బ్రతకటానికి ఒక డబ్బు ఉంటే సరిపోతుందా ?
💐👇💐👇💐👇💐
తెలివితేటలు......
మనిషి బతకడానికి అసలైన ఇంధనం డబ్బు. దాంతోనే అసలైన సుఖం, సంతోషం లభిస్తాయి. దేవునినందు పూర్తిగా ఉందంటేనే దానర్థం డబ్బుకు లోటుండదు.. ఇలాంటివి మనం వింటూ, చెబుతూ అనుకుంటూ ఉండేవే. కానీ డబ్బు అవసరాన్ని మాత్రమే తీర్చగలదనీ అవగాహనను పెంచలేదనీ పాపాత్ముల ఖాతాలో మూలుగుతుండేది డబ్బైతే మంచివారి జీవితంలో స్థిరమయ్యేది తెలువనీ, తృప్తినీ చెబుతుందీ కథ. బతకడం అంటే బుద్ధిని ఉపయోగించి గానీ డబ్బును ఆసరా చేసుకొని కాదంటుందీ గాథ.
-ఇట్టేడు అర్కనందనా దేవి
పూర్వం ఒక రాజుండేవాడు. బంధాలను విడిచిపెట్టి, అన్ని సుఖాలనూ త్యజించి లోకక్షేమం మాత్రమే కోరుకునే సాధుపుంగవులంటే ఆ రాజుకు వల్లమాలిన అభిమానం. వారిని చూసినా చాలు, పరవశించి పోయేవాడా రాజు. సాధువులెవరైనా రాజ్యానికి వచ్చారని తెలిస్తే చాలా ఆత్రుత పడుతూ వారికెదురెల్లి ఆహ్వానించి రాజ్యానికి వారిరాక వన్నె తెచ్చిందని తెలుపుతూ సత్కారాలు చేసేవాడు. ఆతిథ్యంలో ఎటువంటి లోటూ రాకుండా తానే స్వయంగా దగ్గరుండి చూసుకునేవాడు. వారేదడిగినా కాదూ, లేదూ అనకుండా ఇచ్చేవాడు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పొరుగు రాజ్యాలవారికీ తెలిసిపోయింది. అయితే రాజులోని మంచితనం, బుద్ధి నిశితత్వంచ అతనిలోని ఆదరణను కాక చేతకాని తనంలా వ్యక్తీకరించే ప్రయత్నాలు జరిగాయి.
రాజులోని ఈ గుణానికి చాలానే పరీక్షలు ఎదురైనాయి. ఒకనాడు పొరుగురాజు ఒకడు ఇతన్ని మూర్ఖునిలా ప్రపంచం ముందు నిలబెట్టాలని వృథా ప్రయత్నం ఒకటి చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా పొరుగురాజు వేషాలేసేవాడిని పిలిచి సాధువుగా తయారై ఆ రాజుదగ్గరికి వెళ్ళు. అతను నీ పట్ల ఎలా వ్యవహరించాడో తిరిగి వచ్చి నాకు చెప్పు. అతని తెలివితేటలను బుట్టబయలు చేసే సమయం వచ్చిందని సంబురపడతాడు.
