ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళుతున్నారు. దారిలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర ఒక చెట్టు కింద అలసట తీర్చుకోవటానికి కాసేపు ఆగారు.
బుద్ధుడు ఒక శిష్యుడిని సరస్సు నుంచి నీళ్ళు తెచ్చిపెట్టమన్నాడు తాగటానికి. శిష్యుడు సరస్సు దగ్గరికి వెళ్ళాడు...అక్కడ కొంతమంది మహిళలు బట్టలు ఉతుకుతున్నారు...పైగా అప్పుడే ఒక ఎడ్లబండి సరస్సు పక్కనుంచి వెళ్ళింది..దుమ్ము, మట్టి గాలికి ఎగిరివచ్చి నీళ్ళల్లో పడింది...నీరు మురికిగా ఉంది...అలాంటి నీరు తాగటం మంచిది కాదు అనుకున్నాడు...వెనక్కి వెళ్ళి బుద్ధుడికి చెప్పాడు నీళ్ళు మురికిగా ఉన్నాయి అని...
ఒక అరగంట తర్వాత బుద్ధుడు అదే శిష్యుడికి మళ్ళీ నీళ్ళు తేవాల్సిందిగా చెప్పాడు...శిష్యుడు సరస్సు దగ్గరికి వెళ్ళి చూసాడు...మట్టి అంతా నీళ్ళ కింద అడుగున చేరుకుంది...పైన నీళ్ళు తేటగా, స్వచ్ఛంగా ఉన్నాయి...ఆ నీళ్ళు ఒక కుండ నిండా పట్టి బుద్ధుడికి తెచ్చి ఇచ్చాడు శిష్యుడు...
అప్పుడు బుద్ధుడు చెప్పాడు...ఈ సరస్సు నీళ్ళలాగానే మన మనసు కూడా ఒక్కోసారి కుదురు లేనట్టు గజిబిజి ఆలోచనలతో చికాకుగా ఉంటుంది..అలాంటి మనసుతో సరైన నిర్ణయాలు తీసుకోలేము...అలాంటప్పుడు ఈ సరస్సు నీళ్ళకు కాస్త సమయం ఇచ్చి అలానే వదిలేసాము కదా..అప్పుడు నీళ్ళు వాటంతట అవే నెమ్మదిగా సర్దుకున్నాయి..మట్టి అంతా కిందకు చేరి పైన నీళ్ళు స్వచ్ఛంగా మారినాయి...
అలానే మన మనసుకు కూడా కొంచెం సేపు మనం ఏమీ సర్దిచెప్పుకోకుండా..తన దారిన తనను కాసేపు వదిలెయ్యాలి...కొంచెం సేపు తర్వాత ఆలోచనల ఉధృతి తగ్గి మనసు కుదుటపడుతుంది...అప్పుడు ఏ నిర్ణయం అయినా సరిగ్గా తీసుకోగలము....కుదురైన మనసే మంచి నిర్ణయాలు తీసుకోగలదు...
మీ శ్రేయోభిలాషి గురూజీ మహరాజ్ 9441288365

No comments:
Post a Comment