Monday, 30 April 2018

ప్రతి ఒక్కరు ఇది చదివితే ?

…గొప్ప నీతి కథ…మా అభిమానుల కోసం

పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
'
ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..

రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు.

ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..

వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..

సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..

మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు..

రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..

దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..

దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..

హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని.

వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు..

వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న  దేశమూ... ఆశించే పౌరులున్న  ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు..
అది సరైన పాలనా కాదు..

పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం..
🌹🌹🌹🌹🌹🌹
ఈ మెసేజ్ పంపించిన మహానుభావునికి శత సహస్ర కోటి వందనాలు. ఇది పూర్తిగా నా మనసులో మాట. ఏ దేశంలో రాయితీల అవసరం ఉండదో ఆ దేశం కంటే గొప్ప దేశం మరొకటి ఉండదు .రాయతీలు హీన పరిస్థితికి అద్దాల వంటివి. కేజీ బియ్యం తక్కువ ధరకి యిచ్చే ప్రభుత్వం కంటే , ఎంత ధరకయినా కొనగలిగే ప్రజలుండే ప్రభుత్వం గొప్పది. ఈ విషయం ఎన్నో విధి విధానాలకు వర్తిసుంది. ప్రజలు మెలుకొనేదెప్పుడు ?
మీ శ్రేయోభిలాషి
 ఓంకారం గురూజీ మహారాజ్ hyd 9441288365

Thursday, 26 April 2018

మన అమ్మల గన్న అమ్మ ఎవరో చూద్దాం రండీ...





✍✍✍
ఓంకారం గురూజీ మహారాజ్ Hyd 9441288365
✍✍✍✍✍✍
🌸 *గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మల గన్న అమ్మ ....* 🌸
.

భగవంతుడు అన్ని చోట్లా సర్వ వ్యాపియై ఉన్నా కూడా, కొన్ని స్థలములలో, కొన్ని రూపములలో  విశేషించి ఆయన అనుగ్రహము ప్రసరిమ్పబడుతుంది. వీటినే పుణ్య క్షేత్రములు అంటాము. ఇటువంటి ఎన్నో దివ్యమైన పుణ్య క్షేత్రములు గల భూమి మన భారత దేశం. ఈ పుణ్య క్షేత్రాలలో, ఒక్కో స్థలం ఒక్కో కారణానికి బాగా ప్రసిద్ధం అయ్యాయి. ఇటువంటి వాటిలో గర్భారక్షాంబికా ఆలయం అనే పుణ్య క్షేత్రం ఒకటి. ఇక్కడ అమ్మ వారు స్త్రీల యొక్క సంతాన సబంధమైన సమస్యలను నివారించి, చక్కని సంతాన ప్రాప్తి కటాక్షించేందుకు వెలిసిన తల్లి.  శ్రీ గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం.

తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబికా అమ్మవారు మరియు శ్రీ ముల్లైవనాథర్. ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ అవగతమవుతుంది. గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మల గన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే ఇక్కడ గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. ఇక్కడ అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. ఇదే క్షేత్రంలో అమ్మ వారితో పాటుగా కొలువై ఉండి భక్తులను అనుగ్రహించే శంకరుడు శ్రీ ముల్లైవనాథర్ గా కొలువబడుతున్నాడు. అంటే మన తెలుగులో చెప్పాలంటే ముల్లైవ నాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ స్వామి ని సేవిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయం అయిపోతాయి. ఈ గర్భారక్షాంబికా ఆలయం తమిళనాడు లో తంజావూర్ జిల్లాలో, పాపనాశం తాలూకా లో తంజావూర్ –కుంభకోణం వెళ్ళే దారిలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణమునకు ముందు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రము గల ఊరిని అక్కడ “తిరుక్కరుగావుర్” గా పిలుస్తారు.

ఇక్కడ అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి చక్కని కంచి పట్టు చీర ధరించి, సర్వాలంకార భూషితయై మెరిసి పోతూ ఉంటుంది. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ “రా నాన్నా, నీకెందుకు బెంగ, నేను ఉన్నాను కదా నీకు” అని అభయం ఇచ్చినట్లుగా ఉంటుంది అమ్మ వారి యొక్క స్వరూపం. ఇక్కడికి వచ్చే భక్తులకు అమ్మ వారు ఒక విగ్రహం కాదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అమ్మ సంతానము కటాక్షించడానికి సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత ఈ అమ్మ. ఎంతో మంది భక్తులు సత్సంతాన ప్రాప్తికై అమ్మని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని ఈ క్షేత్రములో అమ్మని దర్శించినచో, వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది.

🌺 *శ్రీ ముల్లైవనాథర్...* 🌺

ఇక్కడ ముల్లైవనాథర్ గా ఉన్న పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ శివ లింగము పుట్ట మన్నుతో చేసినది, అందుచేతనే ఇక్కడ స్వామికి జలముతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతో అభిషేకంచేస్తారు. ఈ క్షేత్రమును మాధవీ క్షేత్రం అని కూడా అంటారు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగయే. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు చంద్ర కిరణాలు శివలింగము మీద పడతాయి. అది ఒక అద్భుత దృశ్యము. ఇక్కడ కర్పగ వినాయాకర్ మరియు నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి సన్నిథి కూడా కలదు.

ఈ ఆలయం కనీసం వేయి సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఇక్కడ ఉన్న ఎత్తైన గోపురము, ప్రహరీలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ తొమ్మిదవ శతాబ్దములో చోళ రాజుల హయాములో చెక్కిన శిలా ఫలకాలు ఉన్నాయి. ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు జ్ఞానసంబంధార్ అనే ముగ్గురూ ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు. వీటిని తమిళంలో పత్తిగం అంటారు. ఈ ఆలయ సందర్శనార్ధం వస్తున్న ఈ ముగ్గురు నాయనార్లకి దారి కనపడకపోతే, సాక్షాత్తు పరమశివుడే వీరికి ఈ ఆలయ దర్శనం చేయించారు. 

పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో నివశించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొరకై ఈ దంపతులు అమ్మవారిని, శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచిరోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భందాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది. నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటిపనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియదు. ఆగ్రహం చెందిన ఊర్ధ్వపాదుడు, ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్ధిస్తుంది. అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మ వారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు  ఆ కుండలో పెరిగి చక్కని మగపిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువమహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని  ఆశ్రయించే వాళ్లకి గర్భరక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు.

మహర్షి చేసిన ప్రార్ధనకి సంతసించిన అమ్మవారు మరియు ఈశ్వరుడు ఈ క్షేత్రములోనే గర్భారక్షాంబిక, ముల్లైవనాథర్ గా కొలువున్నారు. ఇప్పటికీ, అమ్మ అనుగ్రహముతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీస్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం అయ్యి, మంచి పిల్లలు పుడతారు. ఇక్కడ అమ్మను సేవిస్తే ఇంకా పిల్లలు లేని వారికి గర్భందాల్చడం జరుగుతుంది. గర్భందాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లికాని ఆడ పిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్ధిస్తే వెంటనే మంచివ్యక్తితో వివాహం అయి సత్సంతానప్రాప్తి కలుగుతుంది.