వేషాలేసేవాడు ఆ మాట విని సాధువులా మారి అక్కడికి వెళతాడు. ఎవరో కొత్త సాధువు తన రాజ్యానికి వచ్చారని తెలుసుకొని, అతనికి ఎదురెల్లి మరీ స్వాగతం పలుకుతాడు రాజు. తన భవనానికి తీసుకొచ్చి ఘనమైన ఆదర సత్కారాలు అందిస్తాడు. అలా రెండు మూడు రోజులు రాజభవనంలోనే గడిపిన కపట సాధువు రాజుది నిజంగానే మూర్ఖత్వమని అనుకుంటాడు. మరునాడు రాజు సాధువుతో అయ్యా! మీరు గొప్పవారు. మీ మాట చాలా అమూల్యం. నాకూ ఏదైనా మంచిమాట సెలవీయండని అడుగుతాడు. అప్పుడు సాధువు రాజా! మీరు చాలా అదృష్టవంతులు. తమకింత పెద్దరాజ్యం లభించింది. తరగని ధనసంపద ఉంది. ఇంతపెద్ద పరివారసేన ఉంది. రాజ్యంలోని ప్రతిఒక్కరూ మీకు అనుకూలంగానే ఉంటారు. ఇంతకన్నా భగవంతుని కృప ఎవరికి లభిస్తుందని చాలా రకాలుగా రాజువైభవాన్ని పొగుడుతూనే ఉంటాడు. రాజు మారుమాట్లాడక అన్నీ విన్నాడు. అతని ఆదరణలోనూ ఏ మార్పూ లేదు.
మరో మూడు రోజులు గడిచాక కపట సాధువు రాజుతో ఇక మేము బయలుదేరే సమయం వచ్చిందని అంటాడు. సరే మీ ఇష్టం అంటాడు రాజు. సాధువును పిలిపించి అతని ముందే ఖజానా తెరిచి ఇందులోంచి ఏం కావాలన్నా తీసుకోండి. బంగారం, రత్నాలు, రూపాయలు ఏవైనా సరే మీ ఇష్టం వచ్చినన్ని స్వీకరించండని చాలా మర్యాదగా చెబుతాడు రాజు. ఇదే మంచి సమయమనుకొని సాధువు చాలా విలువైన సొమ్మునంతా తీసుకొని దానిని తీసుకెళ్ళేందుకు రథాన్ని ఏర్పాటు చేయమని పురమాయించి బయలుదేరబోతుండగా రాజు సాధువుతో మహానుభావా! నా తరపున కూడా ఒక ప్రత్యేక బహుమతిని స్వీకరించండని ఒక చిన్న వెండి పెట్టెను బంగారు జరీ బుట్టలో చుట్టి అతనికిస్తాడు. సంతోషంగా తీసుకొని నిజంగానే రాజు పిచ్చివాడనుకుంటాడు.
కపట సాధువు తనను పంపించిన పొరుగురాజును చేరుకుంటాడు. అతను ఏమేమి తీసుకొచ్చాడని అడిగితే, తాను తీసుకొచ్చిన కోట్ల విలువ చేసేవాటిని ప్రదర్శించాడు సాధువు. రాజు వాటన్నింటినీ చూసి నిజంగానే అతను మూర్ఖుడు. సాధువెటువంటి వాడోనని నిర్థారించుకోకుండానే ఇవన్నీ కట్టపెట్టాడు. అంతలో సాధువు తనకిచ్చిన ప్రత్యేక బహుమతి గుర్తొచ్చి దానిని తీసి తన రాజుకిచ్చాడు. అది రాజుగారి తరపున ఇచ్చిన మరపురానిదట అని వెటకారంగా నవ్వుతాడు.
పొరుగురాజు ఆ పెట్టెను తెరచి చూస్తే అందులో మరో వెండిపెట్టె మళ్ళీ దాన్ని తెరిచి చూస్తే అందులో మరో చిన్న వెండి పెట్టె. ఆ చిన్న పెట్టెనూ తెరిచిచూడగా అందులో ఒక గుడ్డి గవ్వ దొరికింది. దాని అర్థమేమిటా అని పొరుగురాజు, సాధువు తలలు బద్ధలు కొట్టుకోగా తేలిందేమిటంటే, ఆ రాజు మూర్ఖుడూ కాడూ, అమాయకుడూ కాడు. సాధువు కపట వేషధారి అని చెప్పకనే చెప్పాడు. అతనిచ్చిన మూడు పెట్టెలూ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు ప్రతీకైతే అందులోని గుడ్డి గవ్వ బయటి వేషభాషలు చాలానే ఉన్నా, లోపల ఏమీ లేదని చెబుతుంది.
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365

No comments:
Post a Comment