రైతులకి ఎక్కడ విలువ లేదు
కార్పొరేట్ అఫసుల్లో కానీ ప్రధాన కార్యాలయాల్లో కానీ మారె ఇతర రంగాల్లో కాని....
జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎంతవరకు అమలు అవుతుంది....
రైతే రాజు అంటారు ఎక్కడ ఉంది ఈ రాజు తనం...
అసలు రైతులు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు... పంట పండించే రైతు బాగాలేకపోతే ఈ లోకానికి జీవన మనుగడ లేదు అనే విషయాన్ని ఈ పాలకులు మాములు ప్రజలం మనం కూడా గుర్తు పెట్టుకోవాలి...
సకాలంలో వర్షాలు పడకపోవటం కావొచ్చు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లభించక పోవటం కావొచ్చు....అప్పు తీసుకున్న బ్యాంకు రుణ ఒత్తిడిలు కావొచ్చు మరింకేదైనా కారణం కావొచ్చు...
ముఖ్యంగా రైతులు బాగుండాలి.... తానూ పండించిన పంటకి తానె ధర నిర్ణయించే స్థాయిలో రాజ్యాలు రావాలి.. అప్పుడే అనాలి రైతే రాజు .....
ఇంకొక విషయం జై జవాన్ అంటున్నాము కదా ..???
ఈ రోజు ఈ క్షణం బ్రతికి ఉన్నాము అంటే నా భరతమాత నిజమైన ముద్దు బిడ్డలు ఆర్మీ జవానులు
తన తల్లి తండ్రిని కట్టుకున్న అర్ధాంగిని కనిపెంచిన బిడ్డలను వదిలేసి మన దేశ సరిహద్దుల్లో నిరంతరం కంటిమీద కునుకులేకుండా డ్యూటీ చేస్తూ ఎందరో నా భరతమాత ఒడిలో ఆసులు బారి తిరిగిరాని కనిపించని లోకాలకు పోయిన నా వీర జావనుల భార్య బిడ్డలకు ఎంత మందికి న్యాయం జరుగుతుంది....
ఈ రెండు రంగాల్లో ఉన్నవారి కంటికి నీరు రాకుండా ఉన్నప్పుడే ( నా భరతమాత / భారతదేశం ) ప్రజలు సంతోషంగా ఉంటారు...
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365 ఈ పేజీని లైక్ చేసి షేర్ చేయగలరు


No comments:
Post a Comment