 ఈ క్షేత్రం ఉన్న ఊరిలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరికీ గర్భస్రావం కావడం, పిల్లలు కలుగకపోవడం అనే సమస్య లేదు.  ఇక్కడ స్థానికులు ఈనాటికీ అమ్మవారి అనుగ్రహం ఈ క్షేత్రంలో ఉంది, అందువల్లనే మేము రక్షింపబడుతున్నాము అని విశ్వసిస్తారు. మన దేశము నుండి వేరే దేశముల నుండి ఎక్కడెక్కడి నుంచో దంపతులు వచ్చి ఇక్కడ అమ్మ ఆశీస్సులు పొంది వెడతారు.

పిల్లలు లేని వారికి శివపార్వతుల దగ్గర ఉంచి మంత్రించిన నెయ్యి ఇస్తారు, ఆ నెయ్యిని దంపతులు ఇద్దరూ నలభై ఎనిమిది (48) రోజులు నిద్రించబోయే ముందు సేవిస్తే తప్పకుండా త్వరలోనే గర్భం దాల్చడం జరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు అయితే వారికి శివపార్వతుల దగ్గర ఉంచి మంత్రించిన తైలము (ఆముదం) ఇస్తారు. ఈ తైలమును గర్భిణిగా ఉన్న తల్లికి నొప్పులు ప్రారంభం అవ్వగానే ఉదరభాగములో రాయడం వల్ల, ఎటువంటి సమస్య లేకుండా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రసవం అవుతుంది. (గర్భిణిగా ఉన్న స్త్రీలు ఆ సమయంలో ఈ క్షేత్రం వెళ్ళలేకపోయినా, వారి యొక్క భర్తకాని, ఎవరైనా బంధువుకాని ఈ క్షేత్రం దర్శించి, ఆమె పేరు మీద సంకల్పము చేయించి ఈ తైలము తెచ్చుకోవచ్చు.)

అంతే కాక సంతానము కావలసిన స్త్రీల యొక్క జన్మ నక్షత్రం రోజున ప్రతీ నెలా ప్రత్యేక అర్చన కూడా చేయించుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఆలయయాజమాన్యం వాళ్ళు. ప్రతీ నెలా ఇంటికి అమ్మవారి కుంకుమ మరియు స్వామి విభూతి ప్రసాదంగా పంపిస్తారు.

అయితే ఇలా అమ్మ అనుగ్రహముతో ప్రసవం అయిన తర్వాత వీలుచూసుకుని ఆ దంపతులు పుట్టిన పిల్లవాడిని తీసుకు వెళ్లి అమ్మవారి ఎదురుగా ఒక వెండి ఊయల ఉంటుంది, అందులో పిల్లాడిని పడుకోబెట్టి అమ్మ యొక్క దర్శనం చేయించాలి. అలా చేస్తే ఆ పిల్లలు కూడా, అమ్మ వారి అనుగ్రహం ప్రసరించి, దీర్ఘాయుష్మంతులై, ప్రయోజకులవుతారు.

Wednesday, 25 April 2018

*ఇది జరిగిన ఒక యదార్ధ సంఘటన*

✍✍✍ ఓంకారం గురూజీ మహారాజ్ hyd 9441288365
✍✍✍🌸 *ఇది జరిగిన ఒక యదార్ధ సంఘటన* 🌸

ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది.ఆ ఇంట్లోవారందరూ ధార్మికులు,దైవ భక్తి కలవారు.ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు.వయస్సులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.తనకి ఆటలయందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు.ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు,అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు.ఆ పసితనం లోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనస్సులో దృడంగా నాటుకుంది.ఎలా వెళ్ళాలో తెలియదు.అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు.తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు.ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతుండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు.అప్పుడు తను ఇంట్లో లేకపోవడం వలన తానొక్కడే బ్రతికాడు.ఇక ఒక్కడే అనాధలా మిగిలిపోయాడు.ఆ చిన్నవాడు రోజూ తన వాళ్ళను తలచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు.ఆ పిల్లాడ్ని చూసి ఆ ఊరివారంతా బాధ పడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు.

అప్పుడు అతని ఊరికి ఆ సాధువు మళ్ళీ వచ్చాడు .....

ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి
"ఎందుకు అనవసరంగా బాధపడుతూ కలాన్నంతా వృధా చేసుకుంటావు.ఏ బంధమూ శాశ్వతము కాదు నాయనా.జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్లిపోవచ్చు కానీ ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు అతనే మన తండ్రి.అతను అనాధనాధుడు,అతను ఉండగా ఎవరూ అనాధలు కారు.ఆయన్నే ధ్యానిస్తూ  ఉండు నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు.ఆ సాధువు మాటలతో సేద తీరి తన దుఃఖాన్ని మరచి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టి నిలిపాడు.

 ఒక గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాధుడే తన తల్లి తండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే జీవిత ధ్యేయం అని నమ్మి ఎంతో శ్రమించసాగాడు.చదువులేదు ఏ పని చేతకాదు,ఇది వరకు పని చేసిన అనుభావం కుడా లేకపోవడం వలన ఒక చోట ఒక పనిలో చేరాడు.తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీని దర్శించుకుని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు ... కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలుస్కుని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నాడు.రోజూ మూడు పూటలా భొంచేయడానికి కుడా తన సంపాదన సరిపోయేది కాదు.అయినా తను వాటిలోనే సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు.

 అక్కడి విశ్వనాధుడిని,విశాలాక్ష్మి అమ్మవారిని,అన్నపూర్ణా దేవిని,డుండి గణపతిని , కాళ భైరవ స్వామిని తన మనస్సులోనే ఊహించుకుంటూ,ప్రతి రోజు స్నానం చేసేప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుంతుందో అనుకుంటూ ,అన్నం తినేప్పుడు అన్నపూర్ణమ్మ చేతి వంట తినే మాహాభాగ్యం ఎప్పుడు  కలుగుతుందో అనుకుంటూ నిరంతరం కాశీ ఆలోచలనతోనే గడుపుతుండేవాడు ...

అలా ఇరవై సంవత్సరాలు ఎంతో కష్ట పడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకుని ఆనందంతో నిద్రపోయాడు.రాత్రికి రాత్రే అతని ఇంట్లో ఒక దొంగ తను దాచుకున్న డబ్బు దోచుకుని పోయాడు.ఉదయం లేచి కాశీ యాత్రకూ బయలుదేరుదాం అనుకుంటుండగా తను దాచుకున్న డబ్బు కనిపించలేదు ... వేసిన గొళ్ళెం వేసినట్లే ఉంది డబ్బు ఎలా పోయిందో అనుకుంటూ గుడిసంతా ప్రతి అంగుళం వెతికాడు కాని డబ్బు కనిపించలేదు ... 

అతని బాధకు అంతే లేదు ... తన ఆశలన్నీ అడియాశలైయ్యాయనీ, శరీరంతో విశ్వేశ్వరుడ్ని కలవలేను కనుక చనిపోయి అయినా విశ్వేశ్వరుడిని కలవాలని అనుకున్నాడు , వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు.మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు ...

తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒకావిడ వొడిలో పడుకుని ఉన్నాడు.ఆవిడ ఎవరో తెలియదు .ఎక్కడ ఉన్నాడో తెలియదు,ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది.అక్కడ ఒకతను ధ్యానంలో కుర్చుని ఉన్నాడు.అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడ్ని చూసాడు తను.వొళ్ళంతా భస్మం రాసుకుని,జుట్టంతా ఎఱ్ఱగా ఉంది ,జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తి భావం కలిగింది." స్వామి మీరెవరు ..... " అని అడగాలనుకున్నాడు కాని అతనికి నోట మాట రావడం లేదు ..

అలా కాసేపు తదేక దృష్టితో చూస్తుండగా ఇతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.మనసు నెమ్మదించి స్వస్వత పొందింది.కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్తుడయ్యాడు.అలా ఎంత సేపు ధ్యానంలో ఉండిపోయాడో కుడా తెలియదు.నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తు పట్టాడు.తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధ పడుతుండగా తన మనస్సును మార్చి విశ్వనాధుని వైపుకి త్రిప్పింది ఈ సాధువే అని జ్ఞాపకానికి వచ్చింది.ఇరవైయేళ్ళ క్రితం చుసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగి,ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో ,ఎవరిని దర్శిస్తుండడం వలన మనస్సు ప్రశాంతత పొందుతోందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను,ఇది నా తండ్రి ఆ విశ్వనాధుని అపార కరుణే అనుకుని , ఆ సాధువుకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు ,కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి .అతనికి కలిగిన భావనలు,ఆ ఆనందానుభూతి,గొంతు గద్గదం అవ్వడం ,కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలువారడం ఇవన్నీ అతన్ని ఆశ్చర్యానందాలకు గురిచేస్తుండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి,అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్న ఒకావిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు ...

ఆ గదిలో ఒకావిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది.ఆవిడ మోములో చిరు మందహాసము,ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తున్నదా అన్నట్లు ఉన్నది. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా ఆక్రమించినట్లున్నది .ఈ కుర్రవానికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తజేస్సు నరనరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు.అతని మదిలో ఎన్నో స్మృతులు తళుక్కుమని మెరుపులా మెరిసి అంతర్ధానం అవుతున్నాయి.అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు.తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బృకుటిలో ఒక జ్యోతి దర్శనం అయ్యింది.అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కుర్చున్నాడు.

అటు తరువాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడినుండి తీసుకుని ఇంకో గదిలో ఉన్న ఒకావిడ దగ్గరకు వెళ్ళింది ,ఆవిడ చూడటానికి పండు ముత్తైదువలా ఉన్నది.ఎర్రటి బొట్టు,తల నిండా కనకాంబరం పువ్వులు,ఎర్రటి అంచున్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకుని కుర్చుని ఉన్నది. ఇతన్నిచూస్తూనే రా నాయనా అంటూ నవుతూ పలకరించిది.ఒక్కసారిగా ఆ కుర్రవాడు అయిదారేళ్ళ పసి బాలుడిలా మారిపోయాడు.ఆ పిల్లవాడ్ని దక్కరకు తీసుకుని, తన వొడిలో కూర్చోబెట్టుకుని ఒక తీయ్యటి పదార్ధం తినిపిస్తున్నది. అటువంటి పదార్ధం తను తన జీవితంలో తినలేదు.కడుపు నిండా తిన్న తరువాత ఆ పసివాడికి జోల పాడి నిద్రపుచ్చింది ...

నిద్రలేచేసరికి తన పక్కనే ఒకతను కుర్చుని ఉన్నాడు.అతని చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కుర్చుని ఉన్నాయి.అతని రూపు చూడటానికి భయంకరంగా ఉన్నా తన మొగములో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించింది.తన ఈ కుర్రవాడితో ఇలా అన్నాడు," కుక్క ఒక విశిష్టమైన జంతువు,విశ్వాసానికి ప్రతీక,తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కుడా లెక్కచేయకుండా ఎంత పెద్ద శత్రువుతోనైనా పోరాడుతుంది.అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు." తరువాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు.ఆ ఏనుగు ఇతన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండ బెట్టుకుని ఆ నగరం అంతా ఉత్సాహంగా తిరిగింది.ఈ నగరాన్ని అతను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు కానీ అణువణువునా పవిత్రతతో భాసిస్తోంది,ఎంత చూసినా తనివి తీరడం లేదు.అలా తిరిగి తిరిగి ఇద్దరు ఆ పెద్దావిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేదతీర్చింది ...

మళ్ళీ తనుకు మంచి నిద్రపట్టేసింది.

అప్పుడు అతనికి ఒక కల వచ్చింది ... ఆ కలలో తను చుసిన వారంతా మళ్ళీ కనిపించారు ... ఆ సాధువు అతనితో , " నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా ఏవిటో ఇప్పుడు అడుగు అన్నాడు." ... ఆ కుర్రవాడు " స్వామీ,చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాధుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే,మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములు నా తండ్రి వైపు నిలుపగాలిగాను,మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవడం ఎంతో ఆనందంగా ఉన్నది.ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను,నేను చుస్తున్నదంతా కలా నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు గురువతున్నాను ... కానీ నా సందేహాలివి,నేనెక్కడ ఉన్నాను,ఇక్కడకు ఎలా వచ్చాను,మీరంతా ఎవరు అని ప్రశించాడు,ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు, మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి ? అని అడిగాడు ...

అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు ...

నిన్ను బావిలో మునిగిపోతుండగా కాపాడిన ఆవిడే గంగ,నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాధుడిని నేనే,బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షీ దేవి,నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణా దేవి,కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాళ భైరవుడు,నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్న ఏనుగే మా డుండి గణపతి,నువ్వు చుసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలు గన్న పరమ పవిత్ర కాశీ నగరం అని వివరించి ... ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా " అని అడిగాడు ...

అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రువులతో స్వామి వారి పాదాల మీద వ్రాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ... " తండ్రీ,నాకు చిన్నప్పుడు కనిపించి దిశా నిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువైఉన్న నిన్ను సేవించమని చెప్పావు ,నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నామస్మరణ వీడలేదు.అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను ??? "

అప్పుడు స్వామి వారు ఇలా అన్నారు ...

" నాయనా,అంత కంటే ముందు నీ పూర్వ జన్మ వృతాంతం తెలుసుకోవాలి ... నీవు పూర్వ జన్మలో ప్రస్తుతం నువ్వు పని చేస్తున్న జమీందారు ఇంట్లోనే రెండు తరాలకు ముందు జన్మించావు.నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దానధర్మాలు చేసి ఎరుగావు,పరమ లోభివి.ధనమందు నీకు మిక్కిలి పేరాశ ఉండేది.నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతము ఇచ్చేవాడవు కావు.ఇలా నీకు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకూ ధనమందు ఆశ పోలేదు.అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు.నీ అదృష్టవశాత్తూ నువ్వు ఆయన సత్సంగానికి వెళ్లావు.ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడవైనావు."

" నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది.ఆ యోగికి శిష్యుడవైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలసి కాశీకి ప్రయాణమైనావు.కానీ నీ వయస్సు సహకరించక మార్గ మధ్యలోనే కాలం చేసావు.నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడం వల్లను,ఒక సత్పురుషునికి భోజనం పెట్టుట వల్లను విశేష పుణ్యఫలం లభించింది.కానీ అంతకు ముందు చేసిన పాప కర్మలు కుడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి,పసి వయస్సులోనే అనధావు అయ్యావు.ఎనభై సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో నాలుగవ వంతు అనగా ఇరవై సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు.ప్రతి క్షణం నా గురించి తపించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది."

నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చులకోసమై దాచిన డబ్బును దోచుకున్నది నేనే,"అన్నాడు ఆ మహా దేవుడు.

ఆ కుర్రవాడు," స్వామీ,ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు ? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను ? ఏమి మీ ఆట ? అని అడిగాడు ...

అప్పుడు విశ్వనాధుడు ఇలా అన్నాడు , " నేను దొంగిలించినది నీ డబ్బును కాదు ... నీ కర్మను మాత్రమే ... నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం.కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను.అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహం ... "

" చెబుతాను విను,పరీక్షించకుండా దేని విలువా బయట పడదు.నన్ను నమ్మిన ప్రతి భక్తుడినీ మొదట పరీక్షిస్తాను అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పుజ్యనీయుడు,అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు.నీవు తీవ్ర మనస్తాపానికి గురియై దేహ త్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు.కానీ ఆత్మహత్యా దోషం మళ్ళీ జన్మ జన్మాంతరాలు కట్టి కుడిపేస్తుంది.ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే.అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది.ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మ హత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతి ఫలం అనుభవించాల్సిందే."

" నీవు దేహ త్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీ నగరం ఏర్పడేది.జీవుల ఆలోచనలను,చర్యలను బట్టి కార్యాచరణాలు మారిపోతూ ఉంటాయి.కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీ వాసమే అని గుర్తించు " అని వివరించాడు.

ఆ కుర్రవాడు స్వామి వారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిల్చుండిపోయాడు.అప్పుడు స్వామి వారు అతనికి కశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చేవారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించాడు.ఆ కుర్రవాడు ప్రతి రోజు గంగా స్నానం ఆచరిస్తూ,విశ్వనాధ,విశాలాక్షి,అన్నపూర్ణా దేవిలను సాకారముగా దర్శిస్తూ,కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసానదశలో శివైక్యం చెందాడు.అతని పేరు గుర్తు రావడం లేదు కానీ ఆయన సమాధి ఓక ఘాట్లో ఉన్నదని చెప్పారు.

అందుచేత కాశీ స్మరిస్తూ మనంకూడా మానసికంగా కాశీలోనే జీవించి తరి ద్దాం ....

సమాప్తంఇంత ఓపికగా చదివిన వారికి కృతజ్ఞతలు
ఇట్లు మీ శ్రేయోభిలాషి
ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365

Tuesday, 24 April 2018

మనం తినే ఆహారం ఎన్ని గంటల్లో బయటకు వెళ్ళాలి మనకు తెలుసా ?

మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో....మలినంగా బయటికి వెళ్లిపోవాలి.లేక పోతే జబ్బులు.

మన శరీరం లోకి వెల్లిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే....జబ్బులు

మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి...లేకపోతే..మనం రోగ గ్రస్థులం అవుతాం..

మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం,....మోసం...ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే....ఏమౌతుందో తెలుసా...

మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.
మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీ గా మరణిస్తున్నాం.

మనకు వయసు పెరిగితే...ఆయుష్షు తగ్గినట్టా ,పెరిగినట్టా?...మనం ప్రతి రోజూ...నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరనిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని....మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని,ఒత్తిడిని,ద్వేశాన్ని, బద్ధకాన్ని ,అనారోగ్యాన్ని....ప్రతి రోజూ ధ్యానం , యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది దూరం చెయ్యాలి.

మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం యోగమే...

అందుకే భారతీయ ఋషులు యోగ మార్గాన్నే అనుసరించారుగానీ.....ఏవో దిక్కుమాలిన వ్యాయామ పద్దతుల్ని కాదు.

రోజూ అర గంట...యోగ , ధ్యానం చెయ్యండి...జీవితాన్ని రోజూ జీవించండి.
🚩🙏మీ. శ్రేయోభిలాషి
ఓంకారం గురూజీ మహారాజ్ hyd 9441288365

ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలంటే ? ఏం చేయాలి...?



