Friday, 15 December 2017

ఇక్కడ కుక్కకి తెలివి ఉన్నదా ? == గొప్ప ఇంటి అమ్మాయికి తెలివి ఉన్నదా ?

✍🏼 నేటి కథ ✍🏼

చిత్రపటం

ఒకసారి ఒక ధనవంతురాలు తన చిత్రపటాన్ని గీసే పని ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి అప్పగించింది. ఆ చిత్రకారుడు ఎంతో కష్టపడి, ఎన్నోరోజులు శ్రమించి ఆ ధనవంతురాలి చిత్రాన్ని చాలా గొప్పగా వేశాడు. చిత్రపటం పూర్తయ్యాక ఆ చిత్రకారుడు ఆమెను తన స్టుడియోకి ఆహ్వానించాడు.

ఆమె టామీ అనే తన పెంపుడుకుక్కను వెంటబెట్టుకుని వచ్చింది. ఆమెకు తన కుక్కంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో తన కుక్కను మించిన తెలివైన జంతువు మరొకటి ఉండదని నమ్ముతుంది.

''టామీ డార్లింగ్‌! ఇదుగో నీ యజమాని'' అంటూ ఆమె తన చిత్రపటాన్ని ఆమె టామీకి చూపించింది. టామీ ఆ బొమ్మను చూడటానికి ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.

అప్పుడా ధనవంతురాలు చిత్రకారుడివైపు తిరిగి ''ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది. అందుకే టామీ నా బొమ్మను గుర్తుపట్టలేక పోయింది'' అంది.

ఆ చిత్రకారుడు కాస్త తెలివైనవాడు. ధనవంతులు ఎన్నిరకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తారో అతను ఊహించగలడు. అతను ఆమెతో వాదించలేదు. ''మేడమ్‌! మీరు రేపు రాగలరా? మీ టామీకి నచ్చేలా ఈ బొమ్మలో మార్పులు చేస్తాను'' అన్నాడు.

మరునాడు ఆ ధనవంతురాలు టామీతో వచ్చింది. ఈ సారి టామీ చిత్రపటాన్ని చూడగానే తోక పైకెత్తి దాని దగ్గరకు పరుగుదీసింది. చాలా ఆసక్తిగా ఆ చిత్రపటాన్ని నాకడం మొదలెట్టింది.

''ఓస్ అద్భుతంగా గీశారు. మా టామీకే కాదు నాకు కూడా బొమ్మ చాలా నచ్చింది'' సంతోషంగా అందామె.

ఆమె చిత్రకారుడు అడిగిన డబ్బు ఇచ్చి ఆ చిత్రపటాన్ని కొనుక్కుని తనతో తీసుకుని వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయాక ఆ చిత్రకారుడు పడీ పడీ నవ్వాడు. అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు. ఆ మాంసం వాసన టామీ చిత్రపటాన్ని నాకేలా చేసింది అంతే!

నీతి.. విషయ జ్ఞానం తెలిసినవారికే... దాని గొప్పతనం తెలుస్తది..
మా పేజీని లైక్ చేయండి షేర్ చేయండి..
https://www.facebook.com/Omkaram.GURUJI.MAHARAJ.9441288365.HYD.Live.PROGRAM/?ref=br_tf
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది ...
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...