలన గానీ ప్రజాబలం వలన గానీ లభించదు

ధర్మ బద్ధంగా సంపాదించండి !!
ధర్మ బద్ధంగా జీవించండి !!
ఇదే మన భారతీయ జీవన విధానం !!
హిందూ ధర్మ జీవన వైభవం!!
మీ శ్రేయోభిలాషి  ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365 

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...