*ఈభూమి మీద మళ్ళీ జన్మ లేకుండా ముక్తినిపొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవాలి ఎప్పటికైనా (వదిలించుకోవాల్సిందే).*
👉 *ఐతే వీటిని ఎలా వదిలించుకోవాలి ? అనేది తెలుసుకుందాం.*
👉 *మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసేపనులు అన్నీ కర్మలే*.
👉 *ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయెంతవరకు కర్మలు చేస్తూనే వుంటాడు*.
👉 *ఇలా చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది (కర్మ ఫలితం ప్రకృతి సహజ గుణం).*
👉 *మనం చేసే ప్రతి కర్మ కూడా ఎపుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చియే తీరుతుంది.*
👉 *అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను ౩ రకాలుగా విభజించారు. అవి 1) అగామి కర్మలు, 2)సంచిత కర్మలు మరియు ౩)ప్రారబ్ద కర్మలు.*
💐 *అగామి కర్మలు* 💐
👉 *ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే.*
👉 *అయతే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి.కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివటం కోసం కూడబెట్టు కొనిఉంటాయి.*
👉 *ఉదాహరుణకు మనం భోజనం చేస్తాం. అది కూడా కర్మ.వెంటనే మన ఆకలి తీరుతుంది*.
👉 *ఎవరినైన కోపంతో తిడతాం.అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడుతాడు. అది కర్మఫలం.*
👉 *ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి.కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు.*
👉 *ఉదాహరునకు ఎదురుగాలేని వాణ్ణి తిడతాం.వాడిమీద నిందలు వేస్తాం.కానీ వాడు ఎదురుగలేడు గనుక అప్పటికప్పుడు ఫలితం రాదు.*
👉 *దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు.
👉 *అలానే జీవహింస చేస్తాం దాని ఫలితం వెంటనే కనబడదు. ఏదోఒక రోజు అనుభవించి తీరాలి*.
👉 *మనం పరీక్షలు వ్రాస్తాం. ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి.ఇలా ఈ రకంగా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే.*
🌏 *సంచిత కర్మలు*🌏
👉 *ఇంతకూ ముందు జన్మలో చేసి, తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టబడిన కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించినవి పోను, మిగిలినకూడబెట్టబడిన కర్మలను, అదేవిదంగా అంతకుముందు జన్మలలో చేసిన కర్మఫలనుండి ఖర్చు అయినవిపోగా ఒక జన్మనుండి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంకుచిత కర్మలు అంటారు.*
👉 *జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా గాని ఈ సంచిత కర్మలు మాత్రం జీవున్ని విడిచి పెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తుంటాయి.*
👉 *మనం అద్దె ఇళ్ళలో వుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులను ఎలా ముటగట్టుకొని వేలతామో అలాగే జీవుడుకు శరీరం భగవంతుడు ఇచ్చిన అద్దె ఇంటిలాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆశరీరంలో ఉన్నప్పుడు సంపాదించినా కర్మఫలాలను ముటగట్టుకొని తగిన మరొక అద్దేకొంపలాంటి ఇంకో శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా తీసుకువెళ్ళేవే సంచిత కర్మలు.*
🌏 *ప్రారబ్ధ కర్మలు*🌏
👉 *అనేక సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయనిస్తాయని చెప్పుకున్నాం.ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో , అప్పుడు అతడి account వున్న సంచిత కర్మల నుండి , ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో , పండుతాయో, ఫలితన్నివ్వటానికి సిద్దంగా ఉంటాయో వాటిని ప్రారబ్ద కర్మలు అంటారు.*
👉 *ఆ ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, తగిన శరీరంతో జీవుడు మళ్ళి ఈ లోకంలో ప్రవేసిస్తాడు*.
👉 *అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పుర్తియ్యేవరకు శరీరం వుంటుంది..*
👉 *భగవంతుడు మనకు అజ్ఞానంతో మరియు అవిద్యతో సంపాదించుకొని వున్న ప్రారబ్ద కర్మలను తొలగించుకోవడానికి మనకు (జీవునికి) మరొక శరీరాన్ని ఇస్తుంటే, మనం ఇక్కడ వాటిని వదిలించుకోవడానికి వచ్చి, చేసే కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికీ తోడూ ప్రోగు చేసుకుంటున్నాము.*
👉 *ఇది గమనించండి.ఇలా ప్రోగు చేసుకోవడం వలన మరల మరలా భగవంతుడు మనకు (జీవునికి), నీ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణిడిగా నా దగ్గరకు రమ్మని అతనికి మరల శరీరాన్ని ఇస్తున్నాడు.*
👉 *మనం ఏ రోజైతే సంపూర్ణంగా అన్ని కర్మలను ఈ స్థూల శరీరంతో సంపూర్ణంగా చేసి వదిలించుకుంటామో, మనం అప్పుడు మాత్రమే మన నివాస స్తానానికి చేరుకుంటాము.*
👉 *అదే పరమపదము , అదియే మన నివాస స్థానము.మనం అనుకున్న్నట్టుగా వున్న ఈ శరీరము కాదు , ఈ భూమిమీద వున్న ఇల్లు కాదు.*
👉 *నీ నివాస స్థానము ఈ సృష్టికి మూలకరణము అయిన పరమాత్మునిలో ఐక్యం(అదియే పరమపదము). “పునరపి జననం పునరపి మరణం .పునరపి జానీ జటరేశయనం” అని శంకరాచార్యుల వారు “భజగోవిందంలో చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్బంలో ప్రవేశించాలి*.
👉 *ఇలా అయతే ముక్తి ఎప్పుడు ? మోక్షం ఎప్పుడు ? శాశ్వతానందం ఎప్పుడు ఈ జనన మరణాలనుండి విముక్తి చెందినప్పుడే అంటే మళ్ళీపుట్టుక లేకుండా పోయినప్పుడే*
👉 *మళ్ళీ పుట్టుకలేకుండా పోవాలంటే ఏం చేయాలి*
👉 అసలు ఈ జన్మ (పుట్టుక) ఎందుకు వస్తుంది ?
👉 *ప్రారబ్ద కర్మ ఫలాలను అనుభవించటానికి వస్తున్నది. ఆ ప్రారబ్దకర్మలే లేకపోతే పుట్టుకే లేదు*.
👉 *ఐతే ఈ ప్రారబ్ద కర్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి?*
👉 *సంచితకర్మలలో నుండి పక్వమై వస్తున్నాయి.కనుక ప్రారబ్ద కర్మలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి*.
👉 *అయితే సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి ? మనం ముందు జన్మలో చేసిన ఆగామి కర్మలలో నుండి ఫలితాన్నిచ్చినవి పోను మిగిలిన కర్మలే సంచిత కర్మలుగా వస్తున్నవి.*
👉 *కనుక సంచిత కర్మలు చేయకుండా వుండాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట.ఐతే కర్మలు చేయకుండా వుండటం ఎవరికైనా సాధ్యమేనా ?*
👉 *ఈ లోకంలో వ్యవహరిస్తూ కర్మ చెయ్యకుండా ఒక్కక్షణం కూడా ఉండలేము.అందుకే “భగవద్గీత” లో భగవానుడు శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు. నీవు కర్మలు చేస్తూనే ఉండు.కాని ఫలితాన్ని ఆశించకుండా ఉండు.
👉 *అంటే ఈ లోకంలో కర్మలు చేస్తూనే జీవించాలి.ఇదే నీ కున్న మార్గం.మరొక మార్గం లేదు*.
👉 *కనుక జీవించినంత కాలం కర్మలు చేస్తూ వుండాల్సిందే.ఐతే ఎలాంటి కర్మలు చేయాలి ?*
👉 *జన్మ లేకుండా పోవాలంటే కర్మలు చేయకుండా వుండాలనుకున్నాం.కానీ కర్మలు చేయకుండా వుండడం ఒక్కక్షణం కూడా సాద్యం కాదని, జీవించి ఉన్నంత కలం కర్మలు చేస్తూ ఉండాల్సిందేననీ తెలుసుకున్నాం.*
👉 *ఐతే ఎలాంటి కర్మలు చేయాలి ?*
👉 *పాపకర్మలు, చెడ్డకర్మలు ( జీవహింస) చేశామా ? కష్టాలు, దుంఖాలు అనుభవించడానికి మళ్ళీ జన్మించాలి.*
👉 *పుణ్యకర్మలు, మంచి కర్మలు చేసామా ? సుఖాలు, భోగాలు అనుభవించటానికి దేవతలగానో జన్మించాలి*
👉 *అవి ఇవి కలగాపులగంగా చేసామా సుఖాన్ని, దుఃఖాన్ని. భాగాన్ని, మరియు రోగాన్ని అనుభవించడానికి మనవునిగా జన్మించాలి.*
👉 *కనుక ఎలాంటి కర్మలు చేసిన కర్మబందనం తప్పదు.జన్మ తప్పదు.*
👉 *అంటే పుణ్య కర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు మరియు పాపకర్మలు చేస్తే ఇనుప సంకెళ్ళు అన్నమాట.రెండు సంకెళ్ళే, రెండును కూడా జీవున్ని బందించేవే*
👉 *కానీ మనకు కావలసింది విముక్తి వీటన్నిటినుండి సంపూర్ణంగా విముక్తి అదియే ముక్తి , మోక్షం , పరమపదం.*
👉 *ఈ కర్మలు బంధాలు కాకుండా వుండే ఉపాయం ఏమిటంటే , అగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితన్నిచ్చే కర్మలు చేయవచ్చు. తర్వాత ఎప్పుడో ఫలితన్నిచ్చే విదంగా కర్మలు చేయకూడదు*
👉 *అంటే ఆగామి కర్మలు సంచితం కాకుండా , కూడబెట్టకుండా చాల చాల జాగ్రత్త పడాలి*
👉 జాగత్త అంటే మనం దేవుని ముందర నిల్చొని చాట బారడం అంత లిస్టు అప్పచెప్పుతాం ఆ లిస్టు ఏంటో నేను చెప్పనక్కరలేదు అనుకుంట ఎందుకంటే అందరు దాదాపు చేసే పనులివే కదా. దేవుడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, అంటే మనం అందరం మొదట భగవంతునిని కోరికలు కోరడం మానివేయాలి జరిగేదంతా మన మంచికే అని మన మనసును ధ్యాన సాధనతో స్తిరపరచాలి అన్న మాట).
👉 *ఇక ప్రారబ్ద కర్మలను అనుభవించి ఖర్చు చేసుకోవాలే తప్ప ప్రోగు చేసుకోకూడదు.*
👉 *వీటిని మనం వదిలించుకోవాలి (ఇవి మనం అజ్ఞానముతో మరియు అవిద్యతో వచ్చిన కర్మలు).*
👉 *మరీ ఈ సంచిత కర్మలు తొందరగా అనుభవించేద్దమ అంటే అవి పక్వానికి రాలేదు* .
👉 *పోనీ జాగ్రత్త పాడుదామ అంటే , ఇప్పుడు జాగ్రత్త పడి ప్రయోజనం లేదు. అవి పాత కర్మలు. మరేమిటి ఉపాయం?*
👉 *వీటన్నిటిని ఒక్కసరిగా దగ్దం చేయాలి.ఎక్కడ దగ్దం చేయాలి, అదే జ్ఞానగ్నిలో, అంటే మన అజ్ఞానంతో కూడబెట్టుకున్న అన్ని కర్మలను మనం తెలుసుకుంటున్న జ్ఞానాగ్నిలో దగ్దం చేయాలి*.
👉 *అదియే అసలుసిసలైన ధ్యాన జ్ఞాన మార్గం.*
👉 *అంటే శ్వాస మీద ధ్యాస తో పాప కర్మలన్నీ దగ్ధం చేయాలి.*
👉 *ఈ ప్రకారంగా ఆగామి కర్మలు మరియు సంచిత కర్మలు వున్న వాటినన్నిటిని జ్ఞానగ్నిలో దగ్దం చేయాలి. దగ్దం చేసి జాగ్రత్త పడితే కర్మఫలాలంటూ ఇక వుండవు అప్పుడు కర్మ బందనాలు వుండవు, కర్మ బందనలు లేకపోతే జన్మలుండవు ఇదియే మనవ జీవిత లక్ష్యం*
👉 *మనిసి పుట్టుక సార్ధకత. అదియే మోక్షం*, 👉 *శాశ్వతానందం, ముక్తి. మనం అందుకోవలసిన స్తితి ఇదే, చేరవలసిన స్థానము ఇదే (అదియే మన గమ్యస్థానం).అయితే పైన చెప్పిన పద్దతుల్లో మనం సర్వకర్మ బందనాలనుండి విముక్తం కావాలంటే(జ్ఞానగ్నిలో ధగ్దం చేయాలి)అందుకు గొప్ప సాధన కావాలి.*
 👉 *అటువంటి ధ్యాన సాధనకు మార్గం చూపేది, ఆ మార్గం వెంట మనసు చేయిపట్టుకొని నడిపించేది, లక్ష్యాన్ని చేర్చేది ఒక సద్గురువు మాత్తమే.*
👉 *“ధ్యాన యోగం” ద్వార సంచిత కర్మలను జ్ఞానగ్నిలో దగ్దం చేసుకోమని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎంతో విపులంగా విషదీకరించాడు*
👉 *వీటితో పాటు భగవంతుని సాక్షాత్కారం (మన హృదయంలో దర్శించుకోవడం) కూడా ధ్యానయోగం ద్వార అని కూడా ఎంతో విపులంగా వివరించాడు.*
👉అందువలన మనం అందరం చేయవలసిన పని మొదట ఈ అన్ని(కర్మ,భక్తి,జ్ఞాన) యోగాలతో పాటు భగవంతుని సాక్షాత్కారం ఎంతో బృహత్కర్యమైనదని నా ఉద్దేశ్యం, అందువలన వీటి అన్నిటితో పాటు ముఖ్యంగా ద్యాన యోగంతో ఆ దేవదేవునిని , ఆ భగవంతునిని మన హృదయంలో దర్శనం పొందడం ఎంతో ఉత్తమోత్తమమైనది. అదియే మనవ జీవిత పుట్టుక అసలుసిసలైన లక్ష్యము మరియు మనవ జీవితం యొక్క సార్ధకత. (అదియే ముక్తి, మోక్షము,పరమపదము
,శాశ్వతానందం).

మీ శ్రేయోభిలాషి
ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365

మన హిందువులు దేవాలయానికి వెల్తే ? చులకనగా చూస్తారా ?

ఒక ముస్లిం ప్రతి శుక్రవారం నమాజ్ చేస్తే ఇతర ముస్లింలు అతడిని గౌరవించి వాళ్ళుకూడా నమాజ్ కి వెళ్ళాలనుకుంటారు.
ఒక క్రైస్తవుడు ప్రతి ఆదివారం చర్చ్ వెళ్ళి ప్రార్థనలు చేస్తే అతని వెంబడి దాదాపు అందరు క్రైస్తవులు వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు.
ఇలా ఇతర మతాలవారు వారి మత సాంప్రదాయాలను గౌరవిస్తే వారిని గొప్పవ్యక్తిగా భావిస్తున్నారు వారి సహచరులు.

కానీ.... హిందువుల్లో ఎవడైనా యువకుడు గుడికి వెళ్ళినా, బొట్టు పెట్టినా, సాంప్రదాయ దుస్తులు దరించినా, పాటలు పాడినా, భజన చేసినా, భగవధ్గీత రామాయణ భాగవత భారతాలు చదివినా, ధర్మం పవిత్రత గురించి మాట్లాడినా ఇతర యువతీయువకులు పక్కున నవ్వుకుంటున్నారు.

దానితో ఊరుకోక ఒక చేతకానివాడిలా, అమాయకునిగా, భజన పార్టీగా, పాతకాలపు మనిషిగా ముద్రవేస్తున్నారు.

కాబట్టే హిందుత్వం రోజురోజుకూ అవమానాలకు గురవుతుంది, దేవాలయాలు భక్తులు లేక కళావిహీనమౌతున్నాయి, సాంప్రదాయాలు పాటించే వాడే లేక అవి కనుమరుగౌతున్నయి, లక్షల సంవత్సరాల నాటి సనాతన ధర్మం ఎన్నడూలేనంత నిరాదరణకు గురౌతుంది.

ఓ హైందవ యువకుడా ఇకనైనా మేలుకో.. మీడియా,  సినిమా, విదేశీ శక్తులు, నకిలీ లౌకికవాదులు, ఉగ్రవాదులు.... ఇలా అందరూ కలిసి నీ మాతృభూమిని, నీ మతాన్ని, నీ ధర్మాన్ని నాశనం చేయకముందే మేలకో.
మేలుకొని నీ మాతృభూమి ఋణం తీర్చుకో.
                       ఒక మిత్రుడు షేర్ చేశాడు
నాకు నచ్చింది మీకు నచ్చితే షేర్ చేయండి
హరః హరః మహాదేవాః

మీ శ్రేయోభిలాషి
ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365 Hyd

Monday, 23 April 2018

ఆ ప్రాంతాల రహస్యాల గుట్టు విప్పగలరా???

అక్కడికి వెళ్లి... ఆ ప్రాంతాల రహస్యాల గుట్టు విప్పగలరా???

భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్జానికి నిలయాలు. దీంతో సదరు ఆలయాల నిర్మాణంలో దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. కొన్ని క్షేత్రాల నిర్మాణానికి వినియోగించిన ముడి పదార్థాల ఏమిటన్న విషయం నిగూడర రహస్యమైతే మరికొన్నింటిలో భవనాలు, గుళ్లు, గోపురాల నిర్మాణానికి వాడిన ఇంజనీరింగ్ విధానం ఎటువంటిదన్నతి తెలుసుకోవడానికి మహామహులు తలలు బద్దలు కొట్టు కుంటున్నారు. మరికొన్ని క్షేత్రాలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అటువంటి రహస్యాలతో కూడిన క్షేత్రాల్లో కొన్నింటి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లినప్పుడు వాటి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించండి. ప్రపంచం దష్టిని ఆకర్శించండి...

1. గాలిలో తేలే స్తంభం...

ప్రతి పుణ్యక్షేత్రంలోని గుడిలో అనేక స్థంభాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్థంభం అంటే భూమి పై ఉంటూ పై కప్పును మోసేది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవస్థానంలో కూడా మొత్తం 70 స్థంభాలు ఉన్నాయి. ఇందులో ఒక స్థంభం మాత్రం గాలిలో తేలి ఉంటుంది.

2.ప్రయత్నించి విఫలం...

అది ఎందుకన్న విషయం ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేక పోయారు. ఓ బ్రిటీష్ ఇంజనీర్ ఈ స్థంభాన్ని భూమి పై నిలబెట్టడానికి ప్రయత్నిస్తే పై కప్పు మొత్తం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీంతో సదరు దేవాలయం నిర్మాణం మొత్తం ఈ వేలాడే స్థంభం పై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి నిర్మాణం ప్రపంచంలో ఇది ఒక్కటే.

3. ఆ నీరు ఎక్కడి నుంచి...

ఇదే ఆలయంలో దాదాపు మూడు అడుగుల పొడవైన మానవుడి పాద ముద్ర ఉంది. ఇంతటి బ`హత్ పాద ముద్రను ఎవరు చెక్కారన్నది ఇప్పటికీ నిగూడ రహస్యం. స్థానిక కథనం ప్రకారం ఇది హనుమంతుని పాదముద్రగా భావించినా ఎటువంటి నీటి ఎద్దడి సమయంలోనేనైనా సదరు పాదం నుంచి ఊరే నీరు ఎక్కడి నుంచి వస్తోందన్నది తెలుసుకోలేక పోతున్నారు.

4. వేసవిలోనైనా, వర్షాకాలంలోనైనా ఒకటే నీటి మట్టం...

యాగంటిలోని నందీశ్వర ఉన్న అగస్త పుష్కరిణిలోకి ఓ నంది విగ్రహం నుంచి నీరు వస్తుంది. ఈ విగ్రహంలోని నీరు ఎక్కడి నుంచి వస్తోందన్నది మొదటి ప్రశ్న. అదే విధంగా అటు వేసవి, ఇటు వర్షకాలం ఏ సమయంలోనైనా పుష్కరిణిలో ఒకే మట్టంలో నీరు ఉంటుంది. ఇది ఎలా సాధ్యమన్న విషయాన్ని ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు.

5. ఆ గోపురం నీడ ఎందుకు పడదు...

తమిళనాడులోని తంజావూరులో ఉన్నబృహదీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం గోపురం నీడ భూమి పై పడదు. ఈ దేవాలయానికి చెందిన మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మించి వెయ్యి ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీనిలో ఉన్న మర్మం ఇప్పటికీ తెలియదు. 80 టన్నుల ఏక శిలతో తయారు చేయబడిన వీమాన గోపురాన్ని 216 అడుగుల ఎత్తులో ఎలా ఉంచారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న.

6.నదీ తీరం ఒడ్డున ఎడారి...

కర్ణాటకలో కావేరి నదీ తీరం ఒడ్డున తలకాడు అనే పట్టణం ఉంది. ఈ పట్టణం మొత్తం ఎడారిని తలపిస్తోంది. ఎక్కడ చూసిన ఇసుక దిబ్బలు ఉంటాయి. ఇక ప్రతి ఏడాది ఇసుక పరిమాణం పెరుగుతూ ఉటుంది. ఇది ఎలా సాధ్యమన్న విషయానికి సరైన ఆధారాలు ఇప్పటికీ లేదు. ఓ కథనం ప్రకారం ఓ రాణి శాపం వల్ల తలకాడు ఇలా అయి పోయిందని చెబుతున్నా పరిశోధకులు, శాస్త్రవేత్తలు దీన్ని నమ్మడం లేదు.

7. ఆ కిరణాలు సరిగ్గా అదే రోజు ఎలా తాకుతున్నాయి...

ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని గవి గంగాధరేశ్వరస్వామి దేవాలయం ఒక గుహాలయం. ఇక్కడ ప్రతి ఏడాది శంకరాత్రి రోజున దాదాపు ఒక గంటపాటు సూర్య కిరణాలు నంది విగ్రహానికి ఉన్న కొమ్ముల గుండా ప్రసారం అయ్యి లింగాన్ని తాకుతాయి. క్రమం తప్పకుండా ప్రతి ఏడు జరిగే ఈ అద్భుతాన్ని చూడటానికి చాలా మంది దేవాలయానికి వస్తారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది. ఈ గుహాలయం నిర్మాణంలో వాడిన రహస్యం ఇప్పటికీ నిగూడ రహస్యం.

8.అంతులేని సంపద

కేరళలోని అనంత పద్మనాభ స్మామి టెంపుల్. ఇక్కడ దాదాపు దాదాపు 22 బిలియన్ డాలర్లు విలువ చేసే సంపద ఉన్నట్లు ఐదు నేల మాగళిలను తెరవగా తెలిసింది. మరో మూడింటిని తెరవడానికి ఇప్పటికీ ఎవరూ సాహసం చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక నేల మాగళికకు నాగబంధంతో ద్వారాన్ని మూసి వేశారు. పక్కనే ఉన్న ఓ శ్లోకాన్ని చదివితే ఈ నాగబంధం తనంతకు తానే తెరుచుకుంటుందని కొంతమంది చెబుతున్నారు.

9. నాగబంధనం విడిపించే శ్లోకం చదవగలరా

అయితే సదరు శ్లోకం చదవడం తెలిసిన వారు మాత్రం ఇప్పటికీ ఎవరూ లేరు. ఒక ద్వారాన్ని ధ్వని తరంగాల ద్వరా మూయడం, తెరవడం అప్పటికే మన వాళ్లు కనిపెట్టారని దీని వల్ల అర్థమవుతోంది కదా. ఇక ఈ నాగమాగళిలో ఏముందన్న విషయం ఇప్పటి వరకూ ఎవరూ చెప్పడం లేదు.

10. కైలాసనాథ టెంపుల్

మహారాష్ర్టలోని ఎల్లోర గుహల్లో ఉన్న కైలసానాథ టెంపుల్ ఏక శిల నిర్మితమైనవి. దీనిని ఎవరు, ఎప్పుడు నిర్మించారన్న విషయం పై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. ఇందులో కొన్ని శిల్పాలు రాకెట్, గ్రహాంతర వాసులను కూడా పోలి ఉన్నాయి. వాటిని ఆవిధంగా ఎందుకు చెక్కారు, ఒకవేళ అప్పటి వారికి గ్రహాంతర వాసుల గురించి ముందే తెలుసా తదితర విషయాలన్నీ జవాబులు లేని ప్రశ్నలే
సుదర్శన చక్రం
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ hyd 9441288365

Thursday, 19 April 2018

వైశాఖ విశిష్టత 2వ అధ్యాయం

✍✍ఓంకారం గురూజీ మహరాజ్ Hyd 9441288365✍✍

వైశాఖ పురాణం - 2వ అధ్యాయము

వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు

నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. "అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే, మాధవమాసమని, వైశాఖమునందురు. వైశాఖ మాసముతో, సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు, తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో, సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన, వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు, సమానమైన లాభము లేదు.

నిరాహారముగ చేసిన, తపమును మించిన తపము, లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు, సాటియైన సుఖము లేదు. దయాసమానమైన, ధర్మము లేదు. కంటితో సమమైన, కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము, లేవని, కవులు వర్ణించుచున్నారు.

శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు, వైశాఖమాసము, మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును, వ్రతమును, పాటింపక, వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు, చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట,,, మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను, వైశాఖమాస వ్రతమును పాటింపనిచో, యివి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమునుL పాటించువానికి, మాధవార్పితములగావించి, భక్షించి, ఫలాదులకును, శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు, క్లేశమును కలిగించు, వ్రతములును, యెన్నియో యున్నవి.
ఆ వ్రతములన్నియు, తాత్కాలిక ప్రయోజనములను, కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము, పునర్జన్మను, పోగొట్టును, అనగా ముక్తినిచ్చును.

అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము, వైశాఖమాసమున, జల దానము చేసినంతనే, వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో, అట్టివానికి, సర్వసంపదలు కలుగును. హితములును, చేకూరును. దానములన్నిటిని, ఒకవైపునను, జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో, జలదానమే గొప్పది యగును.

బాటసారుల దప్పిక తీరుటకై, మార్గమున చలివేంద్రము నేర్పరచి, జలదానము చేసినచో, వాని కులములోని వారందరును, పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు, విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే, బాటసారులు, సర్వ దేవతలు, పితృదేవతలు, అందరును సంతృప్తులు, ప్రీతినంది, వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ, సత్యము సుమా. దప్పికగలవాడు, నీటిని కోరును. ఎండ బాధపడినవాడు, నీడను కోరును. చెమటపట్టినవాడు, విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున, కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును(నీరుకల చెంబును), గొడుగును, విసనకఱ్ఱను, దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును, దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను, క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి, యుండును. ఆ నీరే, వానికి జీవనాధారమైన ఆహారమని, కవులు వర్ణింతురు) జన్మించును.

దప్పిక కలవానికి, చల్లని నీటినిచ్చి యాదరించిన, వానికి, కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము, కలుగును. ఎండకుడస్సిన వానికి, విసనకఱ్ఱతో విసిరి, యాదరించినవాడు, పక్షిరాజై, త్రిలోక సంచార లాభము నందును. అట్లు జలము నీయనివారు, బహువిధములైన వాతరోగములనంది, పీడితులగుదురు. ఎండకుడస్సినవానికి, విసురుటకు విసనకఱ్ఱ లేనిచో, పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు, పాపవిముక్తుడై, విష్ణుసాయుజ్యము నందును. పరిశుద్ధమైన మనస్సుతో, భక్తితో, తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను, సర్వపాప విముక్తుడై, బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు, నరకలోక బాధలనంది, భూలోకమున, పాపాత్ముడై జన్మించును.

గొడుగును దానము చేసినచో, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములు, నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున, గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై, పిశాచమై బాధపడును. వైశాఖమాసమున, పాదుకలను దానమిచ్చినవాడు, యమదూతలను తిరస్కరించి, విష్ణులోకమును చేరును, మరియు, ఇహలోకమున, బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులులేవని అడిగినవానికి, చెప్పులను దానము చేసినవాడు, బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు, ఉపయోగించునట్లుగా, అలసట తీర్చునట్లుగా, మండపము మున్నగువానిని, నిర్మించినవాని, పుణ్యపరిమాణమును, బ్రహ్మయును, చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున, అతిధిగ వచ్చినవానిని, ఆహారమిచ్చి ఆదరించినచో, అనంత పుణ్యము కలుగును.

 అంబరీషమహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున, అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని, వినయమధురముగ కుశలమడిగి, యాదరించినవాని పుణ్యము, అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము, గృహము, వస్త్రము, అలంకారము, మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము, యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో, ఇవియన్నియు
ఇష్టములు, ఆవశ్యకములు నగును. అనగా అన్నము, భార్య మున్నగువారికంటె, ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము, అన్ని దానములకంటె నుత్తమమైనదని, భావము. కావున అన్నదానముతో సమానమైన దానము యింతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి, జలదానము, చత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము, మున్నగునవానిని చేయని వారు, పిశాచమై, ఆహారము దొరుకక, తన మాంసమునే, భక్షించునట్టి, దురవస్థను పొందుదురు. కావున అన్నదానము, మున్నగువానిని, యధాశక్తిగ, చేయవలయును. రాజా! అన్నమును పెట్టినవాడు, తల్లినిదండ్రిని, తన ఆదరణ, మున్నగువానిచే, మరపించును. కావున, త్రిలోకవాసులందరును, అన్నదానముచే, సర్వోత్తమమైన దానమని, మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు, కేవలము, జన్మనిచ్చిన అన్నదాతలు, మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు, తల్లిదండ్రులకంటె, నిర్వ్యాజమైన,, ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు, అన్నదాతయే. కావున, అన్నదాత ,సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు, అనగా అన్నదానమున, అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని బావము.

వైశాఖ పురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం.
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహరాజ్ 9441288365 hyd

Wednesday, 18 April 2018

అసలు మనం ఎవరో తెలిస్తే ?

నీవు ఎవరు

64లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనె అంటాం.

కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకొ..
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తాయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈదేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన అజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.👏👏👏
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ HYD 9441288365

వైశాఖ మాస విశిష్టత పురాణం

✍✍ఓంకారం గురూజీ మహరాజ్ 9441288365✍✍✍
వైశాఖ పురాణం - 1వ అధ్యాయము

వైశాఖమాస ప్రశంస

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.

నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.

అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.

వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.

మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహరాజ్ hyd 9441288365

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...